For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుదర్శన చక్రం ఎలా పుట్టింది ? ఆ చక్రం విష్ణువుకే ఎందుకు ?

By Swathi
|

విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తు వచ్చేసి సుదర్శన చక్రం. చేతిలో తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. యుద్ధంలో శత్రువుల నాశనానికి, భక్తుల కోరికలు నెరవేర్చడానికి, భక్తుల ఇబ్బందులు తీర్చడానికి, ఎలాంటి వినాశనాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఈ సుదర్శన చక్రానికి ఉందని.. పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడు రామభక్తుడని తెలుసు..రాముడితోనే యుద్ధం చేశాడని తెలుసా ?

విష్ణుమూర్తి ఆయుధం, సంకేతం అయిన సుదర్శన చక్రం గురించి ఇవాళ తెలుసుకుందాం. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది ? సుదర్శన చక్రానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి ? సుదర్శన చక్రం అన్ని మహిమలను ఎవరి వల్ల పొందింది ? ఎలాంటి కష్టాలు, చెడునైనా నాశనం చేసే శక్తి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి ఉంటుందా ? ఇలాంటి సందేహాలన్నింటికీ పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

విష్ణు

విష్ణు

ఈ విశ్వానికి రక్ష విష్ణుమూర్తి. అందుకే ఈ దేవుడికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది.

శక్తివంతమైన ఆయుధం

శక్తివంతమైన ఆయుధం

దేవుళ్లు, భక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా రూపుమాపే అద్భుత శక్తి కలిగిన ఆయుధం కోసం విష్ణువు వేచి చూశాడు.

శివారాధన

శివారాధన

శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి.. శివుడిని పూజించడం మొదలుపెట్టాడు.

శివుడి అనుగ్రహం కోసం

శివుడి అనుగ్రహం కోసం

అయితే విష్ణువు ప్రార్థించేటప్పుడు శివుడు మైమరిచిపోయి ఉన్నాడు. కానీ.. విష్ణువు మాత్రం శివుడి అనుగ్రహం పొందే వరకు శ్రద్ధా భక్తులతో ప్రార్థిస్తూనే ఉన్నాడు.

సుదర్శన చక్రం ఆవిర్భావం

సుదర్శన చక్రం ఆవిర్భావం

కొన్నేళ్ల పాటు విష్ణువు శివుడి ధ్యానంలో ఉండటంతో.. చివరికి విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు కళ్లు తెరిచాడు. అప్పుడు శివుడు విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంను సృష్టించాడు.

ఆలోచనలతో చక్రం

ఆలోచనలతో చక్రం

తన ఆలోచనలతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం.

విశ్వంలోనే శక్తివంతమైనది

విశ్వంలోనే శక్తివంతమైనది

సుదర్శన చక్రంతో పాటు, దానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే చాలా శక్తివంతంగా మారింది.

విశ్వకర్మ

విశ్వకర్మ

దీనివెనక మరో పురాణ గాధ ఉంది. విశ్వకర్మ కూతురు సూర్య భగవానుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ.. సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఆమె సూర్యుని దగ్గరకు వెళ్లలేకపోతుంది.

సూర్యుడి తేజస్సే సుదర్శన చక్రం

సూర్యుడి తేజస్సే సుదర్శన చక్రం

కూతురి కోసం.. విశ్వకర్ముడు సూర్యుడి తేజస్సుని, వేడిని తగ్గించి.. ఒక వస్తువును తయారు చేస్తాడు. అలా పుట్టిందే విష్ణుచక్రమని మరో కథ వివరిస్తోంది.

చక్రం, త్రిశూలం

చక్రం, త్రిశూలం

సుదర్శన చక్రం, శివుడి త్రిశూలం రెండూ చాలా శక్తివంతమైనవని హిందూ పురాణాలు చెబుతాయి.

మిలియన్ల సార్లు

మిలియన్ల సార్లు

విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకనుకు మిలియన్ల సార్లు తిరుగుతుందట.

108 బ్లేడులు

108 బ్లేడులు

ఈ విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి 108 బ్లేడ్ లు ఉంటాయి. అలాగే కళ్లు మూచి తెరిచే లోపే అనేక మిలియన్ల యోజనాలు తిరిగే శక్తి కలిగి ఉంటుంది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. అలా మిలియన్ల యోజనాలు చుట్టేయగలదు.

దుష్ట వినాశనం

దుష్ట వినాశనం

ఈ విశ్వాన్ని ఎవరైనా, దుష్టశక్తులైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ల తలను సుదర్శన చక్రంతో తీసేసే శక్తి విష్ణుమూర్తికి ఉంటుంది.

నీతి, న్యాయం

నీతి, న్యాయం

సుదర్శన చక్రానికి తెలివి, స్థిరత్వం, నీతి, న్యాయం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

 శ్రీకృష్ణుడికి

శ్రీకృష్ణుడికి

ద్వాపర యుగంలో విష్ణువు ఎనిమిదో అవతారమై శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని అగ్నిదేవుడి ద్వారా పొందుతాడు.

English summary

The Legend Behind The Sudarshana Chakra

The Legend Behind The Sudarshana Chakra. We will look into the origin of God Vishnu’s special weapon and symbol, the Sudarshana Chakra. How was God Vishnu equipped with the weapon that could destroy anything in its path?
Desktop Bottom Promotion