స్విమ్మింగ్ చేసే ముందు (మరియు) చేసిన తర్వాత అనుసరించవలసిన అందమైన చిట్కాలు !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం వల్ల, మీ మనసుకు మరియు శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ప్రతిరోజూ మీరు ఈత కొట్టడం వల్ల, మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

క్లోరిన్ను కలిగి ఉన్న నీటిలో మీరు ఈత కొట్టడం వల్ల, మీ చర్మానికి మరియు మీ జుట్టుకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. ఈ ఈత కొలనులో మిళితమైన రసాయనాలు మీ చర్మం మరియు జుట్టు యొక్క సహజ లక్షణాలను నివారించగలవు.

ఆ విధంగా మీరు వికారమైన చర్మమును మరియు జుట్టు సమస్యలను పొందగలరు. అలా ఎదురయ్యే నష్టాలలో పొడి చర్మం, మొటిమలు, చర్మం పగలడం, అంతే కాకుండా జుట్టు చుట్టలు చుట్టలుగా ఉండటం మరియు చిట్లడం వంటివి కూడా ఉన్నాయి.

అలా, క్లోరిన్ వల్ల మీ చర్మము మరియు జుట్టు నష్ట పోకుండా ఉండేందుకు, కొన్ని చిట్కాలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి, మీరు ఈతకు వెళ్లేముందు మరియు ఆ తర్వాత, అనుసరించవలసిన చిట్కాల జాబితాను, నేడు మీ బోల్డ్ స్కై, మీ ముందుకు తీసుకు వచ్చింది.

ఆ చిట్కాలను అనుసరించడం వల్ల మీ చర్మానికి మరియు జుట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా స్విమ్మింగ్ను మీరు బాగా ఆస్వాదించగలరు.

ఆ చిట్కాలేమిటో మీరూ ఒక్కసారి చూడండి !

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని వైవిధ్యంగా కాపాడుకునేందుకు తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఇది. మీరు ఈత కొలను లోనికి వెళ్లే ముందు గి వెళ్లే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా మంచిది.

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

ఆరు బయట ఉన్న ఈత కొలనులో మీరు దిగే ముందు మీ చర్మానికి సన్స్క్రీన్ లోషన్ను అప్లై చేయండి. ఎందుకంటే సన్స్క్రీన్ అనేది సూర్యరశ్మి మరియు క్లోరిన్ నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంటి వెలుపలి భాగంలో ఉన్న ఈత కొలనులో దిగి ముందు మీ చర్మాన్ని తేలికపాటి బట్టతో కప్పుకోవాలి.

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

కండిషనర్ (లేదా) హైయిర్ ఆయిల్ వంటివి మీ జుట్టును సహజంగా సంరక్షించేవిగా పనిచేస్తుంది మరియు క్లోరిన్ నుండి మీ జుట్టును కాపాడుతుంది. కాబట్టి మీరు ఈత కొలనులోకి అడుగుపెట్టే ముందు క్లోరిన్ వల్ల కలిగే నష్టాన్ని నివారించే ఉత్పత్తులను ఉపయోగించడాన్ని మర్చిపోకండి.

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

మీ జుట్టుకు కండిషనర్ను (లేదా) నూనెను ఉపయోగించిన తర్వాత తాజా నీటితో మీ జుట్టును తడి చేయాలి. ఇది క్లోరిన్ నీటిని నేరుగా మీ జుట్టును తాకకుండా ఉంచి, మీ జుట్టు నష్టపోకుండా బాగా సంరక్షించడానికి సహకరిస్తుంది.

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

స్విమ్మింగ్ చేయడానికి ముందు :-

5. తలకు టోపీని ధరించాలి :

చివరిగా, క్లోరిన్ నేరుగా మీ జుట్టుని తాకకుండా అడ్డగించేందుకు మీ తలకు టోపీని ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు మీరెన్ని తీసుకున్నా, జుట్టులో కొంత భాగం క్లోరిన్ నీటికి గురవుతుంది. అందువల్ల, క్లోరిన్ భారీ నుండి మీ జుట్టును కాపాడుకోవడానికి ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

6. స్నానం చేయాలి :

ఈత కొలను నుండి అడుగు బయట పెట్టాక, వెంటనే మీరు తలస్నానం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల హానిని కలుగజేసే రసాయనాలకు మీరు దూరంగా ఉంచబడతారు.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

7. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి :

ఈత కొట్టిన తరువాత చల్లని (లేదా) వేడి నీళ్లతో స్నానం చేయడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.

వాటికి బదులుగా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ చర్మం సహజమైన తేమను కోల్పోకుండా కాపాడబడుతూ ఉంటుంది మరియు మీ చర్మాన్ని ఎక్కువగా రుద్ధనవసరం లేదు.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

8. జుట్టును షాంపూతో కడగండి :

ఈత కొలను నుండి బయటకి వచ్చిన తర్వాత, క్లోరిన్ నీటికి గురైన మీ జుట్టును షాంపూతో శుభ్రంగా కడగండి. క్లోరిన్ నీటి నుండి మీ జుట్టు నష్టపోకుండా నివారించడానికి షాంపూతో తలస్నానం చేయడం చాలా ఉత్తమము.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

9. మీ చర్మాన్ని ప్రక్షాళన చెయ్యాలి :

క్లోరిన్ నీటిలో ఈత కొట్టడం వల్ల చర్మం ఉపరితలంపై స్థిరపడిన రసాయనాలను వదిలించుకోవడానికి "పారదర్శకమైన చర్మ సౌందర్య సాధనాలను" ఉపయోగించండి. క్లోరిన్ నీటిలో ఉన్న రసాయనాలు మీ చర్మాన్ని నష్టపరచకుండా అడ్డుకుని మీ చర్మ కాంతిని రక్షించేందుకు ఇవి (స్కిన్ క్లీన్సర్) ఎంతగానో ఉపయోగపడతాయి.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

10. కండిషనర్ని ఉపయోగించండి :

నీటితో శుభ్రం చేసిన తర్వాత మీ జుట్టుకు కండిషనర్ని అప్లై చేయండి. ఇది మీ జుట్టుకు నష్టాన్ని కలుగజేసే రాడికల్స్ నుండి కాపాడుతుంది మరియు స్వింగ్ చేసిన తర్వాత కూడా మీ జుట్టు అందంగా, మృదువుగా ఉంచుతుందని నిర్ధారించుకోండి.

 స్విమ్మింగ్ చేసిన తరువాత :-

స్విమ్మింగ్ చేసిన తరువాత :-

11. మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి :

చివరిగా, మీ శరీరమంతటికీ మాయిశ్చరైజర్ను అప్లై చేయండి. క్లోరిన్ నీటి లో పూర్తిగా తడిసిన మీ చర్మాన్నర్మాన్ని మృదువుగా కోమలంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మీరు స్విమ్మింగ్ చేసిన తర్వాత సూర్యరశ్మిలోనికి అడుగు పెట్టినప్పుడు, మీ ముఖము మరియు చేతులకు ఉన్న సహజమైన కాంతిని నష్టపోనివ్వకుండా కాపాడుతుంది.

English summary

Before And After Swimming Beauty Tips For Swimmers

Before And After Swimming Beauty Tips For Swimmers,Swimming in chlorine-treated water can take a serious toll on the state of your skin and hair. The chemicals in the swimming pool can strip your skin and hair off of their natural oil and moisture. So there are certain tips and care that you need to follow before and a
Story first published: Monday, February 12, 2018, 12:00 [IST]