For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓంకార నాదంగా పిలువబడే " ఓం " గురించి ఆసక్తికర విషయాలు !!

By Swathi
|

ఓం..!! ఇదో అత్యంత శక్తివంతమైన మంత్రం. హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు నిర్వహించేటప్పుడు ఈ ఓం అనే మంత్రాన్ని స్మరిస్తారు. ఓంను ఆరంభ శబ్ధంగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం ఏదైనా వస్తువు తయారు చేయడానికి ముందు కూడా.. ఓం అనే శబ్ధం వస్తుందని చెబుతాయి. అలాగే ఓం అనే మంత్రాన్ని ప్రతి మంత్రానికి ముందుగా స్మరించడం హిందువుల ఆచారం. అందుకే ప్రతి దేవుడి మంత్రానికి ముందు ఓం అనేది చేరుస్తారు.

ఓం అనేది అత్యంత ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉందని నమ్ముతారు. ఈ మంత్రాన్ని ఎవరైనా ఉచ్చరించవచ్చు. ఈ ఓం అనే మంత్రాన్ని సరైన పద్ధతిలో పలకడం వల్ల.. దీని ఉచ్ఛరణ ( aum ) అని వస్తుంది. హిందూత్వం ప్రకారం ఓం అనే మత్రాన్ని యోగాలో ఎక్కువగా ఉపయోగించనట్లు తెలుస్తోంది. ఉపనిశత్ ల ప్రకారం ఓం అనే మంత్రాన్ని ఎక్కువగా ఉపయోగించనట్లు చెబుతున్నాయి. ఇంకా ఓం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

శక్తివంతమైనది

శక్తివంతమైనది

ఇలా ఓం లోని మూడు శబ్ధాలు.. సృష్టి, పరిరక్షణ, విముక్తిని సూచిస్తాయి. అలాగే ఓం అంటే.. అద్భుతమైన శక్తి అని అర్థం.

ఇతర మతాలలో

ఇతర మతాలలో

ఓం అనే మంత్రం హిందూయిజంలోనే కాకుండా.. బుద్ధిజం, జైనిజంలో కూడా ప్రస్తావించారు.

త్రిమూర్తులు

త్రిమూర్తులు

ఓం అనే మంత్రం భూమి, వాతావరణం, స్వర్గాలకు ప్రతీక. అలాగే.. హిందువులకు ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, శివులకు కూడా ప్రతిరూపం.

ఓం తో వినాయకుడి సంబంధం

ఓం తో వినాయకుడి సంబంధం

ఓం అనే మంత్రాన్ని సూచించే గుర్తు వినాయకుడికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. మొదటి వంపు వినాయకుడి ముఖం, కింద వంపు వినాయకుడి బొజ్జ, కుడివైపుకి తిరిగిన గుర్తు.. వినాయకుడి తొండమును సూచిస్తుంది.

ఎలా పలకాలి ?

ఎలా పలకాలి ?

ఓం అనే మంత్రాన్ని ఓంకార నాదం అని చెబుతారు. ఓం అనే మంత్రంలో ఓ.. పలికేటప్పుడు.. గొంతు లోపలి నుంచి శబ్ధం నెమ్మదిగా వస్తూ.. బయటకి గట్టిగా వినిపిస్తుంది. మీ చెస్ట్ వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంది.

ఎలా పలకాలి ?

ఎలా పలకాలి ?

ఆఆ.. అని పలికేటప్పుడు చాలా దీర్ఘంగా పలకాల్సి ఉంటుంది. నిదానంగా.. మీ గొంతు వైబ్రేట్ అవడం గమనిస్తారు.

ఎలా పలకాలి ?

ఎలా పలకాలి ?

మ్..పలికేటప్పుడు మ్ మ్ మ్.. అని వినిపిస్తుంది. ఈ సమయంలో.. మీ గొంతు పైభాగం వైబ్రేట్ అవుతుంది.

ఆధ్మాత్మికత సంబంధం

ఆధ్మాత్మికత సంబంధం

ఓం అనే మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల.. శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రకృతితో, విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటామని.. నమ్మకం ఉంది.

నాడీ వ్యవస్థ

నాడీ వ్యవస్థ

ఓం అనే మంత్రాన్ని స్మరించడం వల్ల.. శరీరంలోని నాడీ వ్యవస్థ నెమ్మది అయి.. మెదడుకి ప్రశాంత భావన కలుగుతుంది. ధ్యానం వల్ల ఇలాంటి అనుభూతి కలుగుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య ప్రయోజనాలు

బ్లడ్ ప్రెజర్ తగ్గడం, మనసు రిలాక్స్ అనిపించడం వల్ల.. హార్ట్ కండీషన్ కూడా మెరుగవుతుంది.

English summary

Understanding The Mantra ‘Om’: Significance of OM in Hinduism

Understanding The Mantra ‘Om’: Significance of OM in Hinduism. "Om" is considered to be the 'primordial sound'. According to scriptures, it is said that even before the material creation came into existence, the word Om came into being.
Story first published:Thursday, May 5, 2016, 16:19 [IST]
Desktop Bottom Promotion