బోరోదేవి దేవాలయంలో ఆసక్తికర విషయాలు: మానవుని రక్తాన్ని సమర్పణ!

Posted By: Staff
Subscribe to Boldsky

దేవాలయాలను భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను పాటించడం వలన చాలా వింతగా ఉంటాయి.

ఇంటి పైకప్పు నుండి పిల్లలను విసరడం నుండి కాళ్ళకి ఏమి లేకుండా (బేర్ఫుట్ వాకింగ్ ) నడవడం వరకు, వివిధ ఆచారాల పేర్లతో ప్రజలు దేవుళ్లను సంతోషపెట్టడానికి చేసే అనేక రకాల వింత పద్ధతులున్నాయి.

మానవ రక్తాన్ని దేవుళ్ళకి ప్రసాదంగా అందించే ఆచారం ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో పాటిస్తున్నారని మీకు తెలుసా? ఇది శతాబ్దాలుగా ఇక్కడ అనుసరించ బడుతున్న వింత ఆచారం మరియు దీన్ని ఇప్పటికీ నిషేధించకుండా ఉండటం, ప్రజలు ఇంకా దానిని అనుసరించడం నిజంగా ఆశ్చర్యకరం!

మానవ రక్తాన్ని సమర్పణ చేస్తున్న బోరోదేవి ఆలయం యొక్క వింత ఆచారం వెనుకగల చరిత్రను చూడండి.

ఇక్కడ జంతువులకు బదులుగా మనుషులను త్యాగం చేసేవాళ్ళు.....

ఇక్కడ జంతువులకు బదులుగా మనుషులను త్యాగం చేసేవాళ్ళు.....

ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం కొంచం భిన్నం గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు దేవుళ్ళని సంతోషపరచడానికి మానవుల రక్తాన్ని బలి ఇచ్చేవాళ్ళు. ఈ మానవుల త్యాగ సాధన సుమారు 250 సంవత్సరాలకు ముందే నిషేధించబడింది. దానిని నిషేధించడానికి ముందువరకు మానవులను త్యాగం చేసేవాళ్ళు.

మానవ రక్తాన్ని త్యాగం చేస్తున్న దాని గురించి మరికొన్నివిషయాలు......

మానవ రక్తాన్ని త్యాగం చేస్తున్న దాని గురించి మరికొన్నివిషయాలు......

ప్రతి అష్టమి రోజు రాత్రి, మూసిన తలుపుల వెనుక ఈ పూజను నిర్వహిస్తారు, దీనిలో మానవ రక్తపు సమర్పణ యొక్క వింత సంప్రదాయం 52 ఏళ్ల షిబెద్ర నాథ్ రే ద్వారా చేయబడుతుంది.ఇక్కడి భక్తులు మానవ రక్తం సమర్పించకుండా పూజ పూర్తవదని విశ్వసిస్తారు.

ఈ మూఢ నమ్మకానికి విముక్తి కలిగింది.

ఈ మూఢ నమ్మకానికి విముక్తి కలిగింది.

రాజ్యంలోని అన్ని మతపరమైన కార్యకలాపాలను చూసుకునేందుకు భక్షి అనే వ్యక్తి రాజుచేత నియమింపబడ్డాడు. మానవ బలి యొక్క దృశ్యాలు చాలా గోరంగా ఉండటం వలన అతడు ఈ వింత ఆచారాన్ని నిషేధించమని రాజును బ్రతిమాలాడాడు.

ప్రస్తుతం, ఇది 3 చుక్కల రక్తంతో కొనసాగించబడుతోంది

ప్రస్తుతం, ఇది 3 చుక్కల రక్తంతో కొనసాగించబడుతోంది

మానవులను బలి ఇవ్వడం నిషేధించిన తరువాత, ప్రజలు శిరచ్ఛేద శిలలపై 3 రక్తపు చుక్కలని అందించడం ప్రారంభించారు. మానవ రక్తం ఇవ్వకపోతే పూజ అసంపూర్తి అవుతుందని ఇక్కడి పండితులు నమ్ముతారు.

మీరూ ఈ ప్లేస్ ని చూడాలనుకుంటున్నారా? దిగువ వ్యాఖ్య విభాగంలో దీని మీద గల మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

English summary

The Borodevi Temple Where Human Blood Is Offered!

There is an ancient temple where the practice of offering human blood still exists. This is a bizarre practice that has been followed here since centuries and it is something that has still not been banned, as people can be still seen following it.
Subscribe Newsletter