For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tulsi Vivah 2021 : ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధులు

హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది.

|

మన దేశంలో హిందువులకు తులసి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్షం (రెండో పక్షం) ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 15వ తేదీన అంటే కార్తీక సోమవారం నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

Tulsi Vivah

ఆ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం..

హిందూ పురాణాల ప్రకారం..

హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధర్ దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తు ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.

పెళ్లి తర్వాత పెరిగిన శక్తి..

పెళ్లి తర్వాత పెరిగిన శక్తి..

ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి, పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

జలంధరుని రూపంలో విష్ణువు..

జలంధరుని రూపంలో విష్ణువు..

పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది.

వృందకు శాపం..

వృందకు శాపం..

శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ, తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.

లక్ష్మీదేవి విజ్ఞప్తి..

లక్ష్మీదేవి విజ్ఞప్తి..

మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు యొక్క సాలిగ్రామ్ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణ చర్య). ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ప్రకారం తెలిసింది.

తులసి పూజా విధానం..

తులసి పూజా విధానం..

తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి.

మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.

ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి.

విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.

తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు లార్డ్ సాలిగ్రామ్ జపిస్తూ ప్రార్థించండి.

పండుగ యొక్క ప్రాముఖ్యత..

పండుగ యొక్క ప్రాముఖ్యత..

తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.

ద్వాదశ దీపాలు..

ద్వాదశ దీపాలు..

క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క, లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి.

తులసి మొక్కను గౌరీదేవిగా

తులసి మొక్కను గౌరీదేవిగా

తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల, గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి, స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది. లక్ష్మీ ఉంటే కరువు అనేది ఉండదు, కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.

FAQ's
  • 2021లో తులసి వివాహం ఎప్పుడు జరుపుకుంటారు?

    ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్షం (రెండో పక్షం) ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 15వ తేదీన అంటే కార్తీక సోమవారం నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

English summary

Tulsi Vivah 2019: Know About The Festival, Puja Vidhi And Its Significance

This year the festival will be celebrated on 8 November 2019. On this day, Tulsi (Basil), which is considered to be a sacred plant by devotees, is married to Lord Shaligram. There is a mythological story behind celebrating this festival.
Desktop Bottom Promotion