For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అష్టలక్ష్ముల్లో వరమహాలక్ష్మీనే ఎందుకు పూజించాలి..?

|

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు.

ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి - ఇలా అష్ట లక్ష్ములు ఉన్నారని తెలుసు కదా! వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయన్నమాట.

శ్రావణ మాసం శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ వ్రతాన్ని నిత్య సుమంగళిగా ఉండాలని కోరుతూ పుణ్యస్త్రీలు జరుపుకుంటారు. సాయంత్ర వేళ పేరంటాలు, ముత్తైదువుల హడావిడి ఇప్పటికి కనపడుతుంది. శ్రావణమాసం వచ్చిందంటేనే పడతులందరికీ ఎంతో సంతోషం.ఎప్పుడెప్పుడు ఆ పర్వదినం వస్తుందాని మగువలంతా ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు.

ఆ రోజుకోసం ముందుగానే కొత్తచీరలు,ఎవరి శక్తినిబట్టి వారు బంగారు ఆభరణాలనుగానీ లక్ష్మిరూపుగానీ అమర్చుకుంటారు. పూర్ణిమకు నలుగు రోజులు ముందుగానే ఇల్లు,వాకిలీ బూజులు దులిపి శుభ్రం చేసుకుంటారు.పండుగ ముందు రోజు ఇల్లంతా కడిగి,ముగ్గులతో అలంకరించుకుంటారు.ఆ రోజున ముందుగా గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టి ,పూలమాలతో అలంకరణ చేసి ,గడపకి పసుపురాసి,బొట్టు పెట్టి అందంగా అలంకరిస్తారు.

ఉదాయాన్నే తలంటు పోసుకొని ,పట్టుచీరలు కట్టుకొని పూజకోసం తయారవుతారు. వెండి, రాగి, ఇత్తడి పాత్రకి పసుపురాసి , బొట్లు పెట్టి దానిలో కొద్దిగా నీళ్ళు, అక్షతలు, మామిడాకులు వేస్తారు.

పసుపు, కుంకుమలతో తీర్చిదిద్దిన కొబ్బరికాయను పెట్టి దాని మీద జాకెట్టు బట్టను అమర్చి,దానిపై బంగారు నగలతో సింగారిస్తారు. వరక్ష్మీ వ్రతం ఎలా ప్రారంభించాలి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీనే ఎందుకు పూజించాలి తెలుసుకుందాం..

1. వరక్ష్మీ వ్రతంను ఈ ప్రార్థనతో ప్రారంభించాలి:

1. వరక్ష్మీ వ్రతంను ఈ ప్రార్థనతో ప్రారంభించాలి:

"పద్మాసనే పద్మాకరే సర్వ లోకైక పూజితే

నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా"

అని ప్రారంభించి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది. సర్వ సుఖాలూ సంప్రాప్తిస్తాయి. పెళ్ళయిన స్త్రీలే కాకుండా, వివాహం కాని కన్యలు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు.

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం.

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే!

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

2. వరమహాలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు..

సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

3. పూజా సామాగ్రి:

3. పూజా సామాగ్రి:

వరలక్ష్మీ వ్రతానికి ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. అమ్మవారి ప్రతిమ, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కర్పూరం, అగరొత్తులు, తమలపాకులు, వక్కలు, గంధం, అక్షతలు, కొబ్బరికాయ, కలశం, కలశ వస్త్రం, దీపం ఉంటే చాలు.

 4. నైవేద్యంగా

4. నైవేద్యంగా

పాయసం, వడపప్పు, పంచామృతం, శక్తికొద్దీ రెండుమూడు పిండివంటలు చేసి లక్ష్మిని ఆరాధించి ప్రసాదం పంచిపెడితే ఇహంలో సుఖశాంతులు, పరంలో ముక్తి లభిస్తాయి.

5. వ్రత విధి విధానం

5. వ్రత విధి విధానం

తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను.

5. వ్రత విధి విధానం

5. వ్రత విధి విధానం

తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను.

5. వ్రత విధి విధానం

5. వ్రత విధి విధానం

నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించాలి.

5. వ్రత విధి విధానం

5. వ్రత విధి విధానం

v చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

English summary

Varalakshmi Vratham-Pooja Procedure/Puja Vidhanam

Varalakshmi Vratham-Pooja Procedure/Puja Vidhanam
Desktop Bottom Promotion