For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021 : పర్యావరణానికి మేలు చేసే వినాయక ఉత్సవాల గురించి తెలుసుకుందామా...

మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపతి మహా గణపతి అనే నినాదం బాగా జోరందుకుంది.

|

అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసే గణేష్ మరికొద్ది గంటల్లో రానుంది. ఇప్పటికే అందరూ గణపతి విగ్రహాల ఏర్పాటులో బిజీబిజీగా గడుపుతున్నారు. లంబోదరుడికి ఇష్టమైన లడ్డూలు, ఉండ్రాళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. అందరూ ఇలాగే చేస్తే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే మనం ఈసారి కాస్త వినూత్నంగా ప్రయత్నిద్దాం. మనం ఎంతసేపు గణపతి ఎన్ని అడుగులు పెట్టాం.

ఎంత ఖర్చు చేశాం అనే వాటి జోలికి వెళ్లకుండా పర్యావరణానికి మేలు చేసే గణనాథుల బొమ్మల్ని గురించి ఆలోచించాలి. ఎకో ఫ్రెండ్లీ గణ నాథ విగ్రహాల్ని ఎంచుకోవడం ద్వారా నీటి కాలుష్యాన్ని సైతం నిరోధించవచ్చని పర్యావరణ పరిరక్షణ అధికారులు చెబుతున్నారు. మరి ఈరోజు స్టోరీలో ఎకో ఫ్రెండ్లీ గణనాథుని గురించి తెలుసుకుందామా..

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత..

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత..

మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపతి మహా గణపతి అనే నినాదం బాగా జోరందుకుంది. పర్యావరణానికి మేలు చేయకపోయినా పర్వాలేదు హాని చేయ్యొద్దు అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన పిలుపును, వారు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం మెలమెల్లగా వస్తోంది. ఇప్పుడిప్పుడే అందరూ మట్టి గణపతి వైపు మొగ్గు చూపుతున్నారు పర్యావరణ పరిరక్షణకు, చెరువుల పూడికతీతతో సుభిక్షమైన నీరు లభించి పంటలు పండేందుకు సహాయపడే పండుగ వినాయకచవితి. కొందరు వినాయక విగ్రహాలను తయారు చేసే నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. గడ్డి సహాయంతో పేపర్ ను గుజ్జులా తయారు చేస్తున్న వినాయక విగ్రహాలకు విశేష ఆదరణ లభిస్తోంది.

ఔషధ పత్రులతో పూజలు..

ఔషధ పత్రులతో పూజలు..

గణేష్ చతుర్థి రోజున మానవాళి మనుగడ కోసం హోమంలో ఔషధ మొక్కలను పత్రులను వాడేవారు. వినాయకుడి నవరాత్రుల్లో 21 రకాల పత్రులను వాడతారు. వీటిలో ప్రధానంగా మాచి, బృహతి, బిల్వా, దుర్వా, దత్తుర, బదిరీ, అపామార్గ, తులసీ, చూత, కారవీర, ఉష్ణోప్రాంత, దాడిని, దేవదారు, మరువక, సింధుఆరా, జాజి, గండగీ, శమీ, అశ్వత్తి, అర్జున, అర్క, ఏకవిశంతి పత్రులను ఉంచి పూజిస్తారు. అనంతరం నిమజ్జనం రోజున విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఆ పత్రుల ఔషధ గుణాలతో నీటిలోని బాక్టీరియాను దూరం చేసి స్వచ్ఛమైన ఆక్సీజన్ ను అందజేస్తాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

ఇంట్లోనే వినాయకుడి బొమ్మ తయారీ ఇలా..

ఇంట్లోనే వినాయకుడి బొమ్మ తయారీ ఇలా..

ఇళ్లలో వస్తువులతోనే వినాయకుడి బొమ్మను తయారు చేసుకోవచ్చు అని పర్యావరణ అధికారులు సలహా ఇస్తున్నారు. మన ఇంట్లో లభించే పసుపు, మైదా, గోధుమలతో వినాయకుడిని ప్రతిమను తయారు చేసుకుని విఘ్నేశ్వర పూజ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. పూజ అనంతరం, నైవేద్యాలు సమర్పణ తర్వాత వినాయకుడి బొమ్మలను వాగుల్లో, వంకల్లో, చెరువులో లేదా నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తే, జలచరాలను బతికించిన వారవుతామని కూడా పర్యావరణ పరిరక్షణ అధికారులు అంటున్నారు. అంతే కాదు రసాయనాలు కలపని మట్టి బొమ్మలైతేనే పూజకు సరిగ్గా సరిపోతాయి. కానీ రసాయనాలు, ప్లాస్టిక్ కలిపిన వినాయక బొమ్మను పూజించినా ఫలితం ఉండదు. ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రోత్సహిస్తే మనం కచ్చితంగా నీటి కాలుష్యాన్ని చాలావరకు దూరం చేసుకోవచ్చు.

వినాయక నిమజ్జనం తెలిపే నిజమిదే..

వినాయక నిమజ్జనం తెలిపే నిజమిదే..

నవరాత్రులు లేదా పదకొండు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇళ్లల్లో, ఆలయాల్లో పంచలోహ, కంచు, వెండి, బంగారు లోహాలతో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల నిత్యం పూజించడానికి వీలు ఉంటుంది. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజులకు నిమజ్జనం చేస్తారు. ఇదే తరహాలో మానవుడు తన శరీరాన్ని ఎన్ని అలంకరణలతో తీర్చిదిద్దుకున్నా కూడా పంచభూతాల్లో కలిసిపోవడం నిజమనే విశ్వ సత్యాన్ని వినాయక నిమజ్జనం తెలియజేస్తుంది.

ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

English summary

Ganesh Chaturthi 2019: Ways To Celebrate An Eco-friendly Ganesh Festival

Environmental officials are advising that Ganesha's toy can be made with objects in homes. Vigneshwara puja is a good result if you make a statue of Lord Ganesha with turmeric, maida and wheat available in our house. Environmental conservation officials say that after the worship, after the offering of Ganesha statues, Ganesha figures are immersed in water, creeks, ponds or river or sea.
Desktop Bottom Promotion