పవర్ ఫుల్ శక్తికి మరో రూపం వినాయకి (ఆడ గణేశుడు)

Subscribe to Boldsky

హిందూ పురాణంలో విష్ణువుకు, ఇంద్రునికి, బ్రహ్మకు వంటి వారిలాగే వినాయకునికి కూడా స్త్రీ రూపం ఉందని చాలా మందికి తెలియదు.

అంధక అనే రాక్షసునికి, మహా దేవత అయిన "పార్వతీదేవిని" భార్యగా కావాలని కోరుకున్నాడు కోరుకున్నాడు. అతడు ఆమెను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆమె తన భర్తయైన శివుడిని ప్రార్థించగా, వెనువెంటనే శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో ఆ రాక్షసుడిని చంపేశాడు.

గణేష బాడీ పార్ట్స్ లో దాగున్న రహస్యాలు ఏంటి..?

Vinayaki : The female Ganesha

కాని అసురునికి మాయా శక్తి ఉన్నది. అతని శరీరం నుండి నేలను తాకిన ప్రతి రక్తం బొట్టు మరొక మరొక అంధకాసురునిగా మారిపోయింది. శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించినప్పుడు ఆ అసురుడిని వధించినప్పుడు, వాడి రక్తపుబొట్టు నేలను తాకకుండా చూడటంవల్ల అతనిని చంపడానికి ఏకైక మార్గంగా భావించారు.

పార్వతికి తెలుసు, దైవత్వం ఉన్న ప్రతివారు ఆడా-మగా ప్రతిరూపాల మిశ్రమమని, అందులో మగవాడు మానసిక దృఢత్వానికి ప్రతీక అయితే ఆడది భౌతిక వనరుల (శక్తి) కి ప్రాతినిధ్యం వహిస్తుందని పార్వతికి తెలుసు. అందుకే పార్వతీదేవి అన్ని శక్తులకు మూలం అని కొనియాడుతారు. ఆమె అభ్యర్థనపై, దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ అంధకాసురుడి రక్తం నేలపై పడకుండా ఆ రక్తాన్ని త్రాగడం కోసం వారిలో ఉన్న శక్తిని విడుదల చేశారు. తర్వాత, ఆ యుద్ధ భూమి పూర్తిగా దేవతలతో నిండిపోయిందని ఊహించవచ్చు. ఇంద్రుని శక్తిగా ఇంద్రాణి, విష్ణువు శక్తిగా వైష్ణవి, బ్రహ్మ శక్తిగా బ్రాహ్మణి ఉద్భవించారు.

Vinayaki : The female Ganesha

ఆ శక్తులన్నీ కలిసి అంధకాసుర రక్తాన్ని నేలను తాకక ముందే త్రాగి, అందకాసురుని పూర్తిగా హతమార్చారు.

మత్స్య పురాణం, విష్ణు-ధర్మోతరా పురాణాల్లో వున్న "మహిళా యోధుల దేవతల" జాబితాలో గణపతి యొక్క శక్తి కూడా ఉన్నది. ఆ శక్తి పేరు వినాయకిగా, అలాగే గణేశ్వరిగా కూడా పిలువబడుతుంది. ఈ రూపంలో దర్శనమిచ్చే గణపతిని "వానా-దుర్గా-ఉపనిషత్తు" గా పూజింపబడుతుంది.

Vinayaki : The female Ganesha

ఆడ-గణేశుని చిత్రాలు మనకు 16 వ శతాబ్దం నుంచి కనబడుతున్నాయి. బహుశా అలాంటి కొన్ని చిత్రాలను చూసి ఆమె-మాలినిగా, ఏనుగు-తలతో పార్వతికి తోడుగా ఉన్నటువంటి, గణేశునికి కాపలాకాసే అమ్మాయిగా పురాణాల్లో చెప్పబడినట్లు కొంతమంది అభిప్రాయపడ్డారు.

ఏనుగు-తలతో ఉన్నటువంటి ఆమె విగ్రహరూపాన్ని చూస్తే, అది గణేషుని శక్తియా (లేదా) పార్వతీదేవి చేతితో చెయ్యబడిన మట్టి విగ్రహనికి తాంత్రిక విద్యను జతచేసి మగరూపంలో తీర్చిదిద్దేందుకు ఇష్టపడక స్త్రీ రూపాన్ని కల్పించినట్లుగా చెప్పవచ్చు. రహస్యమైన సైన్స్ ప్రకారం, అన్ని వనరుల శక్తికి ఆడదే ఆధారం ఎందుకనగా మగవారి నుండి వచ్చే కణాలకు, ఒక జీవితాన్ని సృష్టించబడి, పోషించబడేది కేవలం స్త్రీ శరీరంలో మాత్రమే (లేదా) దానికి మరింత కారణం మెటాఫిజికల్ కావచ్చు. ఆడది భౌతిక పదార్థాల వనరుల (శక్తి) కి ఒక సంకేతం.

వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?

Vinayaki : The female Ganesha

భారతదేశంలోని ఋషులు ఎల్లప్పుడూ ఈ అంశంపైనే మరింత చర్చించారు అవి: ఆలోచనల ప్రపంచం (మానసిక సామర్ధ్యం) లేదా ప్రపంచంలో గల విషయాలు (భౌతిక వనరులు). బయటకు కనపడని ఆలోచనల వైపు మొగ్గుచూపే వారు చివరికి వేద పద్ధతులతో సంబంధం కలిగి ఉంటారని, అయితే బయటకు కనిపించే విషయాల వైపు మొగ్గుచూపినవారు చివరికి తాంత్రిక పద్ధతులతో సంబంధం కలిగి ఉంటారు. వారి మనోభావాలను మొదటిగా మగ రూపాల ద్వారా తెలియజేశారు, ఆ తర్వాత నుండి ఆడ రూపాల ద్వారా తెలియజేశారు. ఆ విధంగా, గణేశుడు అడ్డంకుల తొలగించే వానిగా వేదాలలో ప్రజాదరణ పొందింది, అతని స్త్రీ రూపం అయిన వినాయకి మాత్రం తాంత్రిక ఇతివృత్తాలలో ప్రజాదరణ పొందింది.

వినాయకితో సంబంధించిన కథలు ఉన్నాయా?

మనలో చాలామందికి తెలియదు అవి ఒట్టి మాటలు మాత్రమే అని. కొత్త చంద్రుడు తర్వాత వచ్చే నాలుగో రోజును "వినాయకి చతుర్థిగా" పిలుస్తారని మనకు తెలుసు. వినాయకుడు స్త్రీ రూపంలో మారిన తర్వాత వచ్చే ఈ రోజును చాల పవిత్రమైనదిగా భావిస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Vinayaki : The female Ganesha, who is not related with lord ganesha

    The female incarnation of Ganesha is called Ganeshani, Gajinii, Ganeshwari, Gajukhi besides many other names.
    Story first published: Monday, August 28, 2017, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more