Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదో తెలుసా?
పూజాది కార్యక్రమాల్లో, దేవాలయాల్లో మహిళలు కొబ్బరి కాయలను ఎందుకు కొట్టకూడదు, దీని వెనక అసలు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి శుభకార్యానికి కొబ్బరి కాయలు కొడుతుంటాం. ఏదైనా గుడికి వెళ్లినా దేవుడిని మొక్కి కొబ్బరికాయలు కొట్టడం తెలిసిందే. అయితే కొబ్బరి కాయలు మహిళలు కొట్టకూడదని అంటుంటారు. ఈ ఆచారం చాలా రోజుల నుండి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు కొబ్బరి కాయలు కొట్టడం మనం చూస్తూనే ఉన్నప్పటికీ, మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదని పెద్దలు చెబుతుంటారు.

పూజాది కార్యక్రమాల్లో, దేవాలయాల్లో మహిళలు కొబ్బరి కాయలను ఎందుకు కొట్టకూడదు, దీని వెనక అసలు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రాల్లో కొబ్బరికాయల ప్రాముఖ్యత:
- పురాణాల ప్రకారం విష్ణువు భూమిపై అవతరించినప్పుడు విష్ణువు తనతో పాటు లక్ష్మీ, కొబ్బరి చెట్టు, కామధేను తీసుకువచ్చాడు. ఇవి మనిషి వరం. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తుంటారు.
- కొబ్బరికాయలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. ముక్కోటి దేవతలు ఉండటం వల్ల కొబ్బరికాయను స్త్రీలకు దూరంగా ఉంచుతారు.
- కొబ్బరికాయను విష్ణువు భూమికి తీసుకువచ్చినప్పుడు దానిపై లక్ష్మీ దేవికి హక్కు ఉంటుంది. అందుకే లక్ష్మీ దేవి తప్ప కొబ్బరి కాయను మరో మహిళ ముట్టకూడదని అంటారు.
- కొబ్బరిని విత్తనంగా పరిగణిస్తారు. స్త్రీ విత్తనం రూపంలో బిడ్డను జన్మనిస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టడం వారికి అశుభంగా మారుతుందని, గర్భం దాల్చడంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు.
- ఒకప్పుడు విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపం తెచ్చుకుని ప్రత్యేక స్వర్గాన్ని సృష్టించాడని, దీని తర్వాత కూడా మహర్షి సంతృప్తి చెందకపోవడంతో ప్రత్యేక భూమిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడని, అలా కొబ్బరికాయను మానవ రూపంలో తీసుకున్నాడని మత విశ్వాసం.

వారికి బలం ఎక్కువ అందుకే..
దేవాలయాల్లో, మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయలు కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా, ఆశీర్వాదం కోసం అదో మార్గంగా పరిగణిస్తుంటాం. కొబ్బరికాయను పగలగొట్టడం అహంకారాన్ని తొలగించడాన్ని కూడా సూచిస్తుంది. ఎలాంటి అహంకారం, తరతమ భేదం, ఇతర చెడు భావోద్వేగాలు లేకుండా తమను తాము దైవానికి సమర్పించడానికి సూచికగా కొబ్బరికాయ కొట్టడాన్ని పరిగణిస్తాం. కొబ్బరి కాయను కొట్టడానికి బలం అవసరం. స్త్రీలకో పోలిస్తే పురుషులు బలవంతులను ఆనాటి కాలంలో భావించారు. అలా కొబ్బరికాయలను పురుషులే మాత్రమే కొట్టేవారు.

నిషేధం, నియమం ఏదీ లేదు:
మహిళలు కొబ్బరికాయలు పగలగొట్టకూడదని ప్రత్యేక నియమం అంటూ ఏదీ లేదు. చాలా దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయ కొట్టడాన్ని తప్పుగా పరిగణించరు. మతపరమైన వేడుకల్లోనూ స్త్రీలు కొబ్బరికాయ కొట్టడాన్ని అనుమతిస్తున్నారు. ఒకప్పుడు స్త్రీలు కొబ్బరికాయలు కొట్టవద్దన్నది ఆచారాన్ని చాలా మంది సమర్థించడం లేదు. సమానత్వం అనే అంశం ప్రతి చోటా అమలు అవుతుండటం వల్ల కొబ్బరికాయ కొట్టడం అనే విషయంలో స్త్రీ, పురుష భేదం ఇప్పుడు చాలా చోట్ల లేదు. అయితే కొంత మంది ఇప్పటికీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవద్దని నమ్ముతున్నారు. పలు సంప్రదాయాల్లో కొబ్బరికాయ కొట్టడాన్ని ఇప్పటికీ తప్పుగా పరిగణిస్తున్నారు. అయితే ఇతరుల నమ్మకాలను, విశ్వాసాలను గౌరవించడం ముఖ్యం. మహిళలు తమకు తాముగా కొన్ని ఆచారాలు పాటిస్తుంటే వారిని గౌరవించాల్సిందే.



Click it and Unblock the Notifications
