For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దవాళ్ల పాదాలకు దండం పెట్టుకోవడం వెనక సైంటిఫిక్ సీక్రెట్ ఏంటి ?

By Swathi
|

పెద్దవాళ్ల కనిపించగానే కాళ్లకు దండం పెట్టుకోవడం హిందువులు పాటించే ముఖ్యమైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా ఆచారంగా పాటిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు లేదా బంధువులకు, తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, తాతయ్యల గౌరవసూచకంగా కాళ్లకు నమస్కరించడం అనేది సంప్రదాయంగా వస్తోంది.

కానీ ఇప్పుడు, ప్రస్తుత జనరేషన్ లో ఎవరు కనిపించినా హాయ్, హల్లో అని పలకరించడమే.. కష్టంగా మారింది. ఇక పాదాలకు నమస్కరించేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ.. ఈ సంప్రదాయం కొన్ని సందర్భాల్లో, కొన్ని కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల కాస్తనైనా పూర్వ సంప్రదాయానికి ఊపిరి ఉందని చెప్పవచ్చు.

హిందూ సాంప్రదాయాలకున్న అద్భుతమైన శాస్త్రీయ కారణాలు

ఈ సంప్రదాయాన్ని వేదాల నుంచి మనం అలవరచుకున్నాం. వేదాల్లో ఈ పద్ధతిని చరణ్ స్పర్శ్ అని పిలుస్తారు. పూర్వకాలంలో.. తల్లిదండ్రులు, పెద్దవాళ్లు, ఉపాధ్యాయులను పలకరించే ముందు పాదాలకు నమస్కారం చేసుకోవాలని పిల్లలకు నేర్పించేవాళ్లు.

మీకు తెలుసా ? ఒకప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించేవాళ్లు. అలాగే ఎక్కడికైనా వెళ్లే ముందు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. అసలు ఈ సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ? పెద్దవాళ్ల పాదాలకు దండం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ? ఈ సంప్రదాయం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

ప్రస్తుత జనరేషన్ లో ఈ పద్ధతి అరకొరాగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా పుట్టినరోజు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే పద్ధతి పాటిస్తున్నారు.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించండం ముఖ్యమైన సంప్రదాయం అని.. మహాభారతం, అధర్వణ వేదంలో వివరించారు.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

మహాభారతంలో యుధిష్ఠిరుడు పాదాలకు నమస్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించారట. ఈ నమస్కరించడం వల్ల శక్తివంతంగా, గొప్ప అనుభూతి కలుగుతుంది.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

అధర్వణ వేదం ప్రకారం పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించడం వల్ల.. వాళ్ల తెలివితేటలు, పెద్దరికానికి గౌరవం ఇచ్చినట్టు సంకేతమని తెలుపుతుంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తిని గొప్పవాళ్లుగా, ఇతరుల పట్ల గౌరవం పొందుతారు.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

మానవ శరీరంలో పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

ఎప్పుడైతే పెద్దవాళ్ల పాదాలు టచ్ చేస్తారో.. అప్పుడు సానుకూల ఆశీర్వాదం వాళ్ల మనసులో నుంచి ప్రేమగా మీకు అందుతుంది. పాజిటివ్ ఎనర్జీ వాళ్ల పాదాలు, చేతుల ద్వారా నమస్కరించే వాళ్లకు అందుతుంది.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్లు ఎవరైతే మన తలపై చేయి పెట్టి ఆశీర్వదించినప్పుడు వాళ్ల ద్వారా పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవహిస్తుంది.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ?

పాదాలకు నమస్కరించడం అనే ప్రక్రియ వ్యాయామంగా కూడా ఉంటుంది. పాదాలకు నమస్కరించడానికి శరీరాన్ని వంచడం వల్ల.. వెన్నెముక వంగి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చూశారుగా మన పెద్దవాళ్ల ఆచారంలో దాగున్న సీక్రెట్. మరి ఇకపై ఎప్పుడైనా పెద్దవాళ్లు కనిపించినప్పుడు పాదాలకు నమస్కరించి బోలెడు ప్రయోజనాలు పొందుతారు కదూ..

English summary

The scientific reason behind touching elder’s feet

The scientific reason behind touching elder’s feet. It is a very common sight to see Hindus touching the feet of their eldest. The tradition of touching one’s feet, adopted since the Vedic period is called the Charan Sparsh.
Story first published:Monday, April 11, 2016, 16:59 [IST]
Desktop Bottom Promotion