For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలియని, మీరు ఊహించని తాళపత్ర గ్రంథ రహస్యాలు...!

సాధారణంగా మనకు తెలియని విషయాన్ని సందేహంగా భావిస్తే, కొద్దిమంది ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియని విషయాలను రహస్యాలుగా పరిగణిస్తాం! ఆ రహస్యాలేవో తెలుసుకొనేవరకూ, మన మనస్సులోని మథనం అలా కొనసాగుతూనే ఉంటుంది

|

తాళపత్ర గ్రంథాలు నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. చాలామందికి వాటివిలువతెలియక వాటిని అశ్రద్ధ చేయడం మూలంగా గొప్ప యోగులు, ఋషులు, పండితులు, క్రాంతదర్శులు,గురువులు, పండితులు వెలయించిన మహావిజ్ఞాన భాండాగారాలు మట్టిపాలు కావడం బాధాకరం. కొంతమంది ఇళ్ళలో అవి వున్నా బయటివారికి చూపరు. చూపినా చదువనివ్వరు. అలాంటివాళ్ళు వారు మరణిస్తే ఈ తాళపత్ర గ్రంధాల్ని కూడా నాశనంచేయడం జరుగుతోంది.

తాళ పత్ర గ్రంథాలు అంటేనే నాడీ జ్యోతిష్యం అంటారు. నాడీ జ్యోతిషం అంటే తోకానికి తెలిసినది చాలా తక్కువ. ఏదో బోర్డు చూసి, లేదా ఎవరో చెబితే విని, నాడీ జ్యోతిష్యుల వద్దకు పోయి కొంత నచ్చి, కొంత నచ్చక, మోసపోయిన, డబ్బు వదుల్చుకుని అంతా మోసం నాడీ జ్యోతిష్యం లేదు అని ప్రచారంచేసే వారు ఎక్కువ మంది ఉన్నారు.

సాధారణంగా మనకు తెలియని విషయాన్ని సందేహంగా భావిస్తే, కొద్దిమంది ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియని విషయాలను రహస్యాలుగా పరిగణిస్తాం! ఆ రహస్యాలేవో తెలుసుకొనేవరకూ, మన మనస్సులోని మథనం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలనాటి మహర్షు లందరివద్ద మాత్రమే ఉండి, జనసామాన్యానికి తెలియని ఎన్నో అంశాలు చిరకాలంగా మహత్తర రహస్యాలుగానే ఉండిపోతాయి. రహస్యం వెల్లడి కావాలంటే అవి ప్రజలందరికీ తెలిసితీరాలి. మహర్షుల శిష్యపరంపర చేసినది అదే!...

The Secrets of Talapatra Grandhalu

కానీ, కాలక్రమేణా శైథిల్యం చెందడమో - మరుగున పడడమో జరిగి ప్రజానీకానికి అందకుండా పోయాయి. విజ్ఞులైన వేదసంపన్నుల వివరణలతో ఆ ''తాళపత్ర రహస్యాలు'' నేటికి తిరిగి వెల్లడయ్యేలా గ్రంథ రూపాన్ని సంతరించుకుంటున్నాయి.

అత్యధికులు అపోహపడే కొన్ని అంశాలకు వాటి వాస్తవాలు కూడా ఈ గ్రంథంలో చేర్చబడ్డాయి.

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి?

ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాదు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు.

చెవులు ఎందుకు కుట్టిస్తారు?

చెవులు ఎందుకు కుట్టిస్తారు?

ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింప చేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపుశక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్యవిధానం చెవికుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలూ ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి.

గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?

గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?

వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గర్తుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదువవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాల మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.

అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు?

అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్లకూడదని ఎందుకంటారు?

పూర్వం కొడుకుని సరయినదారిలో పెట్టకపోతే, సంవత్సరకాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది శిక్షతో సమానము. తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. అలాగే చెడిపోయి చేల్లెలింటికి వెళ్ళరాదు. ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనమూ ఆశిస్తుంది. అటువంటి చెల్లిలి ఇంటికెళ్ళి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతారు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తగారింటిలో ఉన్న చెల్లి కూడా!

ఎప్పుడూ సంతోషంగా వుండడానికి దారి ఏది?

ఎప్పుడూ సంతోషంగా వుండడానికి దారి ఏది?

అరటిపండు తొక్కమీద కాలువేసి జారి పడ్డారు ఎవరో. అంతా నవ్వారు. అదేచోట మీరు జారిపడ్డారు. బాధ పడతారు. ఒకటే చర్య. ఆనందం, దుఃఖం ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీ చేతిలోనే కదా! మామూలుగా, మీ మనసులో సంతోషాన్నిచ్చే ఆలోచనల కన్నా, బాధనిచ్చేవే గుర్తుంటాయి. బాధ ఉన్న క్షణాల మళ్ళీ మళ్ళీ ఎందుకు నెమరు వేసుకుంటున్నారు? పనికి వెళ్ళినప్పుడు, కళాశాలలో పాఠాల బరువుతో కాలం గడిపిన రోజులు, కళాశాలలో వుంటే, బళ్ళో మాష్టారు దగ్గర దెబ్బలు తిన్న సంఘటనలు... ఎందుకు ఎప్పుడూ జరిగినదాన్నే ఆలోచిస్తూ ఈ క్షణాన్ని గుర్తించడం మర్చిపోతున్నారు. ఒక్కొక్కక్షణాన్ని గుర్తించి అనుభవించగలిగితే, ప్రతిక్షణం సంతోషమే కదా?

దేవుడొక్కడే అంటూ మళ్ళీ ముక్కోటి దేవతలు అంటారేం?

దేవుడొక్కడే అంటూ మళ్ళీ ముక్కోటి దేవతలు అంటారేం?

ముక్కోటి ఆంధ్రులున్నప్పుడు అలా అనే వారు, ఇప్పుడు ఆరుకోట్ల దేవతలు.... ప్రతి ప్రాణీ పరమాత్మ స్వరూపం అన్న నమ్మకం దీనికి కారణం! అది లేని వారికి ఏ బాధాలేదు, ఇందరు దేవత లేమిటా అనే చింత తప్ప!

మంగళమంటే...?!

మంగళమంటే...?!

ఆనందం, హుందాతనం కలిపిన పవిత్రమైన ఆనందాన్ని మంగళమనవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారిపై విరుచుకుని పడకుండా ప్రశాంతంగా వుండగలగడం. ప్రతివారికీ మంచి జరగాలని ఆశించడం. అమంగళకరమైన ఆలోచనలు, మాటలు రానీయకుండా వుండటం మంగళమని చెప్పవచ్చు. ఇలా వుంటే మన ఉనికి ఇతరులలో సంతోషాన్ని, ఒక పవిత్ర భావాన్ని రేకెత్తిస్తుంది. మనస్సులో అనవసరమైన భారాన్ని పెట్టుకోకుండా తేలికగా పని చేయడం అనాయాసమయితే, మనమెళ్ళిన చోటల్లా ఒక దీపంవలె ఆనందాన్ని ప్రసరింపజేయడం మంగళం.

దేవుని చూసిన మీదట తిరిగి వెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదని కొందరంటారు. నిజమేనా?

దేవుని చూసిన మీదట తిరిగి వెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదని కొందరంటారు. నిజమేనా?

సౌకర్యం దృష్ట్యా ఈ మాట సరియైనదే కావచ్చు. దైవాన్ని దర్శించి ఆ మూర్తిని మన హృదయఫలకం మీద ముద్రించుకున్నాం. అది చెదరిపోకుండ నిలుపుకోవడం ముఖ్యం కనుక ఏకాగ్రత మనస్కులమై బయటకువచ్చి కొంతసేపు ధ్యాన నిమగ్నులం కావడం కోసం అలా చెప్పారు.

English summary

The Secrets of Talapatra Grandhalu

The Secrets of Talapatra Grandhalu,Nadi Jothidam is the name of an ‘exact science’ by which all details about a person can be told by consulting palm-leaf inscriptions attributed to Agastya Muni, a very famous ancient sage from the South. There is, supposedly, one palm-leaf inscription for every human on this
Desktop Bottom Promotion