For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చుండ్రును వదిలించుకోవటంలో మీకు సహాయపడే ముఖ్యమైన ఆయిల్స్

  |

  మీ చర్మంలో తైల గ్రంధులు చాల చురుకుగా ఉండటం వల్ల, వాటి ద్వారా చర్మంపై సహజంగా ఏర్పడే ఆయిల్ (లేదా) సెబుమును (క్రొవ్వు మరియు శ్లేషపటల క్షయము కలిసిన మిశ్రమము) అధికంగా ఉత్పత్తి చేసేదిగా దారి తీయవచ్చు. ఈ కారణం వల్ల మీ యొక్క చర్మము అసహ్యకరమైన మరియు ఆకర్షణీయంగా లేని వివిధ పరిస్థితులకు దారితీస్తుంది.

  ఈ రకమైన చర్మం గలవారు, వారి చర్మం యొక్క సమతుల్యతను అధికంగా నష్టపోవడానికి మరియు పగిలిపోవడానికి గురికావచ్చు. అందువల్ల, ఇలాంటి చర్మాన్ని కలిగిన వ్యక్తులు ప్రతినిత్యం చర్మ రంధ్రాల నుండి విసర్జించబడిన మలినాలను నివారించి, చర్మాన్ని రక్షించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, చర్మ రంధ్రాలను అడ్డుకునే కారకాలు మీ యొక్క వికారమైన ఆకృతికి సాధారణమైన కారణాలని చెప్పవచ్చు.

  Essential Oils That Can Help You Get Rid Of Dandruff

  ఈరోజు, మీ చర్మం నుండి అదనంగా ఉత్పత్తి అయిన ఆయిల్ను తొలగించి, మీ ముఖాన్ని శుభ్రం చేసే చిట్కాలకు సంబంధించి అనుసరించవలసిన సమర్థవంతమైన, సులభమైన మార్గాల జాబితాను - బోల్డ్ స్కై మీ ముందుకు తీసుకు వచ్చింది.

  ఈ విధమైన పద్ధతిలో మీ చర్మాన్ని శుభ్రం చేసే స్ర్కబ్స్ అనేవి బ్రౌన్ షుగర్, నిమ్మరసం, వంటి ఇతర సహజసిద్ధమైన పదార్ధాలతో - మీ చర్మానికి స్నేహపూర్వకంగా ఉండే విధంగా స్ర్కబ్స్ ని తయారు చేస్తారు. ఈ పదార్ధాలు మీ చర్మంపై అధికంగా ఉన్న క్రొవ్వును మరియు శ్లేష పదార్థాలను తొలగించి, మీ చర్మ రంధ్రాలను శుభ్రపర్చగల లక్షణాలతో పూర్తిగా నింపబడి ఉన్నాయి.

  కాబట్టి, మీరు ఇక్కడ మీ ముఖాన్ని శుభ్రం చేసేందుకు ఉపయోగించే అన్ని రకాల స్క్రబ్స్ గురించి మరింత విలువైన సమాచారాన్ని చదివి తెలుసుకోండి.

  1. టీ-ట్రీ-ఆయిల్ :

  1. టీ-ట్రీ-ఆయిల్ :

  టీ-ట్రీ-ఆయిల్లో చుండ్రుకు దారితీసే బ్యాక్టీరియాను బాగా ఎదుర్కోవటానికి అవసరమైన యాంటి-ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  మీరు తరచుగా వాడే షాంపూకు 5-6 చుక్కల టీ-ట్రీ-ఆయిల్ ను జోడించి, మీ తలచర్మమును మరియు జుట్టును శుభ్రంగా కడగాలి. మంచి ఫలితాలను పొందడానికి వారంలో ఒక్కసారి ఈ చికిత్స పద్ధతిని ప్రయత్నించండి.

  2. చమోమిలే ఆయిల్ :

  2. చమోమిలే ఆయిల్ :

  ఈ ముఖ్యమైన నూనెలో, మీ జుట్టు యొక్క సంరక్షణకు కాపాడగల యాంటీ-బ్యాక్టీరియ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆయిల్ చుండ్రుని తొలగించడమే కాకుండా, తలచర్మం పై ఉన్న ఉద్రిక్తతలను నెమ్మదించేలా చేసి, మీ జుట్టు యొక్క ఆకృతిని మరింతగా మెరుగుపరుస్తుంది.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  మీరు తరచుగా వాడే నూనెతో 5-6 చుక్కల చమోమిలే ఆయిల్ను కలిపి వాడటం వల్ల, మీ తలచర్మం పై మొత్తం మసాజ్ చెయ్యబడుతుంది. మరింత సమర్థవంతమైన ఫలితాల కోసం వారంలో ఒక్కసారి ఈ నూనెను ఉపయోగించండి.

  3. పర్చౌలి ఆయిల్ :

  3. పర్చౌలి ఆయిల్ :

  యాంటీ-ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ-బాక్టీరియ వంటి శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉన్న ఈ ముఖ్యమైన నూనె చుండ్రును నివారించగల మరొక శక్తివంతమైన చిట్కా.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో, 5-6 చుక్కల పర్చౌలి ఆయిల్ను కలపడం ద్వారా ఒక కొత్త మిశ్రమము తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ తలపై ఉన్న చర్మం మీద పోసి - బాగా మసాజ్ చేసి, అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. వారానికి ఒక్కసారి, మీరు ఈ చిట్కాను ప్రయత్నించడం వల్ల చుండ్రు సమస్యను పరిష్కరించడంలో మీకు బాగా సహకరిస్తుంది.

  4. యూకలిప్టస్ ఆయిల్ :

  4. యూకలిప్టస్ ఆయిల్ :

  ఈ నూనెలో కూడా చుండ్రుకు సహాయపడే బ్యాక్టీరియాను వదిలించుకోవటానికి అవసరమైన ఏజెంట్లను కలిగి ఉండే ఒక సహజమైన వనరని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఇది దురద నుండి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  ఈ ముఖ్యమైన నూనె యొక్క 6-7 చుక్కలను, మీ షాంపూకు జోడించి - వారంలో ఒక్కసారైనా మీ తలని శుభ్రంగా కడగడం వల్ల, చుండ్రు సమస్య నుంచి మీరు విముక్తిని పొందగలరు.

  5. రోజ్మేరీ ఆయిల్ :

  5. రోజ్మేరీ ఆయిల్ :

  రోజ్మేరీ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నందున చుండ్రును తొలగించి, మీ తలపై ఉన్న చర్మానికి స్వస్థత చేకూరేల చేస్తుంది.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  వారాంతంలో మీ హెయిర్ మాస్క్ కు కోసం ఈ నూనె యొక్క కొన్ని చుక్కలను జోడించండి. ఈ గృహ చిట్కా మీ చుండ్రు సమస్యను కొన్ని వారాల సమయంలోనే తొలగించగలదు.

  6. థైమ్ ఆయిల్ :

  6. థైమ్ ఆయిల్ :

  థైమ్ ఆయిల్ మీ చుండ్రు సమస్యకు చికిత్సను అందించటంలో అవసరమైన యాంటీసెప్టిక్ మరియు ఉపశమన లక్షణాలను కలిగి, తలపై ఉన్న చర్మాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.

  దీన్ని ఎలా ఉపయోగించాలి:

  విటమిన్ E క్యాప్సుల్ నుండి తీసిన ఆయిల్తో, ఈ నూనె యొక్క కొన్ని చుక్కలను కలపండి అలా తయారైన మిశ్రమాన్ని మీ తలచర్మంపై ప్రాంతంలో అప్లై చేయండి. ఈ అద్భుతమైన మిశ్రమమును ప్రతివారం మీరు ఉపయోగించడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది.

  7. పెప్పర్మిట్ ఆయిల్ :

  7. పెప్పర్మిట్ ఆయిల్ :

  ఈ ఆయిల్ చుండ్రు-కారక బ్యాక్టీరియాను నాశనం చేసి, మీ తలపై చర్మం మీద ఉన్న ప్రతికూల ప్రభావాన్ని అనుకూలమైనదిగా మార్చగలదు.

  ఎలా ఉపయోగించాలి:

  మీరు వాడే షాంపూతో ఈ నూనె యొక్క 6-7 చుక్కలని కలపాలి. మంచి ఫలితాల కోసం మీ చర్మం మరియు జుట్టును బాగా శుభ్రంగా కడగాలి. మరింత మెరుగైన ఫలితాల కోసం వారంలో ఒక్కసారి ఈ చిట్కాను ప్రయత్నించండి.

  English summary

  Essential Oils That Can Help You Get Rid Of Dandruff

  Dandruff can cause a great deal of discomfort and even lead to skin-related problems like acne and blemishes.There are various natural remedies that can be used for this troubling hair condition, however, essential oils are considered to be particularly effective. As essential oils are loaded with anti-bacterial proper
  Story first published: Friday, February 9, 2018, 7:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more