For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవాంఛిత రోమాలను తొలగించే సబ్బును ఇంట్లో ఎలా తయారు చేయాలో చూడండి...

మీ ఇంట్లోనే వెంట్రుకలను తొలగించే సబ్బులను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది మహిళల్లో సాధారణంగా అవాంఛిన రోమాలు అనేవి చాలా సమస్యగా ఉంటాయి. వాటిని వదిలించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

How to Make Homemade Hair Removal Soap With Leftover Soap in Telugu

ఇందుకోసం మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మార్కెట్లో లభించే హెయిర్ రిమూవర్ క్రీమ్ లేదా రేజర్ ని వాడుతూ ఉంటారు. ఇది కాకుండా వాక్సిలాన్ కూడా అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి. కానీ వాక్సింగ్ సమయంలో వచ్చే నొప్పి లేదా హెయిర్ రిమూవల్ క్రీమ్ లేదా రేజర్ వాడితన తర్వాత మంట మరియు దురద చాలా బాధకారంగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు చాలా సులభమైన పరిష్కారం ఉంది. అందుకోసం మీరు ఖరీదైన హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ను కొనాల్సిన పని లేదు. మీరు ఇంట్లోనే ఉంటూ హెయిర్ రిమూవల్ సబ్బును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

How to Make Homemade Hair Removal Soap With Leftover Soap in Telugu

మనలో చాలా మంది మన ఇళ్లలో ఉండే సబ్బులను చివర్లో వాడకుండా పారేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా ప్రయత్నించినట్లయితే, మీరు చాలా తక్కువ ఖర్చుతో మరియు నొప్పి లేకుండా అనవసరమైన హెయిర్ ను సులభంగా వదిలించుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..
సబ్బు ముక్కలు
బేరియం సల్ఫేట్ పొడి
పసుపు పొడి

ముందుగా బాత్ రూమ్ లో మిగిలి ఉన్న చిన్న సబ్బు ముక్కలను సేకరించండి. దీని తర్వాత మైనపు హీటర్లో అన్ని సబ్బు ముక్కలను ఉంచండి. అది కరగడం ప్రారంభించినప్పుడు, వేడిని తగ్గించండి. తర్వాత సబ్బు కాలిపోకుండా అది వేడిగా మారుతుంది. సబ్బు బాగా కరిగిన తర్వాత, ఒక టీస్పూన్ బేరియం సల్పేట్ పొడి మరియు చిటికెడు పసుపు వేయండి. వీటన్నింటిని పౌడర్ వేసి కలపాలి. ఈ మయంలో బేరియం సల్ఫేట్ పొడిని కరిగించిన సబ్బుతో బాగా కలపాలి. మీకు కావాల్సిన అచ్చులో నింపి పొడిగా ఉంచండి. ఈ విధంగా మీ ఇంట్లో రోమాలు తొలగించే సబ్బు తయారైపోతుంది.

ఎలా వాడాలంటే..
పొడి చర్మంపై హెయిర్ రిమూవల్ సబ్బును ఎప్పుడు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. కాబట్టి మీ చర్మాన్ని నీటితో తడిపి, ఈ సబ్బును అప్లై చేయండి. దీన్ని సున్నితంగా మీ చర్మంపై రుద్దితే రొమాలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. ఈ మొత్తం ప్రక్రియకు కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి దీన్ని చేయడానికి కూర్చోవడానికి సమయాన్ని వెచ్చించండి. రోమాలు బయటికి వచ్చినప్పుడు శుభ్రమైన నీటితో చర్మాన్ని కడగాలి. ఈ సబ్బు సహాయంతో చేతులు, కాళ్లు, కడుపు మరియు వీపు మొదలైన వెంట్రుకలను తొలగించుకోవచ్చు. దీన్ని వాడే ముందు చర్మంపై క్రీమ్, నూనె వంటివి వాడకూడదని గుర్తుంచుకోండి.

ఇవి గుర్తుంచుకోండి..
ఎవరికైతే సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ సబ్బును ఉపయోగించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.
ఇది బయటి చర్మం నుండి వెంట్రుకలను మాత్రమే తొలగించగలదు. కాబట్టి దీన్ని ప్రైవేట్ భాగంలో అస్సలు వాడొద్దు.
చర్మంపై గాయాలేమైనా ఉంటే, అది మానిపోయిన తర్వాత మాత్రమే ఈ సబ్బును వాడాలి.
ఈ సబ్బును ఉపయోగించిన తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోవద్దు.

English summary

How to Make Homemade Hair Removal Soap With Leftover Soap in Telugu

Here we are talking about the how to make Homemade Hair Removal Soap from the remaining soap pieces. Have a look
Story first published:Thursday, June 23, 2022, 14:32 [IST]
Desktop Bottom Promotion