For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telugu Hanuman Jayanti 2021:ఆంజనేయుడిని ఎలా ఆరాధిస్తే.. ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందంటే...

ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం తొలి నెల అయిన ఈ నెలలో ఉగాదితో పాటు అనేక పండుగలు వస్తాయి.

https://telugu.boldsky.com/spirituality/hanuman-jayanti-2021-date-shubh-muhurat-puja-timings-and-significance-026277.html

అందులో ముఖ్యమైనవి ఉగాది పండుగ, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతితో పాటు ఛైత్ర శుద్ధ పౌర్ణమితో పాటు ఎన్నో ప్రత్యేక రోజులు వస్తాయి. ఇప్పటికే ఉగాది పండుగ, శ్రీరామ నవమిని పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం.

https://telugu.boldsky.com/spirituality/hanuman-jayanti-2021-date-shubh-muhurat-puja-timings-and-significance-026277.html

ఇప్పుడు రాముని భక్తుడైన హనుమంతుని జయంతిని జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా ఆంజనేయుడిని అనుగ్రహం పొందాలంటే.. ఎలాంటి పూజలు చేయాలి.. హనుమతుడిని ఎలా ఆరాధించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Hanuman Jayanti 2021 : ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైనది.. ఎందుకో తెలుసా...Hanuman Jayanti 2021 : ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైనది.. ఎందుకో తెలుసా...

దీపారాధన..

దీపారాధన..

ఛైత్ర శుద్ధ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తెల్లవారుజామునే స్నానం చేసి, పూజా మందిరంలో లేదా ఏదైనా ఆంజనేయుని దేవాలయానికి వెళ్లి ఆ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, పువ్వులు, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫొటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. అక్కడ జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో హనుమంతుడికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ లభిస్తాయి.

సాయంకాలం వేళలో..

సాయంకాలం వేళలో..

హనుమాన్ జయంతి రోజున సాయంకాలం సూర్యస్తమయం తర్వాత ఆరు గంటల ప్రాంతంలో ఆంజనేయుని ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించడానికి ముందు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించాలి.

హనుమాన్ చాలీసా..

హనుమాన్ చాలీసా..

హనుమంతుడిని పూజించే సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో భజరంగి భగవంతుడిని స్తుతించుకోవాలి. లేదా ‘ఓం ఆంజనేయాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హనుమాన్ ధ్యాన శ్లోకాలు, హనుమాన్ చాలీసా పుస్తకాలు దానం చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరతాయని చాలా మందికి నమ్మకం.

hanuman jayanti 2021 : రామునికి, హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?hanuman jayanti 2021 : రామునికి, హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?

పురాణ కథ..

పురాణ కథ..

పురాణాల ప్రకారం, ఒకసారి శని హనుమంతుడిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి తనను తలకిందులుగా చేసి ఎగురవేశాడు. దీంతో శని తన అపరాధాన్ని తెలుసుకుని మన్నించమని వేడుకొనగా, ఆంజనేయస్వామి భక్తులను ఎల్లప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాతే వదలిపెడతాడు. అందుకే ఏలి నాటి శని దోషం ఉన్న వారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషం తగ్గుతుందని చాలా మంది నమ్మకం.

హనుమ లేకపోతే..

హనుమ లేకపోతే..

హనుమంతుడు లేకపోతే రామాయణానికి అర్థమే లేదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని పుత్రుడైన పవన కుమారుడు మహా బలుడు. అర్జునికి ప్రియు సఖుడు. శ్రీరామ దాసుడు. ఎర్రని కనులున్న వానరుడు, సప్త సముద్రాలను దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు కాపాడుడు. దశకంఠుడైన రావణుని గర్వం అణిచినవాడు. హనుమంతుని స్మరించిన వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.

తమలపాకుల పూజ..

తమలపాకుల పూజ..

మరో కథనం ప్రకారం.. అశోక వనంలో ఉన్న సీతమ్మ దేవికి, ఆంజనేయుడు రాముల వారి సందేశం చెప్పే సమయంలో ఆ జానకి దేవి ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. (ఆ సమయంలో పువ్వులు కనిపించకపోవడంతో) అందుకే స్వామి వారికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు.

English summary

Telugu Hanuman Jayanti 2021 Puja Vidhi, Rituals and How to Please Lord Hanuman

Here we talking about the hanuman jayanti 2021 puja vidhi, rituals and how to please lord hanuman. Have a look
Desktop Bottom Promotion