For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత శక్తి స్వరూపిని దుర్గామాత

|

విశ్వమాతగా పేరుగాంచిన దుర్గా దేవి సకల దేవతల శక్తులను తనలో ఐఖ్యం చేసుకున్న స్త్రీ దేవతగా విరాజిల్లుతుంది. భూమి మీద పురుష దేవుళ్ళ నుండి ఎటువంటి హానీ కలుగకుండా వరాన్ని పొందిన ఒక రాక్షసుని అంతమొందించేందుకు అవతారందాల్చిన స్త్రీ శక్తి దుర్గా దేవి. ఆ రాక్షసుని పేరు మహిషాసురుడు అయితే, మహిషాసురుని అంతమొందించింది కాబట్టి, ఆమెను మహిషాసుర మర్ధినిగా పిలవడం జరుగుతుంది. సకల శక్తి సంపన్నురాలైన దుర్గా దేవి తన భక్తులకు శక్తి, జ్ఞానం, సంపద, ఆరోగ్యం వంటి అన్నో అంశాలలో తోడుగా నిలుస్తుందని చెప్పబడుతుంది.

తరతరాలుగా అమ్మవారికి పూజిస్తూ, ఆమెని ఆరాధిస్తూ జీవితాన్ని అంకితం చేసిన మహా భక్తులు ఎందరో ఉన్నారు. వారి క్రమశిక్షణ, పట్టుదలతో దుర్గాదేవి ఆశీస్సులు సైతం తోడై క్రమంగా వారు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు కూడా. వారిలో కొందరి వివరాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

The Great Devotees Of Goddess Durga
 

1. శ్రీ రామకృష్ణ పరమహంస :

శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందకు గురువు. ఇతన్ని మహాకాళీదేవి భక్తునిగా చెప్పబడుతుంది. ఒకనాడు తన ముందు దుర్గాదేవి కనిపించాలని దేవిని నానావిధాలుగా అభ్యర్థించాడు. ఆమె కనిపించకపోవడంతో తన తలనే అర్పించాలని కూడా నిర్ణయించుకున్నాడు. అమ్మవారి ముందు రుద్రతాండవం చేసినా, ఆమె కనిపించకపోవడంతో తన తలను నరికేందుకు కత్తిని పైకి ఎత్తాడు. అయితే, అతని భక్తికి సంతసించిన దుర్గాదేవి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్లుగా చెప్పబడుతుంది. తరువాత చాలా రోజుల పాటు రామకృష్ణ పరమహంస జ్ఞాన సమాధిలోకి వెళ్ళాడు. అతని బోధనలన్నింటినీ ' శ్రీ రామకృష్ణ సువార్త ' అనే గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి.

2. ఆదిశంకరాచార్య :

ఆధ్యాత్మిక రంగంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులలో ఒకరైన ఆది శంకరాచార్య 8వ శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేసి, అద్వైత వేదాంత స్థాపన గావించి ప్రచారం చేశాడు. పుష్పదంతతో పాటు ' సౌందర్య లాహిరి ' అనే గ్రంథాన్ని సైతం రచించాడు ఆదిశంకరాచార్యుడు. ఈ గ్రంధాన్ని పార్వతీ దేవిని స్తుతిస్తూ చెప్పిన గ్రంథంగా చెప్పబడుతుంది. ఆదిశంకరాచార్యులు కైలాసానికి కూడా వెళ్లి అక్కడ శివ, పార్వతులను పూజించారని నమ్మబడుతుంది. గాయత్రీ మంత్రాన్ని లోకానికి బహిర్గతం చేసిన వ్యక్తిగా ఆది శంకరాచార్యుల వారిని చెప్పుకుంటారు.

The Great Devotees Of Goddess Durga
 

3. బామకేప (బామచరణ్ చటోపాధ్యాయ) :

బెంగాల్లో పుట్టిన, రామకృష్ణ పరమహంస సమకాలీనుడుగా బామకేపను పేర్కొనడం జరుగుతుంటుంది. ఇతడు రామకృష్ణుని వలెనే మహంకాళీ దేవి భక్తుడు. కానీ ఇతను మహంకాళీ స్వరూపం అయిన తారా దేవిని పూజించేవానిగా చెప్పబడుతుంది. మౌలిక్ష దేవాలయంలో ఎప్పుడూ ఉండేవారని, తాంత్రిక సాధనలను ఆచరించేవాడని చెప్పబడుతుంది. ఆయన ఎన్నడూ సాంప్రదాయక ఆచారాలను నమ్మలేదు, పాటించలేదు. కానీ పాటలు కూర్చడం, పాడడం వంటి ఇతర విధానాల ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచేవాడు. తారభ్యంతరంగా తారాపీఠానికి పీఠాదిపతిగా కీర్తింపబడ్డాడు. ప్రహ్లాద చంద్ర బ్రహ్మచారి కూడా దుర్గా దేవికి ఇటువంటి భక్తునిగానే ఉన్నాడు.

4. ధ్యాను భగత్ :

ధ్యాను భగత్ జ్వాలాముఖీ దేవి భక్తునిగా కీర్తించబడ్డాడు. జ్వాలాముఖి దుర్గాదేవికి మరో మరో రూపంగా చెప్పబడుతుంది. దేశమంతా ఉన్న అమ్మవారి శక్తి పీఠాలలో హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి దేవాలయం కూడా ఒకటి. ధ్యాను భగత్ అమ్మవారి పట్ల చూపే విశ్వాసాన్ని, మరియు అమ్మవారి శక్తులను కూడా అప్పటి రాజు అక్బర్ పరీక్షించినట్లు చెప్పబడుతుంది,. పర్యవసానంగా దుర్గాదేవి మహిమలను తెలుసుకున్నాక, అతడు కేవలం క్షమాపణలు చెప్పడమే కాకుండా, ఈ పవిత్ర ఆలయానికి కాలినడకన కూడా ప్రయాణమయ్యాడని చెప్పబడుతుంది.

5. విమలానంద :

విమలానంద దుర్గా దేవి భక్తుడు. కాకపోతే ఆమెను పూజించడం కోసం తాంత్రిక మార్గాన్ని అనుసరించాడని చెప్పబడుతుంది. అతను గోప్యతను నిర్వహించడానికి, బహిరంగంగా ప్రజల ముందు రావడం నివారించినప్పటికీ, అతని బోధనలను రాబర్ట్ స్వబాడా అనే శిష్యుడు తన పుస్తకంలో రాసుకుని అఘోరా అనే పేరుతో ప్రచురించడం జరిగింది. ఇది మూడు భాగాలుగా అందుబాటులోకి వచ్చింది.

6. స్వామి వివేకానంద :

రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద మహాకాళీ దేవిని పూజించేవారు. ధ్యానం కోసం ఏకాంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు దుర్గాదేవిని కూడా చూశారని చెప్పబడుతుంది. ఒకసారి స్వామీ వివేకానంద ఖీర్ భవాని ఆలయాన్ని సందర్శించినప్పుడు, ఆలయం శిధిలావస్థలో ఉండడం చూసి చలించిపోయాడు. ఆ ఆలయ పరిరక్షణకోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, దుర్గా దేవి తన ముందు ప్రత్యక్షమై, ఆ దేవత ప్రజలకు రక్షగా ఉంటుందని, తనకు ప్రజల రక్షణ అవసరం లేదని , కావున ఆలయ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివేకానందునికి వివరించినట్లుగా చెప్పబడుతుంది.

The Great Devotees Of Goddess Durga

7. పరమహంస యోగానంద :

క్రియా యోగాన్ని ప్రచారం చేసిన వ్యక్తిగా ఇతని పేరు సుపరిచితం. నిరంతరం అమ్మవారి దర్శనాన్ని కోరుతూ, అమ్మవారి సన్నిధిగానున్న దక్షిణేశ్వర ఆలయాన్ని సందర్శించి, ఆమెకు ప్రార్థనలను అందజేసినట్లు చెబుతారు. తన భక్తికి ముగ్ధుడైన దుర్గా దేవి సైతం అతని ముందు ప్రత్యక్షమై ఆశీస్సులను అందిచినట్లుగా చెప్పబడుతుంది.

8. రాంప్రసాద్ సేన్ :

స్వయానా ఒక కవిగా ఉన్న కారణాన, రాంప్రసాద్ సేన్ అమ్మవారిని స్తుతిస్తూ ఎన్నో పద్యాలను వ్రాయడం జరిగింది. ఈ పద్యాలను తరచూ రామకృష్ణ పరమహంసగారు కూడా పాడారు. అటువంటి ఉత్తమ కవులలో మరో భక్తునిగా కమలాకాంత్ భట్టాచార్య ఉన్నారు. ఇతని పద్యాలను కూడా రామకృష్ణ పరమహంస పాడినట్లు చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: durga hindu gods శక్తి
English summary

The Great Devotees Of Goddess Durga

Goddess Durga is the prime deity of Shaktism tradition of Hinduism. Many great devotees became renowned across the world for their true devotion towards the Goddess. Sri Ramakrishna Paramahamsa, Adi Shankaracharya, Bhamkhepa, Dhyanu Bhagat, Prahlad Chandra Brahmachari, Vimalananda, Swami Vivekananda, Yogananda Paramahamsa and Ramprasad Sen were some of them.
Story first published: Friday, March 29, 2019, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more