శివుడి జోతిర్లింగాల గురించి అద్భుత రహస్యాలు: మొదటి జోతిర్లింగం సోమేశ్వరం యొక్క ప్రాముఖ్యత

Posted By: Lekhaka
Subscribe to Boldsky

శివుడు భారతదేశంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు విధ్వంసం చేసే దేవుడు. సాధారణంగా శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తారు.

12 జ్యోతిర్లింగాలు లేదా శివలింగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుని నిజమైన భక్తులు జ్యోతిర్లింగాల వద్ద శివునికి ప్రణామాలు చెల్లించడానికి ప్రయత్నిస్తారు. మొత్తం జ్యోతిర్లింగాలను ఒకే ప్రయాణంలో సందర్శించటం సాధ్యం కాదు. అందువలన, భక్తులు ఒక సమయంలో ఒకటి లేదా రెండు జ్యోతిర్లింగాలను సందర్శించాలి. అలాగే వారి జీవితకాలంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించటానికి ప్రయత్నించాలి.

12 జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో శివలింగంగా వెలిశారు. జీవితంలో మొత్తం జ్యోతిర్లింగాలను సందర్శిస్తే ఆ వ్యక్తి మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు.

శివుని పాదాల వద్ద మోక్షాన్ని సాధిస్తారు. జ్యోతిర్లింగం గురించి మరొక ప్రత్యేక నమ్మకం ఉంది. అది ఏమిటంటే జ్యోతిర్లింగం ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. అయితే, అది ఒక దివ్య కాంతి లేదా 'జ్యోతి' కలిగి ఉంటుంది. ఈ జ్యోతిని అందరు చూడలేరు. ఒక వ్యక్తి అధిక ఆధ్యాత్మికత స్థాయికి చేరుకొని నిజమైన భక్తుడిగా మారినప్పుడు మాత్రమే జ్యోతిని చూడగలరు.

12 జ్యోతిర్లింగాల సంస్కృత శ్లోకం యొక్క వివరణ

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్

ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్

సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే

హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః

సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

ప్రతి రోజు ద్వాదశ జ్యోతిర్లింగం శ్లోకాన్ని పఠిస్తే ఏడేడు జన్మలలో చేసిన పాపాలు అన్ని పోతాయని భక్తుల నమ్మకం.

మొత్తం జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన సోమేశ్వర లింగం గురించి మరింత వివరంగా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

ఇది ఎక్కడ ఉంది

ఇది ఎక్కడ ఉంది

సోమేశ్వర్ ను సోమనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఇది సౌరాష్ట్ర, గుజరాత్ లో ప్రభాస్ పట్టణంలో ఉంది. గుజరాత్ లో మరొక జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకలో ఉంది.

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు

జ్యోతిర్లింగాలిలో మొదటిది అయిన ఈ ఆలయంను 7 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం శతాబ్దాలుగా నాశనం మరియు ఎన్నో సార్లు పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న ఆలయం భారతదేశంనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్థాపించబడింది.

పేరు ఎలా వచ్చింది

పేరు ఎలా వచ్చింది

సోమనాథ్ తీర్ధం గురించి స్కంధ పురాణంలోని ప్రభాస కందా అధ్యాయంలో వివరించబడింది. ప్రభాస కందా అధ్యాయంలో ఈ శివలింగంను కాలభైరవ శివలింగం అని చెప్పారు.చంద్రుడు ఈ లింగాన్ని పూజించటం వలన 'సోమనాథ్' అని పేరు వచ్చింది. మహాభారతంలో కూడా ప్రభాసతీర్థము వద్ద చంద్రుడు శివునికి పూజలు చేసాడనే ప్రస్తావన కూడా ఉంది.

జ్యోతిర్లింగంగా ఎందుకు పిలుస్తున్నారు

జ్యోతిర్లింగంగా ఎందుకు పిలుస్తున్నారు

శివలింగం అగ్నిని జ్వలిస్తూ ఒక కిరణంగా కన్పిస్తోందని చెప్పుతారు. జ్యోతిర్లింగం ఉదయం రుగ్వేదంగాను, మధ్యాహ్న సమయంలో యజుర్వేదం, సాయంత్రం సామవేదం, రాత్రి అధర్వణ వేదంలా కనిపిస్తుంది.

లింగం వివరణ:

లింగం వివరణ:

ఈ శివలింగం ఇక్కడ ఒక గుడ్డు పరిమాణంలో ఉంటుంది. అలాగే సూర్యుడు వలె ప్రకాశవంతముగా ఉంటుంది. ఈ శివలింగం భూగర్భంలో ఉంటుంది. అలాగే చూడటానికి సాధ్యం కాదు.

జ్యోతిర్లింగం వెనక ఉన్న కథ

జ్యోతిర్లింగం వెనక ఉన్న కథ

దక్ష ప్రజాపతికి 27 నక్షత్రాలు కుమార్తెలుగా జన్మించెను. దక్ష ప్రజాపతి కుమార్తెలను అందమైన చంద్ర దేవునికి ఇచ్చి వివాహం చేసెను. చంద్ర దేవుడు రోహిణి మీద ఎక్కువ ప్రేమను చూపుతూ మిగతా భార్యలను పట్టించుకోవటం లేదు. ఈ విషయం తెలిసిన దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రున్ని నిందించెను. చంద్రున్ని బలహీనం అవుతావని శపించెను. దాంతో చంద్రుడు ప్రభాస పట్టణంనకు వెళ్లి సోమేశ్వర యొక్క స్పర్శ లింగాన్ని ప్రార్ధించేను. శివుడు ప్రత్యక్షం అయ్యి చంద్రున్ని ఆశీర్వదించెను. ఆ శాపం రద్దు కాదని కొంచెం సవరించెను. శుక్ల పక్షంలో వెలుగు రోజు రోజుకూ చంద్రుడి వెలుగు పెరుగుతుంది. కృష్ణ పక్షంలో వెలుగు రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు.

ఈ జ్యోతిర్లింగం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత

ఈ జ్యోతిర్లింగం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత

త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఇక్కడ భ్రహ్మశిలను స్థాపించుట మరియు మొదట నిర్మించిన మరియు ప్రారంభించిన దేవాలయం ఇది.

ఇక్కడ జరుపుకొనే ముఖ్యమైన పండుగలు

ఇక్కడ జరుపుకొనే ముఖ్యమైన పండుగలు

మహా శివరాత్రి పండుగ సోమేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క అతి ముఖ్యమైన పండగలలో ఒకటిగా ఉంది.అలాగే మరొక పండుగ సోమనాథ్ మహాదేవ్ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో శివుని కుమారుడు అయిన లార్డ్ కార్తికేయ పుట్టిన రోజును జరుపుకొంటారు. లార్డ్ కార్తికేయ గౌరవార్థం జానపద నృత్యాలు, రంగస్థల ప్రదర్శనలు మరియు సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.

English summary

Important Shiva Temples | The Twelve Jyotirlingas Of Lord Shiva | Story Of The First Jyotirlingas Of Lord Shiva | Mythological Importance Of Jyotirlingas Of Lord Shiva

Take a look at the important temples of jyotirlingas of lord shiva. Also read to know the story of the first jyotirlingas of lord shiva.
Please Wait while comments are loading...
Subscribe Newsletter