For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాశివరాత్రి రోజు శివానుగ్రహానికి పాటించాల్సిన నియమాలేంటి ?

By Swathi
|

మహా శివుడికి మహత్తరమైన పండుగ మహాశివరాత్రి. హిందువులు అత్యంత శక్తివంతమైన దేవుడిగా భావించే ఆ శివ నామ స్మరణలో, శివ భక్తిలో భక్తులు 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి రోజు వచ్చేది మాస శివరాత్రి. ఆ రోజు కూడా శివారాధన చేసినప్పటికీ మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. అత్యంత విశిష్టమైనది, పరమపవిత్రమైనది.

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?

ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ.. ప్రతి రోజూ ఒక కొత్తదనం. పండుగలంటే మనకెంతో సరదా. ఎంతో ఉత్సాహంగా సరదాగా జరుపుకుంటాం. ఏ మతంలోనూ హిందువులకు ఉన్నన్ని పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాలు ఉండవేమో. అలాగే ప్రతి పండుగ వెనక ఒక అంతరార్థం, పరమార్థం ఉంటుంది. ఒక్కో పండుగ రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకం. అలాగే మహా శివరాత్రి శివారాధనకు ప్రత్యేకం.

శివుడి చిహ్నాలకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి ? శివుడి చిహ్నాలకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి ?

మహాశివరాత్రి పండుగ జరుపుకోవడంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి. శివార్చన, ఉపవాసం, జాగరణం ఈ మూడు శివరాత్రికి చాలా ప్రత్యేకమైనవి. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. శివరాత్రి రోజు సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు.. నిద్రపోకుండా మేల్కొని ఉండటాన్ని జాగారణం అని పిలుస్తారు. ఈ మూడింటినీ పాటిస్తే.. ఆ శివుడి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం.

ఎందుకు పవిత్రం

ఎందుకు పవిత్రం

ఈ సంవత్సరం శివరాత్రికి ముందురోజే శివరాత్రి వత్రం మొదలవుతుందట. ఇది చాలా పవిత్రమైనది.

ఏం చేయాలి ?

ఏం చేయాలి ?

ఆ రోజు భక్తులంతా.. రోజంతటిలో ఒకసారి మాత్రమే భోజనం చేసి.. చతుర్ధశి రోజు రాత్రి శివుడిని పూజించాలి. మరుసటి రోజు భక్తులంతా కాలకృత్యాలు ముగించుకుని.. శివారాధన చేసి.. రోజంతా ఉపవాసం ఉండాలి.

శివుడికి ఏం సమర్పించాలి ?

శివుడికి ఏం సమర్పించాలి ?

మహాశివరాత్రి రోజు శివ లింగానికి బిల్వ పత్రం సమర్పిస్తే మంచిది. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం ఆచారంగా వస్తోంది.

ఎందుకు జరుపుకుంటాం ?

ఎందుకు జరుపుకుంటాం ?

అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా ? హిందూ పురాణాల ప్రకారం మహా శివరాత్రి రోజు పార్వతీదేవి, శివుడి పెళ్లి రోజు. అందుకే మనం ఇంత పవిత్రంగా, ప్రత్యేకంగా జరుపుకుంటాం.

మహా శివరాత్రి రోజు ఏం చేయాలి ?

మహా శివరాత్రి రోజు ఏం చేయాలి ?

మహా శివరాత్రి రోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ పండుగ జరుపుకుంటాం. ఈ పర్వదినాన భక్తులు శివాలయాలకు వెళ్లి ఆ పరమశివుడి దర్శనం చేసుకుని ఆ దేవుడి ఆశీస్సులు పొందుతారు.

ప్రపంచవ్యాప్తంగా ?

ప్రపంచవ్యాప్తంగా ?

మహా శివరాత్రిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

మోక్షం

మోక్షం

మహా శివరాత్రి రోజు ఉపవాసం చేసిన వాళ్లు మోక్షం పొందుతారని శివభక్తులు విశ్వసిస్తారు.

పూజ

పూజ

శివలింగానికి పూజాదికార్యక్రమాలు ఆలయ పూజారి నిర్వహిస్తాడు. ఈ పూజలు మహాశివరాత్రి రోజు ప్రతి మూడు గంటలకు ఒకసారి నిర్వహిస్తారు. అంటే మహాశివరాత్రి రోజు తెల్లవారు జాము నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రతి మూడు గంటలకు ఒకసారి పూజ చేస్తారు.

మంత్రజపం

మంత్రజపం

మహా శివరాత్రి రోజు భక్తులు పవిత్రమైన శివ మంత్రం.. ఒం నమ: శివాయ అని స్మరిస్తారు. మహా శివరాత్రి రోజంతా శివనామస్మరణలోనే ఉంటారు.

చాలా పవర్ ఫుల్

చాలా పవర్ ఫుల్

ఇతరు పర్వదినాలలో ఉండే ఉపవాసం కంటే.. మహా శివరాత్రి రోజు చేసే ఉపవాసం పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.

ఎలా ఉపయోగపడుతుంది ?

ఎలా ఉపయోగపడుతుంది ?

మహా శివరాత్రి రోజు పూజలు చేయడం వల్ల తమో గుణం, రజో గుణం పొందుతారట. అంటే.. తమో గుణం అంటే.. నిర్మలమైన మనసు, రజో గుణం అంటే.. మంచి అలవాట్లు పొందుతారని అర్థం. మానవులుగా మంచి లక్షణాలు పొందుతారని తెలుపుతుంది.

భక్తిపూర్వకంగా

భక్తిపూర్వకంగా

మహాశివరాత్రి రోజు ఎవరైతే.. చాలా పవిత్రంగా, భక్తి ప్రపత్తులతో ఆ శివారాధన చేస్తారో.. వాళ్లకు.. ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది.

పాలు, పండ్లు

పాలు, పండ్లు

మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల ఆ మహా శివుడి అనుగ్రహం ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఉపవాసం సమయంలో పాలు, పండ్లు తీసుకోవచ్చు.

లింగాభిషేకం

లింగాభిషేకం

ఉపవాసం ఉన్న భక్తులు శివుడిని దర్శించుకుని.. శివలింగానికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇష్టమైనవి

ఇష్టమైనవి

మహా శివరాత్రి రోజు భక్తులు స్నానం చేసి.. శివుడికి ఇష్టమైన పాలు, తేనె, పంచదార, నెయ్యితో అభిషేకం నిర్వహిస్తారు.

అలంకరణ

అలంకరణ

అభిషేకం తర్వాత శివుడికి తిలకం దిద్ది.. పూలతో అలంకరిస్తారు. పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు.

కథ

కథ

శివుడి కథ వినడం పూర్తి అయిన తర్వాత ఈ పూజ పూర్తయిందని భక్తులు భావిస్తారు.

మంచి జీవితం

మంచి జీవితం

కాబట్టి ఈ ఏడాది మహా శివరాత్రి చాలా పవిత్రమైనది. ఎవరైతే ఈ ఏడాది ఉపవాసం చేసి.. ఆ మహా శివుడిని ప్రసన్నం చేసుకుంటారో వాళ్లకు.. మంచి జీవితం ఉంటుంది.

English summary

Why this year's Maha Shivratri is super auspicious

Why this year's Maha Shivratri is super auspicious. Maha Shivratri is one of the biggest Hindu festivals in the country that is celebrated with much fervour. The festival, that falls on March 7 this year is special in its own way.
Story first published: Friday, March 4, 2016, 17:18 [IST]
Desktop Bottom Promotion