For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు స్ట్రాంగ్ అండ్ లాంగ్ పెరగడానికి హెల్తీ జ్యూసెస్

By Super
|

మీకు జుట్టు మోకాళ్ల క్రింది వరకూ జుట్టు పెంచుకోవని ఇష్టమా? మీరు పొడవాటి మరియు అందమైన జుట్టును కోరుకుంటున్నట్లైతే కేవలం అందుకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను అనుసరించాల్సిందే...

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసానని ఒక ఉత్తమ బ్యూటీ పదార్థంగా ఉపయోగిస్తారు . ఉల్లిరసంలో దాగుండే లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

అదే విదంగా, స్ట్రాబ్రెర్రీస్ మరియు క్యారెట్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి. హెయిర్ రూట్స్ ను బలంగా మార్చుతాయి. అలాగే ఈ ఫ్రూట్స్ జ్యూసులను త్రాగడం మాత్రమే కాదు, వీటని జుట్టుకు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాలీసెల్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది . దాంతో జుట్టు రాలే అవకాశం ఉండదు.

ఆకుకూరలు, కీర, జామ మరియు క్యారెట్ వంటి విటమిన్ సి ఆహారాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు ప్రకాశవంతమైన మరియు గ్రేట్ కలరింగ్ ను అందిస్తాయి .

ఇంకా ఈ హాట్ సమ్మర్ లో జుట్టును కాపాడుకోవడానికి ఇలాంటి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ జ్యూస్ లను అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు కూడా ఉండవు .

ఈ రకమైన జ్యూసుల్లో ఉండే సౌందర్య గుణాలు జుట్టు ఆరోగ్యాన్ని మరియు అందాన్ని కాపాడుతాయి . తప్పని సరిగా మీరుకొన్న జుట్టును కూడా పొందుతారు . మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టును పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు ఎంటో తెలుసుకుందాం..

క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్:

ఈ వెజిటేబుల్ జ్యూస్ లో బీటాకెరోటీన్,అధికంగా ఉంటుంది, ఇది తలకు తగిన పోషణను అందిస్తుంది మరియు హెయిర్ క్వాలిటిని పెంచుతుంది . ఈ జ్యూస్ ను నెలలో రెండుసార్లు ఉపయోగిస్తే లాంగ్ హెయిర్ వేగంగా పెరుగుతుంది.

 కీర జ్యూస్:

కీర జ్యూస్:

కీర జ్యూస్ చర్మాన్ని రిష్రెష్ చేస్తుంది. మరియు తలకు కూడా కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. కీర రసంను తలకు పట్టించి కనీసం 20 నిముషాలు జుట్టును నాననివ్వాలి . తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

కలబంద:

కలబంద:

కలబంద రసం ఆరోగ్యపరంగా బహువిధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అదే సమంయలో ఈ జ్యూస్ లో ఉండే ఎంజైమ్స్ కేశాలకు పోషణను అందిస్తాయి మరియు హెయిర్ ఫోలిసెల్స్ కు బలాన్ని అందిస్తాయి . దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్ట్రాబెర్రీ జ్యూస్:

స్ట్రాబెర్రీ జ్యూస్:

స్ట్రాబెర్రీ జ్యూస్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తలకు నేచురల్ స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ గా అప్లేై చేయాలి . ఈ పండ్లలో ఉండే విటిమన్స్ మరియు ప్రోటీన్స్ జుట్టు పెరుగుదలను అవసరం అయ్యే గుణాలను అందిస్తుంది.

జామ జ్యూస్:

జామ జ్యూస్:

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామ ఆకు లను మరియు జామకాయ ముక్కలను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యే వరకూ ఉడికించి, తర్వాత రూమ్ టెంపరేచర్ లో చల్లార్చాలి . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆకురసం:

ఆకురసం:

ఆకురసంలో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి . ఈ జ్యూస్ లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, తలలో దురద నివారిస్తుంది, అదే సమయంలో ఆకురసాలు జుట్టుకు మంచి షైనింగ్ ను నేచురల్ గా అందిస్తాయి.

 ఉల్లిరసం:

ఉల్లిరసం:

జుట్టు సంరక్షణలో ఉల్లిరసం ఉపయోగించడం సహజం . ఉల్లిరసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది . కాబట్టి, ఈ జ్యూస్ ను వారంలో ఒక్కసారైనా ఉపయోగించాలి . క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పకుండా మంచి ఫలిత చూస్తారు.

English summary

7 Juices That Help You Get Longer Hair

7 Juices That Help You Get Longer Hair,Do you wish to grow your hair till your knees? Well, if you want to have long and beautiful hair, the only thing you can do is to follow these simple home remedies.
Story first published: Monday, May 16, 2016, 11:26 [IST]
Desktop Bottom Promotion