For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతా దేవి లక్ష్మణుడిని మింగేసిందా ? ఎందుకు ? అసలు కథ ఇదే

ఈ సంఘటనను దూరం నుండి గమనించిన సీతా దేవి, పరుగున వచ్చి అఘాసురుడు లక్ష్మణుడిని మింగబోయే సమయానికి, తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుడిని మింగివేసింది. హనుమంతుడు సైతం ఆశ్చర్యపోయేలా, ఒక వెలుగులు విరజిమ్మే దై

|

సరయూ నదికి సీతా దేవి చేసిన ప్రమాణం :

14 సంవత్సరాల వనవాసం ముగించుకుని శ్రీరాముడు, సీతా, లక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది. వారు అయోధ్యను వీడి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్తున్నప్పుడు, తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరిన ఎడల సరయు నదికి పరీవాహక ప్రాంతానికి పూజలు చేస్తానని ప్రమాణం చేసింది. ఆ క్రమంలో భాగంగా, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరయు నదీ తీరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

When Goddess Sita Swallowed Lakshman

లక్ష్మణుడి సహకారం :

14 సంవత్సరాల వనవాసంలో రావణాసురుని కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా, క్షేమంగా ఇంటికి చేరిన సీతా దేవి, చేసిన ప్రమాణం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా, రాజ్యపాలనలో ఉన్న శ్రీరామునికి అంతరాయం కలుగకుండా, లక్ష్మణుని తనకు తోడుగా రావాలని సహకారం కోరింది సీతా దేవి.

When Goddess Sita Swallowed Lakshman


సీతా దేవి లక్ష్మణుని మింగిన కారణం :

లక్ష్మణుడు తోడుగా రాగా, సీతా దేవి సరయు నదికి చేరుకుంది. హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా, సీతా దేవి వారించడంతో సీతా దేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్ళాడు హనుమంతుడు. స్వామి భక్తికి నిదర్శనంగా హనుమంతుని కీర్తించడానికి కారణమిదే. కష్టాలలో ఉన్నప్పుడు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా తనను నమ్మిన భక్తుల వెంట ఉండే హనుమంతుడు ఎన్నటికీ ప్రజల ఆరాధ్య దైవంగానే ఉంటాడు.

క్రమేణా సీతా లక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో, హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇరువురికి కనపడకుండా దాక్కుని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. సీతా దేవీ, లక్ష్మణులు సైతం ఈ విషయాన్ని గమనించలేదు.

When Goddess Sita Swallowed Lakshman

అఘాసురుడి దౌర్జన్యం :

సీతా దేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో, కాలాష్ నదిలోని నీటిని తీసుకుని రావలసినదిగా లక్ష్మణుడిని ఆజ్ఞాపించగా, లక్ష్మణుడు అచటకు కదిలాడు. హనుమంతుడు మాత్రం చెట్టు వెనుక నుండి కాపలా కాస్తూనే ఉన్నాడు. కాలాష్ నదిలో నీటిని తీసుకుంటున్న లక్ష్మణుడి మీదకు, భయంకరంగా నవ్వుతూ, నది నుండి ఒక రాక్షసుడు హూంకరిస్తూ ముందుకు దూకాడు.

తపస్సు ఫలితంగా శివుని వర ప్రసాదాన్ని పొందిన ఆ రాక్షసుడు, తనను చంపడం వీలు కాదన్న గర్వంతో లక్ష్మణుడిని లక్ష్యంగా చేసుకుని, అతన్ని మింగివేయాలని ప్రయత్నించాడు. అతనే అఘాసురుడు. అఘాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టు పక్కల ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. అదేక్రమంలో భాగంగా లక్ష్మణుడిని కూడా మింగాలని ప్రయత్నించాడు.

When Goddess Sita Swallowed Lakshman

ఈ సంఘటనను దూరం నుండి గమనించిన సీతా దేవి, పరుగున వచ్చి అఘాసురుడు లక్ష్మణుడిని మింగబోయే సమయానికి, తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుడిని మింగివేసింది. హనుమంతుడు సైతం ఆశ్చర్యపోయేలా, ఒక వెలుగులు విరజిమ్మే దైవిక వస్తువుగా రూపాన్ని సంతరించుకుని నిలబడింది సీతా దేవి. ఆ దైవిక వస్తువును సైతం మింగబోయిన అఘాసురుడి నుండి కాపాడే ప్రయత్నంలో భాగంగా, హనుమంతుడు ఆ వస్తువును కాలాష్ నది నీటితో గుండ్రటి బంతి వలె మార్చి, రాక్షసుని నుండి తప్పించాడు.

When Goddess Sita Swallowed Lakshman

జరిగిన కథనాన్ని రామునికి వివరించిన హనుమంతుడు :

జరిగిన తంతునంతా, రామునికి పూర్తిగా వివరించిన హనుమంతుడు, వారిరువురిని తిరిగి మానవ రూపం దాల్చేలా వరమివ్వమని ప్రార్ధించగా, సీతా లక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదని, దైవిక అవతారాలు అని హనుమంతునికి వివరించాడు. అందువలన కాలాష్ నది నీటిని తిరిగి నదిలో పోయాలని, ఆ క్రమంగా నివాసితులను రక్షించాల్సిన అవసరం కూడా ఉన్నదని, కావున వీలైనంత త్వరగా ఆ పనిని చేయాల్సిందిగా సూచించాడు.

When Goddess Sita Swallowed Lakshman

సీతా, లక్ష్మణులు అఘాసురుడిని చంపిన విధానం :

రాముని ఆదేశాల ప్రకారం, హనుమంతుడు ఆ కాలాష్ నదిలోకి నీటిని తిరిగి కురిపించగా, ఆ దైవిక వస్తువు ఒక భారీ నిప్పు బంతి వలె మారి, ఆ మంటలతో అఘాసురుని అంతమొందించడం జరిగింది. క్రమంగా రాక్షసుని పీడ వదిలి, మరలా ఈ నది సురక్షితమైన ప్రాంతంగా మారడంతో పాటు, సీతా దేవి, లక్ష్మణులు వారి వారి అసలు రూపాలను తిరిగి పొందారని కథనం.

ఈ కథానుసారం కష్టాలలో ఉన్న ప్రజలను కాపాడుటకు సీతాదేవి వ్యూహంగా కూడా చెప్పవచ్చు. అనగా, రాజ్యపాలనలో సమిష్టి కృషిని చూపుతూ రాజ్యంలోని ప్రజలకు రక్షణనిస్తూ సీతారాములు, లక్ష్మణ, హనుమల సహాయంతో రాజ్యాన్ని కంటికిరెప్పలా కాపాడేవారని చెప్పకనే చెబుతుంది ఈ కథనం. అందుకే ఎన్నియుగాలైనా, వీరి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయంగా, సకల జనులకు మార్గనిర్దేశం చేసేలా ఉంటుంది.

When Goddess Sita Swallowed Lakshman

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

When Goddess Sita Swallowed Lakshman?

When Goddess Sita Swallowed Lakshman
Desktop Bottom Promotion