కనకదుర్గ గుడి గురించి ఆసక్తికరమైన విషయాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని ఇంద్రఖీలాద్రి కొండపై కనక దుర్గ ఆలయం నెలకొంది. కనకదుర్గమ్మ వారు ఇందులో కొలువై ఉంటారు. మహిషాశుర మర్ధిని గా మాత ప్రసిద్ధి చెందారు. మహిషాసురుడనే రాక్షసుడిని వధించడం వలన మాతను మహిషాసుర మర్ధినీగా కొలుస్తారు. స్వయంభూగా మాత ప్రసిద్ధి చెందారు. అంటే, మాత తనంతట తానే త్రేతాయుగంలో ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం.

ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతను అనేక గాధలు వివరిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన కథ ఏంటంటే ఒకప్పుడు ఈ స్థలం బీడు భూమిగా ఉండేది. రాతి భూభాగం వలన ఇక్కడ నుంచి కృష్ణా నది పారేది కాదు. అప్పుడు, పరమశివుడు కృష్ణా నదిని ఇక్కడ నుంచి ప్రవహించేలా ఏర్పాట్లు చేశాడు. అందువలన, ఈ భూమి సారవంతంగా మారింది. అందువలన, ఈ స్థలం ఇప్పుడు అందంగా కళకళలాడుతోంది. ఈ నది సొరంగాల గూండా ప్రవహిస్తుంది.

The Kanaka Durga Temple

కనకదుర్గ ఆలయం:

మరొక కథ ప్రకారం పాండవులలో ఒకడైన అర్జునుడు ఈ స్థలంలోనే ఘోర తపస్సు చేసి ఆ 1తరువాత పరమశివుడి వద్ద నుంచి పశుపతి అస్త్రాన్ని పొందాడు. యుద్ధంలో విజయం సాధించేందుకై పరమశివుడ్ని దీవించమని వేడుకున్నాడు. అందువలన కూడా ఈ స్థలం విజయవాడగా ప్రసిద్ధి చెందింది.

అయితే, మరొక ప్రఖ్యాత స్థల పురాణం ప్రకారం, మహిషాసురుడనే రాక్షసుడు ఈ స్థలంపై దాడికి దిగాడు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు మహిషాసురుడు రాక్షసత్వానికి భయపడిపోయారు. ఇంద్రకీలా అనబడే ఋషి కనకదుర్గ మాత యొక్క కరుణాకటాక్షాలకై ఘోరతపస్సుని చేశాడు. ఇంద్రకీలుడి తపస్సుకి మెచ్చిన మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని ఇంద్రకీలుడిని అడిగింది. తన తలపై కొలువుండి రాక్షసుల ఆటను కట్టించాలని ఇంద్రకీలుడు మాతను కోరాడు. మాత అతని కోరికను మన్నించి మహిషాసురుడిని వధించింది. తిరిగి విజయవాడలోని ఈ ప్రాంతం మొత్తం శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది. అప్పటి నుంచి ఈ మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో కొలవడం ప్రారంభించారు. ఆ తరువాత, ఈ ఆలయాన్ని ఈ సంఘటనకు గుర్తుగా నిర్మించారు.

ఈ ఆలయంలో నాలుగు అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. అమ్మవారు ఎనిమిది చేతులలో ఎనిమిది రకాల ఆయుధాలను పట్టుకుని ఉంటారు. శూలంతో అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని వధిస్తున్నట్టు కనిపిస్తారు. ఈ రూపం అనేది ఎంతో శక్తివంతమైనది. ఇటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పరచుకుంటే నెగటివిటీ అంతా తొలగిపోతుంది. నగలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. సౌందర్యరాశి అమ్మవారు.

ఈ ఆలయంలో కొలువున్న ప్రధాన దేవత కనకదుర్గ అమ్మవారు భక్తులను వివిధ రూపాలలో దీవెనలను అందిస్తూ ఉంటారు. పాండవులలో ఒకడైన అర్జునుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని భక్తుల నమ్మకం. ఈ స్థలం అనేక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తూ ఉంటుంది. స్క్రిప్చరల్ ప్రాముఖ్యత అనేకమందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయం గురించి ఇతిహాసాలలో ప్రస్తావించబడినది. శివ లీలలు అలాగే శక్తి మహిమలను ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది.

సరస్వతీ పూజ అలాగే తెప్పోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దసరా సమయంలో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.

English summary

The Kanaka Durga Temple

The Kanak Durga Temple is located on the Indrakeeladri hill, Vijayawada, near river Krishna. It is dedicated to the Goddess Kanak Durga. This is the place where Arjuna had done the deep penance to acquire the Pashupath Astra. Goddess Kanak Durga killed the demon Mahishasura after she was pleased by a sage who invoked her through meditation at this place.
Story first published: Wednesday, May 9, 2018, 10:00 [IST]