For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేమ్ టు సేమ్ కృష్ణుడి మాదిరిగా ఉన్న ప్రద్యుమ్నుడి గురించి తెలుసా? కృష్ణుడికి ఎలా పుట్టాడో తెలుసా

ప్రద్యుమ్నుడు పుట్టిన టైమ్ లో శంభరాసురుడు ప్రజల్ని నానా రకాలుగా పీడిస్తుంటాడు. అయితే ఆ రాక్షసుడికి ప్రద్యుమ్నుడి చేతిలో చావు ఉంటుంది. ఈ విషయం తెలిసిన శంభాసురుడు ప్రద్యుమ్నుడిని చిన్నతనంలోనే చంపాలనుకుం

|

శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో మన అందరికీ తెలుసు. ఆయన జీవితం మొత్తం కూడా మనకు ఆదర్శం. కృష్ణుడి అల్లరి గురించి మనకు తెలుసు. ఆయన సరసాలు తెలుసూ. అయితే ఒక తండ్రిగా కృష్ణుడి పాత్ర మనకు ఎక్కువగా తెలియదు. ఆయన కుమారుడి గురించి చాలా కొందరికే తెలిసి ఉంటుంది. కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు.

మన్మథుడు మళ్లీ పుట్టడం

మన్మథుడు మళ్లీ పుట్టడం

కృష్ణుడికి అందరూ కుమారులే. అందులో ప్రద్యుమ్నుడికి చాలా ప్రాముఖ్యం ఉంది. శివుడి తపస్సు చేస్తుండగా దాన్ని భంగం చేయడం వల్ల మన్మథుడు భస్మం అయిపోతాడు. అయితే మన్మథుడు లోక కల్యాణం కోసమే ఆ పని చేసి ఉంటాడు. అయితే తన భర్త మన్మథుడు భస్మం అయిపోయాడని వార్త తెలియగానే రతి దేవి రోదిస్తుంది.

నా భర్తను బతికించండి

నా భర్తను బతికించండి

చేయని తప్పుకు తన భర్తను బలి చేశారంటూ తన భర్తను బతికించమని ఈశ్వరుడిని కోరుతుంది రతిదేవి. దీంతో పరమేశ్వరుడు ఒక వరం ఇస్తాడు. నీ భర్త మళ్లీ శ్రీకృష్ణుడికి పుడతాడని చెబుతాడు. అలా కృష్ణుడికి, రుక్మిణి దేవికి మన్మధుడు ప్రద్యుమ్నుడిగా పుడతాడు.

రాక్షసుడిని చంపడం

రాక్షసుడిని చంపడం

ప్రద్యుమ్నుడు పుట్టిన టైమ్ లో శంభరాసురుడు ప్రజల్ని నానా రకాలుగా పీడిస్తుంటాడు. అయితే ఆ రాక్షసుడికి ప్రద్యుమ్నుడి చేతిలో చావు ఉంటుంది. ఈ విషయం తెలిసిన శంభాసురుడు ప్రద్యుమ్నుడిని చిన్నతనంలోనే చంపాలనుకుంటాడు. అందుకే ప్రద్యుమ్నుడిని తీసుకెళ్లి సముద్రంలో వేస్తాడు.

చేప మింగడంతో

చేప మింగడంతో

అయితే ప్రద్యముడిని ఒక చేప మింగేస్తుంది. ఆ చేప చాలా భారీగా ఉంటుంది. అయితే శంభరాసురుడి రాజ్యంలోని చేపలు పట్టే వారికి ఆ చేప దొరుకుతుంది. అంత భారీ చేపను రాజుకు బహుమతికి ఇస్తే బాగుంటుంది అనుకుని రాజుకు ఆ చేపను ఇస్తారు.

Most Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారుMost Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారు

చేప కోయగా అందులో బాలుడు

చేప కోయగా అందులో బాలుడు

అయితే అక్కడ వంట చేసే వారు దాన్ని కోయగా అందులో బాలుడు కనిపిస్తాడు. వంటమనుషులకు పెద్దగా ఉండే ఒక మహిళ ఆ బాలుడ్ని తీసుకెళ్తుంది. ఆ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకుంటుంది. ఆ బాలుడిని అదే రాజ్యంలోనే మంచి యోధుడిలా పెంచుతుంది. రోజూ శంభరాసురుడి రాజాస్థానానికి ప్రద్యమ్నుడు వెళ్లేవాడు.

పుట్టుక గురించి

పుట్టుక గురించి

అయితే ఒకసారి అక్కడికి వచ్చిన నారదుడి ద్వారా తన పుట్టుక గురించి తెలుసుకుంటాడు ప్రద్యమ్నుడు. అన్ని విషయాలు నారదుడు చెబుతాడు. చివరకు శంభరాసురడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత శంభరాసురుడితో పోటీపడతాడు. చివరకు ప్రద్యుమ్నుడి చేతిలో శంభరాసురుడు చనిపోతాడు.

సేమ్ టు సేమ్ కృష్ణుడి

సేమ్ టు సేమ్ కృష్ణుడి

తర్వాత ప్రద్యమ్నుడు ద్వారకకు వెళ్తాడు. సేమ్ టు సేమ్ కృష్ణుడి మాదిరిగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ప్రద్యుమ్నుడికి శ్రీకృష్ణుడు ఎన్నో విలు విద్యలు నేర్పుతాడు. ఇక కురుక్షేత్ర యుద్దంలో యాదవులంతా కౌరవుల వైపు ఉంటారు. కానీ కృష్ణుడు పాండవుల వైపు నిలుస్తాడు. ప్రద్యుమ్నుడు కూడా తన తండ్రివైపే ఉంటాడు. కానీ యుద్ధంలో పోరాటం చేయడు.

యాదవుల పోరాటంలో

యాదవుల పోరాటంలో

ప్రద్యుమ్నుడు మేనమామ కుమార్తై రుక్మావతిని పెళ్లి చేసుకుంటాడు. ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు పుడుతాడు. అయితే యాదవులు వాళ్లలో వాళ్ల కొట్టుకుని చనిపోయే క్రమంలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రద్యుమ్నుడు చనిపోతాడు. అయితే తండ్రికి తగ్గ కుమారుడిగా ప్రద్యమ్నుడు పేరుగాంచాడు.

English summary

Why Lord Krishna's son Pradhyumna killed demon Sambara

Pradyumna was born in Dvaraka. He was the incarnate of god Kamdev When Pradyumna grew up, he battled the demon Sambara and killed him using the Vaishnavastra. Soon after Pradyumna became a constant companion of his father Krishna and was well liked by the people of Dvaraka.
Desktop Bottom Promotion