For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళిని దీపాల పండగ అని ఎందుకు అంటారు?

|

దీపావళిని ప్రముఖంగా దీపాల పండగ అనికూడా పిలుస్తారు ; హిందువులకి ఎంతో ముఖ్యమైనది ఈ పండగ; దీన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దీవాలి అని కూడా పిలిచే ఈ పండగ రెండు పదాలు 'దీప్’ మరియు 'ఆవళి’ అంటే దీపాల వరుసతో పేరుపొందింది.

<strong>దీపావళి పండుగా జరుపుకోవడానికి పాటించాల్సిన సాంప్రదాయ, ఆచారాలు..!</strong>దీపావళి పండుగా జరుపుకోవడానికి పాటించాల్సిన సాంప్రదాయ, ఆచారాలు..!

దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు?

దీపావళిని అశ్విని నెలలో జరుపుకుని కార్తీక మాసంలో కూడా చాంద్రమానం ప్రకారం కొనసాగిస్తారు. నాలుగు రోజులు సాగే ఈ పండగలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. పండగ ముఖ్యమైన దేవత లక్ష్మీదేవి మరియు లక్ష్మీపూజ పండగ ఉత్సవంలో ముఖ్యమైనది. ఆమె సంపదకి అధినేత్రి కావటంతో, పూజ జరిపి ఏడాదిపొడుగునా ఐశ్వర్యం వరంగా పొందాలని భావిస్తారు.

diwali festival information

దీపావళి విశిష్టత

ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండగని దేశమంతా కలిసి జరుపుకుంటారు. పంటలు పండే రుతువు అయిపోయిందనటానికి గుర్తుగా మరియు చలికాలం ప్రారంభాన్ని ఈ పండగ సూచిస్తుంది. ఈ పండగ ముఖ్యసారం చెడుపై మంచి గెలవటం.

దీపావళి ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి ఉత్సవాలకి వెనుక అనేక కథలున్నాయి. అందులో ప్రసిద్ధమైనది భగవాన్ శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకి తిరిగొచ్చాడన్న కథ. లంక రాజైన రావణుడు శ్రీరాముడి ప్రియమైన భార్య సీతను వారు వనవాసంలో ఉన్నప్పుడు అపహరించాడు.

సీతను రక్షించటానికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం పదిరోజులు సాగి చివరన రాముడు రావణుడిని ఓడించాడు.పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగిరావటం, రావణుడిని ఓడించటం సందర్భంగా దీపావళి పండగను చేసుకుంటారు. అందుకని ఈ పండగ చెడుపై మంచి గెలవటానికి ప్రతీక.

diwali festival information

దీపావళి రోజు మిఠాయిలు బహుమతిగా ఇచ్చే సంప్రదాయం

దీపావళి వైశిష్ట్యం

మరో కథనం ప్రకారం, దీపావళిని లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వివాహ సందర్భంగా జరుపుకుంటారు.

శక్తికి రూపమైన కాళి అమ్మవారిని ఈ రోజున బెంగాల్ లో చాలా ప్రాంతాల్లో పూజిస్తారు. శుభప్రదంగా పూజించే వినాయకుడిని కూడా ఈ రోజున పూజిస్తారు.

దీపాల పండగ, దీపావళి

ప్రమిదలతో దీపాలను, ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించటం పండగలో ముఖ్యభాగం. ప్రతిచోటును దీపాలతో అలంకరిస్తారు. రంగురంగుల ముగ్గులు మరియు పువ్వులతో అన్నిచోట్లు మీకు రంగులతో కన్పిస్తాయి. ప్రతి మూలా, ఇల్లైనా, షాపులైనా బాగా కడిగి అలంకరిస్తారు. తోరణాలు, మండపాలను అన్నిచోట్లా చూస్తారు.

diwali festival information

దీపావళి విశిష్టత

ఆకాశం బాణసంచా వెలుగుల్లో, వాటి శబ్దాలతో మెరిసిపోతూ మనకు పండగ సందోహాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఈ సంప్రదాయాలన్నిటికీ వెనుక చాలా కారణాలున్నాయి. దీపాలు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని అంటారు. అదేకాక దీపాలు చీకటిని ఓడించి, తరిమేసి ఎప్పుడూ విజయం సాధిస్తుందని సూచిస్తుంది.

బాణసంచా శబ్దాలు పైలోకాల్లో ఉన్న దేవతలకి మన ఆనందోల్లాసాలను సందేశంగా పంపిస్తాయి. అది కూడా మంచి, చెడుపై విజయం సాధిస్తుందని సూచన. తాజా పూలు మరియు రంగురంగుల ముగ్గులను దేవతలను మెప్పించటానికి, మన ఇంటికి ఆహ్వానించటానికి చేస్తారు. అయోధ్య ప్రజలు నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించి శ్రీరాముడు తిరిగొచ్చాడన్న విషయాన్ని సాంప్రదాయ ఉత్సవంగా జరుపుకుంటారు.

మరో సంప్రదాయం ఏంటంటే దీపావళి నాడు పేకాడటం. దీపావళినాడు ఎవరైతే డబ్బుతో జూదం ఆడితే, వారికి ఏడాది పొడుగునా డబ్బు ఎక్కువగా లభిస్తుందని అంటారు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కూడా విష్ణుమూర్తితో పేక ఆడిందని అంటారు.

English summary

Why Diwali Is Called The Festival Of Lights

Diwali is famously known as the festival of lights; it is the most sought-after festival of the Hindus; it is celebrated with pomp and grandeur throughout the country. Diwali, also called Deepavali, is made of two words "Deep" and "Avali", meaning lights and rows; together it means rows of lights.
Story first published: Tuesday, October 10, 2017, 12:48 [IST]
Desktop Bottom Promotion