For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో హెయిర్ డేమేజ్ ను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?

వర్షాకాలంలో హెయిర్ డేమేజ్ ను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?

|

వర్షాకాలంలో వాననీటి వలన ఆకులపై పేరుకుపోయిన దుమ్మూ ధూళి తొలగిపోతాయి. అప్పుడు, ఆకులు ఆకుపచ్చగా అలాగే తాజాగా మారతాయి. అయితే, ఇదే విషయం మన శిరోజాలకు వర్తిస్తుందా? మీరు ఊహించింది సరైనదే? ఇదే అంశం శిరోజాలకు ఏమాత్రమూ వర్తించదు.

వర్షాకాలంలో తేమ శాతం పెరుగుతుంది. అందువలన, హెయిర్ డేమేజ్ ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంది. వర్షాకాలంలో పడే మొట్టమొదటి వానలో ఎన్నో మలినాలు ఉంటాయి. ఏసిడ్ రెయిన్ కు కూడా అవకాశాలు కలవు. వర్షపు నీటిలో ఉండే హానికర కెమికల్స్ వలన వెంట్రుకలు దెబ్బతిని పొడిగా, రఫ్ గా, డల్ గా అలాగే స్టికీగా మారే ప్రమాదం ఉంది. శిరోజాలలో ఉండే తేమను ఇవి తొలగిస్తాయి. అందువలన, కురులు డ్రైగా, ఫ్రిజ్జీగా అలాగే అన్ మేనేజబుల్ గా మారతాయి. నిజమేనా? అలాగే, ఎవరికీ హెయిర్ ఫాల్ తో పాటు హెయిర్ డేమేజ్ అంటే నచ్చదు.

How To Take Care Of Your Hair This Monsoon

కాబట్టి, ఒకవేళ మీకు వర్షంలో డాన్స్ చేయడం ఇష్టమైతే, మీరు కొన్ని హెయిర్ కేర్ రొటీన్ ను పాటించాలి. ఇక్కడ వివరించబడిన చిట్కాలను అలాగే ట్రిక్స్ ను పాటిస్తే మీ శిరోజాలు వర్షాకాలంలో కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందామా:

1. హెయిర్ ను డ్రై గా ఉంచండి:

1. హెయిర్ ను డ్రై గా ఉంచండి:

మొదటిసారి వాన కురిసినప్పుడు, వర్షంపై మక్కువతో వానలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే, మొదటి సారి కురిసే వాన నీరు మంచిది కాదు. ఈ విషయాన్ని ఇంతకు ముందే ప్రస్తావించుకున్నాము. వాననీరు స్వచ్ఛమైనది మనం అనుకోవచ్చు. అయినా, వాననీటిలో ఏమేమికలుషిత పదార్థాలు అలాగే మలినాలు కలిసాయో మనము గుర్తించలేము. కొన్ని సార్లు వాననీటిలో ఏసిడ్ కంటెంట్ ఎక్కువ మోతాదులో లభ్యమవుతుంది. అప్పుడు దానిని యాసిడ్ రైన్ అనంటారు. ఈ నీరు హెయిర్ కు తగిలితే హెయిర్ లోని మాయిశ్చర్ తొలగిపోతుంది. హెయిర్ అనేది డల్ గా అలాగే డ్రైగా మారుతుంది. అలాగే, ఒకవేళ జుట్టు వాననీటి వలన తడిగా మారిపోయి మీరు తడిని తుడుచుకోకపోతే బాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. అందువలన, హెయిర్ ను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

2. వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోండి:

2. వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోండి:

వానలో తడిసిన తరువాత షాంపూ చేసుకోకపోతే కుదుళ్ళలోకి తేమ చేరి మీ హెయిర్ ను బలహీనపరుస్తుంది. కాబట్టి, మైల్డ్ డీప్ క్లీన్సింగ్ షాంపూతో మీ హెయిర్ కు షాంపూ చేసుకోండి. ఆ విధంగా బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. షాంపూ అనేది హెయిర్ కు పోషణనందిస్తుంది తద్వారా కుదుళ్ళ నుంచి హెయిర్ అనేది దృఢంగా మారుతుంది. కాబట్టి, వారానికి రెండు సార్లు షాంపూ చేసుకోండి.

3. మీ హెయిర్ ను నూనెతో మసాజ్ చేయండి:

3. మీ హెయిర్ ను నూనెతో మసాజ్ చేయండి:

వర్షాకాలంలో వాన వలన హెయిర్ లోని మాయిశ్చర్ అనేది పూర్తిగా తొలగిపోయి హెయిర్ ఫ్రిజ్జీగా అలాగే డ్రైగా మారిపోతుంది. ఆయిలింగ్ చేయడం అలాగే మసాజ్ చేయడం వలన హెయిర్ కు పోషణ అందుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వంటివి స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. తద్వారా, హెయిర్ గ్రోత్ ను మెరుగుపరచి స్కాల్ప్ లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిస్తాయి. కుదుళ్లను దృఢపరుస్తుంది. బ్రేకేజ్ లను అరికట్టి శిరోజాలను ఒత్తుగా చేస్తుంది. అయితే, ఆయిల్ ను ఎక్కువగా అప్లై చేయకూడదు. ఎక్కువగా ఆయిల్ ను అప్లై చేయడం వలన మీరు షాంపూను ఎక్కువగా వాడాల్సిన అవసరం వస్తుంది. దీనివలన హెయిర్ డేమేజ్ మరింత పెరుగుతుంది.

4. హెయిర్ ను ముడి కట్టకండి:

4. హెయిర్ ను ముడి కట్టకండి:

చాలా మంది హెయిర్ ను ముడి వేస్తారు. ఈ పద్దతి వలన వర్షాకాలంలో హెయిర్ డేమేజ్ బారిన పడే ప్రమాదం ఉంది. వర్షపు నీరు శిరోజాలలోకి చేరి హెయిర్ ను ఫ్రిజ్జీ గా అలాగే కాంతిహీనంగా మారుస్తుంది. అంతేకాదు, వెంట్రుకలను బలహీనపరుస్తుంది. తద్వారా హెయిర్ ఫాల్ ప్రారంభం అవుతుంది. కాబట్టి పోనీ టెయిల్ లా లేదా లూజ్ బన్ లా హెయిర్ ను కట్టుకోండి.

5. హుడీ కలిగిన వాటర్ ప్రూఫ్ జాకెట్ ను ధరించండి:

5. హుడీ కలిగిన వాటర్ ప్రూఫ్ జాకెట్ ను ధరించండి:

కొన్ని సార్లు భారీ వర్షాల వలన అంబ్రెల్లా ఒక్కటే వర్షం నుంచి రక్షణను అందివ్వదు. కాబట్టి, హుడీ కలిగిన ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ ను తీసుకోండి. ఆ విధంగా హెయిర్ ను వర్షపు నీటి నుంచి రక్షించుకోగలుగుతారు. హెయిర్ డేమేజ్ ను అరికట్టగలుగుతారు.

6. విశాలమైన పళ్ళు కలిగిన దువ్వెనను వాడండి:

6. విశాలమైన పళ్ళు కలిగిన దువ్వెనను వాడండి:

హెయిర్ కోసం విశాలమైన పళ్ళు కలిగిన దువ్వెనను వాడండి. ఇది హెయిర్ ను డీట్యాన్గిల్ చేయడంతో పాటు హెయిర్ బ్రేకేజ్ ను అరికడుతుంది. అలాగే స్కాల్ప్ పై బ్లడ్ ఫ్లో ను పెంపొందిస్తుంది. తద్వారా, మొదళ్లకు పోషణను అందిస్తుంది. ఆ విధంగా హెయిర్ అనేది షైనీగా అలాగే ఆరోగ్యకరంగా మారుతుంది.

7. సరిగ్గా కండిషన్ చేయండి :

7. సరిగ్గా కండిషన్ చేయండి :

వర్షాకాలంలో వాన వలన హెయిర్ అనేది డ్రైగా అలాగే ఫ్రిజ్జీగా మారుతుంది. కాబట్టి, షాంపూ తరువాత సరిగ్గా హెయిర్ ను కండిషన్ చేసుకోవడం తప్పనిసరి. అయితే, కండిషనర్ ను ఎక్కువగా వాడకండి. కండిషనర్ ను జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. ఆ తరువాత విశాలమైన పళ్ళు కలిగిన దువ్వెనతో కండిషనర్ ను హెయిర్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా దువ్వండి.

8. హోంమేడ్ హెయిర్ ప్రోడక్ట్స్ ని వాడండి:

8. హోంమేడ్ హెయిర్ ప్రోడక్ట్స్ ని వాడండి:

ఇంటివద్దే షాంపూస్ ని అలాగే కండిషనర్లు ని వాడటాన్ని ప్రిఫర్ చేయండి. తద్వారా, హెయిర్ కు తగినంత పోషణని అందించవచ్చు. హోంమేడ్ ప్రోడక్ట్స్ ని వాడటం వలన హానికర కెమికల్స్ బారిన హెయిర్ పడదు. తద్వారా, హెయిర్ డేమేజ్ ను అరికట్టవచ్చు.

9. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి:

9. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి:

జంక్ ఫుడ్ ని తీసుకునే అలవాటును మానుకోండి. ఎందుకంటే, జంక్ ఫుడ్ వలన హెయిర్ కు తగినంత పోషణ లభించదు. కెఫైన్ ను తగ్గించండి. ఎందుకంటే, కెఫైన్ మీ హెయిర్ ను డీహైడ్రేట్ చేస్తుంది. తద్వారా, హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. ఆకుపచ్చని ఆకుకూరలను, తాజా పండ్లను, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోండి. ఇవన్నీ హెయిర్ డేమేజ్ ను అరికట్టడానికి తోడ్పడతాయి. రోజుకు 8 నుంచి 9 గ్లాసుల నీళ్లు తాగండి. ఇలా చేస్తే వర్షాకాలంలోనే కాదు ప్రతీ సీజన్ లో కూడా హెయిర్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది.

English summary

How To Take Care Of Your Hair This Monsoon

Humidity level increases during monsoon, causing a lot of hair damage. The harmful chemicals present in rainwater cause damage to hair cuticles making it dry, rough, dull, and sticky. Keeping your hair dry, leaving it open, massaging it with oil, and conditioning it properly are some hacks you can try to prevent hair damage.
Story first published:Tuesday, May 22, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion