For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విష్ణువు, నారదముని మరియు సంపన్నుడైన వ్యాపారి కథ

|

బ్రహ్మ దేవుని కుమారుడు నారద ముని. ఇతని ఆరాధ్య దైవం విష్ణు భగవానుని పట్ల నారదమునికి గల భక్తిప్రపత్తుల గురించి అనేక హిందూ గ్రంథాలు మరియు పురాణాల ద్వారా మనందరికీ తెలుసు. క్రమంగా నారద మునీంద్రుల వారు వేదాల యొక్క సారాంశాన్ని మరియు విష్ణు భగవానుని గొప్పదనాన్ని ప్రపంచానికి నిరంతరం తెలియజేస్తూ సంచరిస్తూ ఉంటాడని చెప్పబడినది. క్రమంగా నారదుడు లేని పురాణాలు కూడా అంతగా కనపడవు. కలహభోజనుడు బిరుదు కూడా కలిగిన నారదుడు, ఏం చేసినా అది లోకకళ్యాణానికే పూనుకుంటూ ఉంటాడని చెప్పబడింది.

నారద మునీంద్రుడు హిందూ పురాణాల ప్రకారం ఒక గొప్ప ఋషిపుంగవుడు, మరియు ఋషులు ద్వేషం, శత్రుత్వం, దురాశ, అహంకారం మొదలైన భావాల నుండి దూరంగా ఉండాలని చెప్పబడింది, క్రమంగా ఇవన్నీ మనిషిని ఒక ఆదర్శ మార్గంలో ఉంచేలా సహాయపడగలరని నమ్ముతారు. అయితే, మన పురాణాలలో ప్రచారంలో ఉన్న అనేకరకాల కథల ప్రకారం, ఋషులు సైతం కొన్నిటికి అతీతం కాదని తెలుస్తూనే ఉంటుంది. క్రమంగా దేవుడు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే, వారి వారి తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపానికి లోనవుతూ ఉంటారు.

విష్ణుమూర్తి, నారద ముని మరియు ధనవంతుడైన వర్తకుని కథ :

నారదముని ప్రపంచంలోని సమస్యల గురించి ఆలోచనలో పడ్డాడు…

నారదముని ప్రపంచంలోని సమస్యల గురించి ఆలోచనలో పడ్డాడు…

నారద మునీంద్రుల గురించిన ఒక ప్రత్యేకమైన కథనం పురాణాలలో చెప్పబడింది. ప్రపంచంలోనే గొప్ప ఋషీశ్వరులలో ఒకరన్న అహంకారానికి లోనైన నారద మునీంద్రులు, తన గర్వ౦తో చివరికి ఎటువంటి గుణ పాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. నారద మునీంద్రులు, నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు, చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు, ఆందోళనలకు గల కారణాల గురించి వాకబు చేయడం ప్రారంభించాడు.

ఆ ధనవంతుడైన వర్తకుడు ఆశీర్వాదం కోరగా…

ఆ ధనవంతుడైన వర్తకుడు ఆశీర్వాదం కోరగా…

తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా, ఆ ధనాన్ని ఉపయోగించుకోడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియజేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్ధించాడు. అప్పుడు నారద మునీంద్రులు నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వజూచినా అది విష్ణు మూర్తి ద్వారానే ఇవ్వగలను, ఈ విషయాన్ని విష్ణు మూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని చెప్పాడు. కానీ, ఒకరకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు.

నారద మునీంద్రులు విష్ణుమూర్తిని సంప్రదించాడు…

నారద మునీంద్రులు విష్ణుమూర్తిని సంప్రదించాడు…

నారద మునీంద్రులు, తన మనస్సులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణుభగవానుని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానం అయిన వైకుంఠంలో ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ' ' నారాయణ నారాయణ ' ' అని విన్న వెంటనే, వచ్చింది నారద మునీంద్రుల వారని అని వెంటనే అర్ధం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే, నారద మునీంద్రులు ఒక భక్తునికు మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియజేశాడు. ఈ మాట విన్న విష్ణు భగవానుడు, కళ్ళు తెరచి, ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు.

విష్ణుమూర్తి ఆ కోరికకు ఇలా స్పందించాడు....

విష్ణుమూర్తి ఆ కోరికకు ఇలా స్పందించాడు....

ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తం విష్ణు భగవానునికి తెలియజేశాడు. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగ్యం కలిగించమని కోరుకున్నాడు. కానీ, అందుకు విష్ణు భగవానుడు, తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధి వ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ, వాటిని మార్చే ప్రయత్నం చేయరాదని నారదునికి విన్నవించాడు, మరియు ఇలా మార్పులు చేయడం ప్రకృతి విరుద్దమని తేల్చిచెప్పాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి, వర్తకుని పట్ల జాలితో అక్కడనుండి వెళ్ళిపోయాడు నారదముని.

కొన్ని సంవత్సరాల తర్వాత …

కొన్ని సంవత్సరాల తర్వాత …

కొన్నేళ్ళు గడిచిన తర్వాత. నారద మునీంద్రుల వారికి, ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడువుగా, వర్తకుని యింటికి వెళ్ళాడు. అయితే, ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారద ముని ఆశ్చర్యపోయాడు. వెంటనే, వర్తకుని ఆ నలుగురు బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు, ' ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది, ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారద ముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి, విష్ణుమూర్తి యొక్క నివాస స్థలం వైకుంఠానికి కదిలాడు.

ఆశ్చర్యానికి లోనైన నారద మునీంద్రులు, మరలా విష్ణుమూర్తి వద్దకు చేరుకున్నాడు...

ఆశ్చర్యానికి లోనైన నారద మునీంద్రులు, మరలా విష్ణుమూర్తి వద్దకు చేరుకున్నాడు...

"నారాయణ, నారాయణ, ఓ వైకుంఠ నాథా, అతని విధి వ్రాతను మరల రాయడం జరగని పని అని చెప్పిన మీరు, ఇదంతా ఎలా చేయగలిగారు ? అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి, ఇలా అన్నాడు- " అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో, వారి భక్తిలోని నిబద్దత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి, ఒక దివ్య ఋషి నన్ను చూడడానికి వైకుంఠానికి వచ్చాడు, అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. నేను ఈ విధంగా చెప్పాను, భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని.

ఋషీశ్వరుని ప్రయత్నం..

ఋషీశ్వరుని ప్రయత్నం..

అంతేకాకుండా, విష్ణు భగవానుడు ఆ ఋషితో ఇలా అన్నాడు... "ఋషీశ్వరులు మానవుని కిందకురారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు, కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం" అని తేల్చి చెప్పాడు. క్రమంగా, మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రప౦చ వ్యాప్త౦గా తిరగడం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికీ చెప్పాడు. కానీ, దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు.

సంతోషించిన విష్ణు భగవానుడు, వర్తకునికి సంతాన యోగ్యం కలిగేలా ఆశీర్వదించాడు...

సంతోషించిన విష్ణు భగవానుడు, వర్తకునికి సంతాన యోగ్యం కలిగేలా ఆశీర్వదించాడు...

క్రమంగా, ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుని చేరుకున్నాడు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా, అతన్ని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకుని, అతను కోరుకున్న విధంగా నాలుగు చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను నేను ఆ వర్తకుడిని ఆశీర్వదించాను, క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. ''

నారదముని తెలుసుకున్న నీతి ..

నారదముని తెలుసుకున్న నీతి ..

క్రమంగా నారద ముని, విష్ణు మూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని, మరియు, ఆయా వ్యక్తుల పాప పుణ్య ఫలాలను, భక్తి ప్రపత్తులను, నిబద్దతను ఉద్దేశించి, వారి కోరికల సాధ్యాసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు, పురాణాలు దేవునికి మరియు మానవునికి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేవిలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే, దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్న శూన్యంగా దేవుని ప్రార్ధించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ, సద్గుణ సంపన్నుడై, నలుగురికీ ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా, దేవుని కనుసన్నలలోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్ధమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: విష్ణువు
English summary

The Story Of Lord Vishnu, Narad Muni And The Rich Merchant

The story is that of a rich merchant who believed that his wealth was of no use since he had no child. However, he was a great devotee of Lord Vishnu. Read more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more