For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ వాల్యూమ్ నేచురల్ గా పెంచే 8 సులభ టిప్స్

|

ప్రతి రోజూ తల దువ్వుకొన్నప్పుడు జుట్టు రాలిపోవడం చూసి మీరు భయపడుతున్నారా? ప్రతి రోజూ 60-100వరకూ వెంట్రులకలు రాలిపోవడం సహాజం రాలినా కూడా తిరిగి వాటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది.

కానీ జుట్టు అధికంగా రాలుతుంటే మాత్రం, అది సీరియస్ గా తీసుకోవల్సిన విషయమే. మీ జుట్టు అధికంగా రాలకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడ వల్ల జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సహించవచ్చు. మీ హెయిర్ వాల్యూమ్ ను నేచురల్ గా పెంచుకోవడం కోసం ఇక్కడ కొన్ని సింపుల్ మార్గాలున్నాయి.

జుట్టు పెరుగుదలకు : టాప్ 10 జ్యూసులు:క్లిక్ చేయండి

1. అలోవెర

1. అలోవెర

మీ జుట్టు చాలా సున్నితంగా ఉన్నట్లైతే అలోవెరా చాల నేచురల్ రెమెడీ. ఇది మీ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే మాయిశ్చరైజర్ ను మరియు న్యూట్రీషియన్స్ ను అంధిస్తుంది. దాంతో మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలోవెరా జ్యూస్ ను మీ తలకు పట్టించి ఒక గంట అలాగే ఉండి తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

2. షాంపు

2. షాంపు

షాంపులను ఉపయోగించడంలో చాలా మంది మనస్సులో మెదిలే ప్రశ్న?తలకు రెగ్యులర్ గా షాంపు పెట్టుకోవచ్చు లేదా? ఈ విషయం ఖచ్ఛితంగా తెలుసుకోవాలి. మీ జుట్టు ఆయిల్ గా ఉన్నట్లైతే మీరు తప్పనిసరిగా ప్రతి రోజూ షాంపు పెట్టి తలస్నానం చేయవచ్చు. వారంలో మూడు నాలుగు సార్లు కంటే ఎక్కువ షాంపు పెట్టకూడదు.

3. కండీషనర్

3. కండీషనర్

మంచి షాంపు పెట్టి తలస్నానం చేసుకొన్న తర్వాత మంచి కండీషనర్ ను ఉపయోగించడం మర్చిపోకూడదు. కండీషనర్ మీ కేశాలను మరింత చక్కగా మ్యానేజ్ చేయడానికి సహాయపడుతుంది. కండిషనర్ మీ తలమాడుకు తలగలకుండా కేశాలకు మాత్రం అప్లై చేయాలని గుర్తించుకోండి.

4. ఆమ్లా

4. ఆమ్లా

ఆమ్లా(ఉసిరికాయ)ను పురాతన కాలం నుండి ఔషదంగా ఉపయోగిస్తున్నారు. ముఖంగా జుట్టు సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అనేక జుట్టు సమస్యలను నివారించడంతో పాటు, తెల్లజుట్టును నివారిస్తుంది. ఆమ్లాను తలకు పెట్టుకోవడంతో పాటు మీ డైట్ లో ఏదో ఒక రకంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

5. ఆయిల్ మసాజ్

5. ఆయిల్ మసాజ్

తలకు ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల మీ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది మరియు కేశకణాలను ఆరోగ్యంగా ఉంచతుంది. తలకు ఆయిల్ మసాజ్ చేసే ముందు నూనెను గోరువెచ్చగా చేసుకోవాలి. ఆయిల్ మసాజ్ చేసేప్పుడు మీ సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె, జోజోబా ఆయిల్ మంచిది. చుండ్రు నివారించడానికి రోజ్మెరీ ఆయిల్ ను ఉపయోగించవచ్చు.

6. కెమికల్ లేకుండా

6. కెమికల్ లేకుండా

అనవసరపు జుట్టు విధానాలు అంటే పెర్మింగ్, స్ట్రెయిటనింగ్, మరియు కలరింగ్ వంటివి నివారించాలి . ఇటువంటి విధానాల వల్ల మీ జుట్టు డల్ గా మరియు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. అంతే కాదు, జుట్టు రాలడానికి కారణం అవుతుంది . మీజుట్టు పెళుసుగా మారుతుంది మరియు జుట్టు మూలాలను నిర్వీర్యం చేస్తుంది.

7. ఒత్తిడి(స్ట్రెస్)

7. ఒత్తిడి(స్ట్రెస్)

జుట్టు రాలడానికి ప్రధాణ కారణం ఒత్తిడి. అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడానికి మరియు తెల్లబడటానికి కారణం అవుతుంది. ఒత్తిడి లేకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్ గా యోగా లేదా వ్యాయామం వంటివి రెగ్యులర్ గా చేయాలి. ఇవి ఒత్తిడి లేకుండా చేయడం మాత్రమే కాదు. ఇది ఆక్సిజన్ మరియు రక్తప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

8. హెల్తీ డైట్

8. హెల్తీ డైట్

మీ జుట్టు యొక్క వాల్యూమ్ ను నేచురల్ గా పెంచుకోవాలంటే ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారంను తీసుకోవడం చాలా అవసరం. అందులో విటమిన్స్, మినిరల్స్ : విటమిన్ బి, సి, జింక్, ఐరన్ మరియు కాపర్ వంటివి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పని సర. ఇవి హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేసి, జుట్టు పెరగడానికి సహాయపడుతాయి. మరియు తగినన్ని నీరు త్రాగి, శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.

English summary

7 Easy Tips to Increase Hair Volume Naturally

Are you worried seeing all those additional strands of hair in your comb everyday? Well, it is natural to lose up to 100 strands of hair in a day, but, excessive hair loss is definitely something that you need to worry about.
Desktop Bottom Promotion