For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో చుండ్రు సమస్యను నివారించే బెస్ట్ హెయిర్ మాస్కులు

|

ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనది. చలికాలంలో ప్రారంభమైనదంటే మునుపటి కంటే ఈ చలికాలంలో చర్మం పొడి బారడం గమనిస్తుంటారు. కాబట్టి చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే అందుకు చర్మం ఎల్లప్పుడు మాయిశ్చరైజర్ (తేమను )కలిగి ఉండాలి. చలికాలంలో చర్మంలో ఎలా మార్పులు చేసుకుంటాయి, తలలో కూడా అదే విధంగా మార్పులు జరుగుతుంటాయి. అంటే, తలలో జుట్టు వెనకు దాగి ఉన్న చర్మం మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి, చలికాలంలో చర్మం కోసం ఎటువంటి సంరక్షణ తీసుకుంటామో, అలాంటి రక్షణ కేశాలు, తల మీద కూడా తీసుకోవడం చాలా అవసరం. దాని వల్ల జుట్టు పొడిబారకుండా, తలలో ఇన్ఫెక్షన్ జరగకుండా ఉంటుంది. చలికాలంలో తల, జుట్టు పొడిబారకుండా ఆరోగ్యంగా మరియు షైనీగా, క్లీన్ గా ఉంచుకొన్నట్లైతే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, చుండ్రు సమస్యలు కానీ ఉండవు.

ఎప్పుడైతే తల మరియు జుట్టు పొడిబారడం జరుగుతుందో అప్పుడు, చుండ్రు సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. తలలో చుండ్రు ఉన్నట్లైతే తలలో పొట్టు పొట్టుగా ఉండి భుజాలా మీద అస్యహ్యంగా రాలుతూ నలుగురిలో అవమాన పడేలా చేస్తుంది. అంతే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తలలో దురద పెడ్డుతూ నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే? చుండ్రును వదలించుకోవడానికి కొన్ని హెయిర్ మాస్కులు ఉన్నాయి.

జుట్టును ఆరోగ్యంగా మరియు మంచి పోషణను అందించడంలో హెయిర్ మాస్క్ లు గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి . ఇంకా ముఖ్యంగా ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి హెయిర్ మాస్క్ లు తప్పని సరి. చుండ్రు చీకాకుకు గురిచేయడం మాత్రమే కాదు, అసౌకర్యానికి మరియు కలత చెందేలా చేస్తుంది . మరి చుండ్రు అలా కనిపించి ఇబ్బంది పడకుండా ఉండాలంటే హెయిర్ మాస్క్ లు వేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కాదా?మార్కెట్లో లభించే బ్రాండ్ హెయిర్ మాస్క్ లు అని భయపడకండి, మన ఇంట్లోనే చాలా చౌకగా అతి సులభంగా దొరికే నేచురల్ వస్తువులతోనే చుండ్రుకు చెక్ పెడదాం...

నిమ్మరసం, తేనె, మరియు గుడ్డు: ఇది ఒక సులభమైనటువంటి హెయిర్ మాస్క్ ఇది, వివిధ రకాలుగా పనిచేస్తుంది. ఇది జుట్టు అన్ని రకాల సమస్యలను నివారిస్తుంది. తలలో చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గుడ్డును పగులగొట్టి, గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో నిమ్మకాయలోని సగం బాగం యొక్క నిమ్మరసాన్ని, ఒక చెంచా తేనెను కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చుండ్రుతో పోరాడుతుంది. గుడ్డు జుట్టుకు పోషణను అందిస్తే, తేనె జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

పెరుగు, నిమ్మరసం మరియు పెసరపిండి: రెండు చెంచాల పెరుగు తీసుకొని అందులో ఒక చెంచా పెసరపిండి మరియు సగం నిమ్మకాయ యొక్క రసం వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి తలకు మరియు మాడుకు పట్టించాలి. ఈ హెయిర్ మాస్క్ పొడిబారే వరకూ అలాగే ఉంచాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

ఓట్ మీల్, తేనె మరియు పాలు: ముందుగా ఓట్ మీల్ ను మెత్తగా పౌడర్ చేసి అందులో రెండు చెంచాలా ఓట్ మీల్ పౌడర్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె మరియు సరిపడా పాలు వేసి హెయిర్ మాస్క్ వేసుకోవడానికి పేస్ట్ టా తయారుచేయండి. ఇది మీర చిక్కగా లేదా పలుచగా ఉండకూడదు. మీడియంగా కలిపి తలకు బాగా పట్టించి, డ్రై అవ్వనాివ్వాలి . ఈ హెయిర్ మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

Hair Masks for Dandruff During Winter

అరటిపండ్లు, తేనె మరియు నూనె: బాగా పండిన అరటిపండ్లును హెయిర్ మాస్క్ లకు ఉపయోగించుకోవచ్చు. అందుకు బాగా పండిన అరటిపండ్లను ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత అందులో తేనె, నిమ్మరసం, మరియు నూనెను ఒక్కోచెంచా వేసి బాగా మిక్స్ చేయాలి. జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయడం ద్వారా జుట్టుకు తగినంత తేమను మరియు షైనింగ్ ను అందిస్తుంది.

ఈ హెయిర్ మాస్క్ లో చాలా సహజమైనటువంటివి. ఇవి చుండ్రును నివారిస్తాయి. ఇవి చాలా సాధారణంగా మన ఇల్లలోనే అందుబాటులో ఉండే పదార్థాలతోనే హెయిర్ మాస్క్ లు వేసుకొని చుండ్రును మరియు ఇతర జుట్టు సమస్యలను నివారించవచ్చు. ఇంకా మీరు కొన్ని అలోవెరా జెల్ మరియు ఆయిల్స్ ను తలకు పట్టించి తలస్నానం చేయడం ద్వారా తలకు మంచి పోషణ అందుతుంది.

English summary

Hair Masks for Dandruff During Winter

Winter is approaching and you will soon find your skin feeling drier than usual. The skin needs increased moisture to keep it healthy and glowing. The same goes for the scalp too. The scalp is nothing else but the skin on your head that is hidden under your hair.
Story first published: Thursday, November 13, 2014, 11:54 [IST]
Desktop Bottom Promotion