For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సరస్వతి దేవికి హంస వాహనంగా ఉండటం వెనుక పరమార్థం ఏంటి..?

  By Sindhu
  |

  పుస్తకాలు, గ్రంథాలు,పేపర్లు... ఇలా సమాచారాన్ని, బోధన గురించి వివరించేవాటిని మనం పవిత్రంగా పరిగణిస్తాం. చదువులకు తల్లి సరస్వతి దేవి. ఆమె కటాక్షం వుంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు. గ్రంథపఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది. అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతి స్వరూపంగా భావిస్తాం. అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం.

  భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. 'విద్య వినయేన శోభతే' అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా వుండాలని దీని భావం. ఈ విద్యను ప్రసాధించే సర్వతీ దేవికి హంస వాహనంగా ఉంటుంది. అలా ఉండటంలో, చదువుకు మద్య ఉన్న పరమార్థం మేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  సరస్వతి దేవి వాహనం హంస-

  సరస్వతి దేవి వాహనం హంస-

  సరస్వతి దేవి వాహనం హంస- పాలు , నీరు కలపి హం ముందు పెడితే హంస నీటిని వేరుచేసి పాలను మాత్రమే తాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.

  ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి

  ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి

  ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి, చెడును విసర్జించే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా దేవి సందేశమిస్తోంది..

  నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి

  నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి

  నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచములో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి. . . అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు.

  సరస్వతీదేవి అలాంటివారినే ఆదరిస్తుంది.

  సరస్వతీదేవి అలాంటివారినే ఆదరిస్తుంది.

  సరస్వతీదేవి అలాంటివారినే ఆదరిస్తుంది. . . కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది. విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునే వారు తప్పక సరస్వతీదేవిని ప్రార్ధించి అనుసరించాలి.

  హంస అంటే ఊపిరి,

  హంస అంటే ఊపిరి,

  హంస అంటే ఊపిరి, మనం విశ్వాస నుంచి ‘‘స:''అనే శబ్దం అని వెలువడుతుంది. బయటనుంి లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు ఉచ్చ్వాశం ‘‘అహం'' అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు.

   శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ

  శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ

  శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ ఈ జపం జరుగుతూనే ఉంటుంది. స: అంటే అతడు, భగవంతుడు, పరమాత్మ అని అహం అంటే నేను అని అర్థం.

  ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి

  ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి

  ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం స:, అహం స:..అంటూ హంసో హంసో హంసోహం హంస్సోహం హంస: అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అప్పటివరకు అతడు, నేను అని వేర్వేరుగా వినిపించేది, అతడే నేనేగా మారుతుంది. అతడు పరమాత్మ, నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఝానం. అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత సరస్వతి దేవి.

  అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది.

  అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది.

  అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది. సరస్వతి అన్న పదం కూడా రెండు పదాలనుండి వచ్చింది. సర: అంటే సారము అని, స్వ: అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ దేవి అయ్యింది.

  English summary

  Why does Goddess saraswati sit on a swan?

  Goddess Saraswati is worshipped as the goddess of learning, knowledge, intellect, music and arts. She represents the union of power and intelligence. She is also called 'Vak Devi'- the Goddess of Speech.
  Story first published: Saturday, January 21, 2017, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more