సహజ పద్దతులలో ఒత్తైన మరియు తీరైన కనుబొమ్మలను పొందాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, చదివేయండి.

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

ఆడవారు తమ కనుబొమ్మలను నిండుగా తీర్చిదిద్దుకోవడానికి ఐ బ్రో పెన్సిల్ వాడతారనేది విడ్డూరమేమి కాదు. ఒద్దికైన కనుబొమ్మలు మన ముఖానికి వన్నె తెస్తాయనేది కాదనలేని నిజం.

తొంభైలలో పల్చని కనుబొమ్మలు ఫ్యాషన్ కనుక ఆడవారు తమ కనుబొమ్మలను ఎక్కువగా తొలగించేవారు. కానీ, ప్రస్తుతం దట్టమైన కనుబొమ్మల సోయగానికే నేటిమహిళ ఓటు వేస్తుంది. పలుచని కనుబొమ్మలున్న ఇంతులు కాస్మెటిక్ ప్రక్రియలతో తీరైన ఆకారాన్ని పొందుతున్నారు.

మీరు కనుక సహజమైన పద్ధతుల ద్వారా దట్టమైన కనుబొమ్మలను పొందాలనుకునేవారైతే, అటువంటి ఖరీదైన చికిత్సలు పోకుండా, వంటింటి చిట్కాలతోనే తెలివిగా సాధించవచ్చు. మీ కొరకై ఆ చిట్కాలను ఇప్పుడు మేము తెలియజేయబోతున్నాము.

Get Thick, Natural Eyebrows With These Amazing Tips

ఇక్కడ మీకోసం మీ ముఖకవళికలను అందంగా తీర్చిదిద్దే నిండైన కనుబొమ్మలు పొందడానికి ఉపయోగపడే చిట్కాలను పొందుపరుస్తున్నాం, చదవండి!

1. ఆముదం:

1. ఆముదం:

ఒత్తైన కనుబొమ్మలను పొందటానికి ఆముదం వాడటం అద్భుతమైన మార్గం.

వాడే పద్ధతి: ఒక కాటన్ ఇయర్ బడ్ ను ఆముదంలో ముంచి కనుబొమ్మలకు రాసుకోవాలి. ముప్పై-నలభై నిమిషాలు ఆరనిచ్చి మెత్తని తడి గుడ్డతో తుడిచేయాలి. ప్రతిరోజు రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా ఎదుగుతాయి.

2. మెంతులు:

2. మెంతులు:

మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మల పెరుగుదలను ప్రోత్సహించి, దట్టంగా కనపడేటట్టు చేస్తుంది.

వాడే పద్ధతి: గుప్పెడు మెంతులను ఒక గిన్నెలో ఆరేడు గంటల పాటు నాననివ్వండి. తరువాత వీటిని మెత్తని ముద్దగా రుబ్బండి. ఈ ముద్దను కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో తుడిచేయండి. అద్భుతమైన ఫలితాల కొరకు ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేయండి.

3. కొబ్బరినూనె:

3. కొబ్బరినూనె:

కొన్ని దశాబ్దాలుగా ఆడవాళ్లు కొబ్బరినూనెను తమ కనుబొమ్మల ఎదుగుదలకు వినియోగిస్తున్నారు. ఇది వెంట్రుకను దలసరిగా చేసి పలుచన కావడాన్ని నివారిస్తుంది.

వాడే పద్ధతి: ఒక దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి కనుబొమ్మలపై అద్దుకోండి. రాత్రంతా కొబ్బరినూనె తన వంతు పని చేస్తూపోతుంది. పొద్దుట లేచాకా మృదువైన క్లెన్సర్ మరియు గోరు వెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రపరచుకోండి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే కలిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.

4. బాదం నూనె:

4. బాదం నూనె:

బాదం నూనె సహజంగానే వెంట్రుకల ఎదగడానికి అవసరమయ్యే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఒత్తైన కనుబొమ్మలను పొందటానికి సహకరిస్తుంది.

వాడే పద్ధతి: ఒక కాటన్ ఇయర్ బడ్ ను బాదంనూనెలో ముంచి కనుబొమ్మలకు రాసుకోవాలి. మృదువుగా వెలికొనలతో కనుబొమ్మలను మర్దన చేసుకోండి. ముప్పై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి. ఫలితం త్వరగా పొందాలంటే వారానికి 4-5 సార్లు రాసుకోండి.

5. విటమిన్ ఇ నూనె:

5. విటమిన్ ఇ నూనె:

విటమిన్ ఇ నూనె కనుబొమ్మలపై వెంట్రుకల పెరుగుదల త్వరగా జరిగేలా ప్రభావితం చేస్తుంది.

వాడే పద్ధతి: విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి మూనెను పిండివేసి, పడుకోబోయే ముందు కనుబొమ్మలకు పూసుకోండి. రాత్రంతా ఉండనిచ్చి తెల్లారి మేకప్ రిమూవర్ తో తొలగించి వేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి అయిదారు సార్లు ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా ఎదుగుతాయి.

6. కలబంద గుజ్జు:

6. కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు వెంట్రుకలకు అవసరమైన పోషణను అందించి త్వరగా ఎడగడాన్ని ప్రోత్సహిస్తుంది.

వాడే విధానం: పడుకోబోయే ముందు కలబంద గుజ్జును వెలికొనలతో తీసుకుని కనుబొమ్మలపై మృదువుగా మర్దన చేసుకోండి. రాత్రంతా ఉండనిచ్చి తెల్లవారి నిద్రలేచిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోండి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా చేస్తే ఫలితాలు త్వరగా వస్తాయి.

English summary

Get Thick, Natural Eyebrows With These Amazing Tips

Luscious eyebrows can raise beauty quotient by notches. If you too wish to get naturally thick eyebrows, instead of going for pricey procedures, it is always wise to try out natural tips. Massaging your eyebrows with castor oil, coconut oil, fenugreek seeds, almond oil, and vitamin E oil could work wonders and give you natural thick eyebrows.