స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి క్యారెట్ తో ప్యాక్

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా అమ్మాయిలకు డెలవరీ టైంలో పొట్టమీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కాకుండా, బరువు తగ్గిన తర్వాత అమ్మాయి, అబ్బాయిలందరిలోను నడుము చుట్టూ, భుజాల చుట్టూ హిప్స్ మీద స్ట్రెచ్ మార్స్క్ వచ్చే అవకాశం వుంది. ఈ పరిస్థితిలో చర్మం కింద కొల్లాజున్ ఫైబర్స్ సాగిపోయి విడిపోవడం వల్ల నడుము మీద, భుజాల చుట్టూ ఏర్పడే తెల్లని పొడవైన చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు.

కొందరు స్త్రీలలో తొలి యవ్వన దశలో అంటే రజస్వల అయిన అనంతరం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు గర్భం ధరించినప్పటి నుంచి బలమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా ఉండటం, బిడ్డపుట్టిన తర్వాత కూడా అదేవిధమైన జీవన శైలికి అలవాటు పడటం వల్ల పొట్ట బాగా సాగి, ముడతలు పడుతుంది. ఈ విధంగా ఒక్క గర్భిణులకే కాదు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఏ విధమైన ఎక్సర్‌సైజూ చేయకుండా, ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉండే ప్రతి ఒక్కరికీ ఆ విధంగా ముడతలు పడటం సహజం.

 Remove Those Ugly Stretch Marks With This Amazing Magical Carrot Paste

ఇవి చర్మంపై సన్నని గీతాలుగా ఉంటాయి. అయితే ఇవి కడుపు, పిరుదులు, ఛాతీ మరియు తొడలు భాగాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ ప్రారంభంలో ఫ్లాట్ గా ఎరుపు రేఖలుగా కనిపించడం ప్రారంభమవుతుంది, కాలక్రమేణా అవి కొద్దిగా చితికిపోయిన తెల్లని రేఖలుగా కనిపిస్తాయి. ఇవి బయటకు కనబడుతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీటిని తొలగించుకోవడానికి కొన్ని సులభమైన హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక సింపుల్ హోం రెమెడీ మీకోసం..

పద్ధతి 1:

పద్ధతి 1:

కావలసిన పదార్థాలు:

క్యారట్ : 1/2

ఆరెంజ్ తొక్క : 1

ఆలివ్ ఆయిల్ :4 టేబుల్ స్పూన్లు

"బ్యాక్ టు ఈడెన్:

"బ్యాక్ టు ఈడెన్: ది క్లాసిక్ గైడ్ టు హెర్బల్ మెడిసిన్, నేచురల్ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ 1939 నుండి" జెథ్రో క్లోస్స్అనే రచయిత వ్రాసిన, ఈ పదార్ధాల యొక్క మిశ్రమంతో తయారుచేసిన దానిని ఒక స్ర్కబ్ లాగా వాడటం వలన మీ చర్మం మీద గల స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించుకోవచ్చు.

తయారుచేసుకునే విధానం:

తయారుచేసుకునే విధానం:

½ క్యారట్, 1 ఆరంజ్ పండు తొక్క మరియు 4 టీ స్పూన్స్ ల ఆలివ్ ఆయిల్ ని బ్లెండర్ లేదా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

స్నానం చేయడానికి 15 నుండి 30గంట ముందు

స్నానం చేయడానికి 15 నుండి 30గంట ముందు

స్నానం చేయడానికి 15 నుండి 30గంట ముందు దీన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. అది ఆరిన తర్వత గోరువెచ్చని నీటితో స్నానం చేసి తర్వాత రెగ్యులర్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మంచిది . ఈ మిశ్రమ పదార్థాన్ని చర్మానికి స్ర్కబ్బర్ గా రోజూ ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు.

పద్ధతి 2:

పద్ధతి 2:

క్యారెట్ సాప్ట్ గా ఉండాలంటే కొద్దిగా నీళ్ళు వేడి చేసి అందులో క్యారెట్ ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత చిక్కటి పేస్ట్ లా అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసిన తర్వాత నేచురల్ గా డ్రైగా మారిన తర్వాత 10 నిముషాలు స్క్రబ్ చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పద్ధతి 2:

పద్ధతి 2:

స్ట్రెచ్ మార్క్స్ కారణంగా చర్మ సౌందర్యం తగ్గుతుంది. కాబట్టి, ఈ చిన్న పాటి చిట్కాలను అనుసరించినట్లైతే స్ట్రెచ్ మార్క్స్ ను ఎఫెక్టివ్ గా తొలగించుకుంటారు. ఈ చిన్న చిట్కాలతో పాటు స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడంలో మరేవైనా చిట్కాలు మీకు తెలినట్లైతే ఈ క్రింది కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి.

English summary

Remove Those Ugly Stretch Marks With This Amazing Magical Carrot Paste

Remove Those Ugly Stretch Marks With This Amazing Magical Carrot Paste,remove those ugly stretch marks with this amazing magical carrot paste.
Subscribe Newsletter