For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయక చవితి విశేషాలు: గణనాథుడికి ఇవంటే మహా ఇష్టం!!

వినాయక చవితి విశేషాలు: గణనాథుడికి ఇవంటే మహా ఇష్టం!!

|

పెద్ద పొట్ట, గజ ముఖంతో బొడ్డుగా పూజింపబడే గణేశుడు చెడు మరియు పాప విమోచనం చేసే స్నేహపూర్వక దేవునిగా భావిస్తారు. అపురూపమైన..అందమైన శరీరం కలిగిన గణేశుడిన కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాలు వారు కూడా పూజిస్తారు. గణేశుడు ఆధి దేవుళ్ళకు అధిపతి అయినందను ఆధి గణపతి అని పిలుస్తారు. గణేశ చతుర్ధిన గణేశుడిని పూజిస్తారు.

హిందువుల ఇళ్లలో మరియు దేవాలయాలలో, మఠాలలో గణేశ చతుర్థిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గణపతిని ఆరాధించే భక్తులకు ఆ గణపయ్యకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని వాటితో పూజిస్తే చాలా మంచిది. వీటితో గణేశుడు త్వరగా తృప్తి చెందుతాడు. వినాయకుడికి ఏమేమి ఇష్టపడతాడో బోల్డ్ స్కై మీకు తెలియజేస్తుంది. వీటి గురించి తెలుసుకుని గణపతి దేవుడిని పూజించండి...

మోదక్

మోదక్

గణనాథుడు ఆహారప్రియుడు అనడానికి మరో మాటలేదు. గణపతి దేవుని విగ్రహాలు చూస్తే గణపతి దేవుడు ఎంత ఆహారప్రియడో తెలుసిపోతుంది.గణేశుడిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకు ఇష్టమైన వంటలు వండితే చాలు. గణనాథుడికి ఇష్టమైన వాటిలో మోదక్ చాలా ప్రసిద్ధి. వినాయకచవితి రోజు మోదక్ తో గణపయ్యను ప్రసన్నం చేసుకోండి.

గరిక

గరిక

గణపతి దేవుడికి మరో ఇష్టమైన ఆహారం గరిక. వినాయకుడు గరికను ఇష్టపడటం వెనక ఒక కథ కూడా ఉంది.చతుర్థినాడు తమ భక్తులు పెట్టిని ప్రీతికరమైన వంటలు భుజించిన గణపయ్యకు, అలా పొట్టనిండేలా తినడం వల్ల ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతాడు. దాంతో తీవ్రమైన పొట్టనొప్పి వస్తుంది. ఆ సమయంలో కొంత మంది బుషులు గణేశుడి పొట్టపై గరిక పుల్లలు పెడుతారు. దాంతో వినాయకుడికి పొట్టనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అందుచేత గణపయ్యకు గరిక అంటే చాలా ఇష్టం.

బంతిని పువ్వులు

బంతిని పువ్వులు

గణేశుడిని ఇంటికి తీసుకువచ్చేప్పుడు, ఇంటిని పసుపు, కుంకుమ మరియు బంతి పువ్వులతో అలంకరించాలి. గణపతికి బంతిపూలంటే చాలా ఇష్టం. గణేశుడు ఎల్లప్పుడూ బంతి పువ్వులు మరియు పుష్పించే గడ్డితో మాలను ధరించి ఉంటాడు.

శంకం

శంకం

గణపతికి నాలుగు చేతులు ఉంటాయి మరియు ఒక చేతిలో శంఖం పట్టుకుని ఉంటాడు. చాలా వరకు హిందూ పండుగలలో శంకాలను ఉంచి పండగ జరుపుకుంటారు. గణపతికి శంకం అంటే చాలా ఇష్టం. గణపతికి హారతి ఇచ్చేప్పుడు, చాలా మంది శంకాలు ఆయన ముందు ఉంచుతారు. శంఖం దుష్టశక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు.

పండ్లు

పండ్లు

కొబ్బరి మరియు అరటి గణపతి దేవునికి చాలా ఇష్టమైనవి. గణేశుడు తల ఏనుగు తలను పోలి ఉండటం వల్ల గణపయ్యకు అరటి పండ్లు చాలా ఇష్టం. గణేశుడి విగ్రహాన్ని అరటి ఆకులు, అరటి కాయలతో అలంకరిస్తారు.

పండ్లు

పండ్లు

కొన్ని వైపుల అరటి పువ్వులను సమర్పిస్తారు. ఈ ఐదు వస్తువులు గణపతికి చాలా ఇష్టమైనవి. గణపతి శాకాహారి మరియు బుధవారం ఆయనను పూజించినట్లయితే చాలా చాలా మంచిది.

English summary

Things That Lord Ganesha Loves

Lord Ganesha is known for his elephant head and his enormous belly. He is one of friendliest Hindu Gods who is bereft of malice and curses. The cute and cuddly image of Ganesha inspires lots of love among his devotees. That is why he is called 'Ganapati', the lord of the people. Ganesh Chatuthi is special festival meant to celebrate the glory of Lord Ganesha and is due in a week's time. So, let us find out what are the things that Ganesha loves the most to please him on this special day.
Desktop Bottom Promotion