For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంధిపూజకి సంబంధించిన కథలు

మేము సంధిపూజకి చెందిన కథలు, వాస్తవాలు మీ ముందుకు తీసుకొచ్చాం. చదవండి.

By Lekhaka
|

దుర్గాపూజ ఉత్సవాలలో సంధిపూజ ఎంతో ముఖ్యమైన భాగం. 'సంధి' అనేది ఒక సంస్కృత పదం మరియు దాని అర్థం కలపటం, జతచేయటమని. సంధిపూజను సంధి క్షణంలో అంటే ఒక కలయిక క్షణంలో నిర్వహిస్తారు.

ఇది మనల్ని అష్టమి మరియు నవమి తిథుల మధ్య సమయంలో, అవి కలిసేచోట జరిగే ఈ సంధిపూజ వాస్తవికత వైపు నడిపిస్తాయి.

2017 సంవత్సరంలో సంధిపూజ యొక్క సంధిక్షణం సెప్టెంబర్ 28,గురువారం వస్తుంది. 21.12 నుంచి 22.00 వరకూ మొత్తం 47 నిమిషాలు ఉంటుంది.

దశర పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు ఆచారాలుదశర పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు ఆచారాలు

legends of sandhi pooja

సంధిపూజ యొక్క ఈ క్షణాలు ఎంతో పవిత్రమైనవి, ఎందుకంటే ఆ సమయంలో చాముండి దేవి ప్రత్యక్షమై దుష్టత్వాన్ని అంతా నిర్మూలిస్తుంది. ఆ సమయంలో దుర్గాదేవి మరియు చాముండను పూజించిన భక్తులు ఎన్నో వరాలు పొందుతారు.

సంధిపూజ యొక్క ఈ క్షణాలు దగ్గరపడుతుండటంతో, మేము సంధిపూజకి చెందిన కథలు, వాస్తవాలు మీ ముందుకు తీసుకొచ్చాం. చదవండి.

legends of sandhi pooja

చాముండి అమ్మవారి జననం
ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న భయంకర రాక్షసుడు మహిషాసురుడు. భూమిపై మానవులు, స్వర్గంలో దేవతలు అందరూ ఒకేలా అతనంటే భయపడసాగారు. అతను ఇదివరకే తపస్సులు చేసి, బ్రహ్మ విష్ణువుల వద్దనుంచి మానవులు, దేవతల వల్ల మరణం కలగకూడదనే వరం తీసుకున్నాడు.

అందుకని, పార్వతీదేవి దుర్గా అమ్మవారి అవతారమెత్తింది. ఆమెలో అందరు దేవతల చైతన్యం ఇమిడిఉన్నది.

మహిషాసురుడిని చంపటానికి యుద్ధానికి వెళ్ళినపుడు, ఆమె సింహ వాహనంపై పదిచేతుల్లో ఆయుధాలతో భయంకరంగా, వీరోచితంగా ఉన్నది.

యుద్ధం జరుగుతూ ఉండగా, మహిషాసురుడి సేనానులతో పోరాడాల్సి వచ్చింది. వారి పేర్లు చండ మరియు ముండ. వారిని సంహరించటానికి దుర్గాదేవి చండిక అంశ రూపాన్ని ధరించి ముందుకు వచ్చింది. చండికా దేవి నల్లగా ఉండి, ఎర్ర కళ్ళు మరియు నాలుక కలిగివుంది.

చండికా అమ్మవారు రాక్షసులైన చండా, ముండాలను సంహరించింది. దాంతో దుర్గాదేవి సంతోషించి చండికా రూపానికి చండముండులను అంతం చేసిన 'చాముండి' అనే పేరును ఇచ్చింది.

ఈ సంధిక్షణంలోనే చండముండుల అంతం జరిగిందని, అందుకే ఆ సమయంలో సంధిపూజ చేసి చాముండి అమ్మవారిని పూజిస్తారు.

దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ... దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

legends of sandhi pooja

శ్రీరాముడు మరియు దుర్గా అమ్మవారి రూపాన్ని ప్రసన్నం చేసుకునే కథ
తన భార్య కోసం శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో, విజయం తప్పక సిద్ధించటానికి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటం అత్యవసరమైంది. అందుకని సరైన సమయం కాకపోయినా శ్రీరాముడు దుర్గా రూపాన్ని ప్రత్యక్షం చేసుకున్నాడు.

అమ్మవారు అప్పటి వసంతకాలంలో ప్రసన్నమైనది. శ్రీరాముడు చేసిన పూజను 'అకాల బోధన్' అంటారు. ఈ సంధి క్షణంలోనే అమ్మవారు ప్రత్యక్షమై శ్రీరామునికి విజయం కలిగేలా వరం ఇచ్చిందని అంటారు.

legends of sandhi pooja

సంధిపూజలో తామరలతో పూజించటానికి కారణం
రావణుడిపై యుద్ధం గెలిచినందుకు ఆ విజయ వరానికి బదులుగా దుర్గాదేవికి శ్రీరాముడు తన కళ్ళను ఇవ్వటానికి సిద్ధపడ్డాడని అంటారు. రాముడి కళ్ళు తామర పువ్వులలాగా ఉంటాయని కూడా అంటారు. అందుకని అమ్మవారు తనకి తామరలు సమర్పించమని కోరిందట.

ఈరోజుకి కూడా, సంధిక్షణం ముహుర్తంలో దుర్గాదేవి, చాముండి అమ్మవారి భక్తులు వారికి తామరలతో పూజిస్తారు.సాధారణంగా, 108 తామరలు సమర్పిస్తారు, ఎందుకంటే హిందూ మతంలో 108 సంఖ్యను పవిత్రంగా భావిస్తారు. 108 తామరలతో పాటు, 108 నేతిదీపాలు మరియు కర్పూరం కూడా దుర్గాదేవి, చాముండి అమ్మవార్లకి పూజలో చేస్తారు.

English summary

Legends of sandhi pooja | importance of sandhi pooja । సంధిపూజకి సంబంధించిన కథలు । సంధిపూజ ప్రాముఖ్యత

Take a look at the legends of sandhi pooja
Story first published:Monday, September 18, 2017, 15:59 [IST]
Desktop Bottom Promotion