For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు రకాన్ని బట్టి ఎన్ని సార్లు మీరు తలస్నానం చేస్తారు

|

తలస్నానం అనేది, మీ జుట్టుకు తప్పనిసరిగా ఆచరించవలసిన కఠినమైన నిబంధనగా ఉంటుంది. ఇది ఎంత సాధారణమైన విషయం అయినప్పటికీ, ఎంత తరచుగా చేయాలి అనేది అనేకమంది మదిలో నాటుకుపోయి ఉన్న ప్రశ్నగా ఉందన్నది వాస్తవం. అవునా ?

మనందరికీ మన జుట్టు మీద ప్రేమ కొంచం ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం, జుట్టు మనశైలికి భిన్నమైన లుక్ జోడించడానికి ఏంతో సహాయకారిగా ఉంటుంది కాబట్టి. అందువల్ల మన జుట్టుపట్ల కొంత శ్రద్ద, జాగ్రత్త తప్పనిసరిగా అవసరం ఉంటుంది. మరియు మీ జుట్టుకు అదేపనిగా తలస్నానాలు చేయడం కూడా సబబుకాదు. ఇటువంటి చిన్న పొరపాట్లు, జుట్టు నష్టానికి దారితీస్తుంది. అంతేకాకుండా, ప్రతిరోజు మీ జుట్టుకు తలస్నానం చేయడం మూలంగా, మీ జుట్టు పొడిగా మారుతుంది. క్రమంగా జుట్టు రాలడం, కుట్టు చివర్లు చిట్లడం వంటి అనేక జుట్టు సమస్యలకు దారితీస్తుంది.

మీ జుట్టు రకాన్ని బట్టి ఎన్ని సార్లు మీరు తలస్నానం చేస్తారు

మీరు ఎంత తరచుగా జుట్టుకు తలస్నానం చేయవలసి ఉంటుంది :

మన జుట్టు రకాలు, భిన్నంగా ఉంటాయని, క్రమంగా వాటితో వ్యవహరించే విధానం కూడా భిన్నంగా ఉండాలని మనం అర్ధం చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. మనం పొడి జుట్టుతో వ్యవహరించే తీరు కన్నా, ఆయిలీ జుట్టుతో వ్యవహరించడం కొంచం కష్టంగా ఉంటుంది. చేయలేం. క్రమంగా తల స్నానాలలో కూడా కొన్ని విధానాలను అవలంభించవలసి ఉంటుంది.

అయోమయంగా ఉందా ? ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు, ఈ వ్యాసంలో, మీరు ఎంత తరచుగా మీ జుట్టుకు తలస్నానం ఆచరించాలి, అన్న విషయం గురించి మేం క్లుప్తంగా విశదీకరించి చెప్పాం. వాస్తవానికి ఎన్ని సార్లు తలస్నానం ఆచరించాలో మీ జుట్టు రకాన్ని బట్టి ఉంటుంది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

 1. ఆయిలీ హెయిర్ - ప్రతి ప్రత్యామ్నాయ రోజులో ఒకసారి

1. ఆయిలీ హెయిర్ - ప్రతి ప్రత్యామ్నాయ రోజులో ఒకసారి

ఆయిలీ హెయిర్ ఉంటే, ఆ జుట్టును నిర్వహించడం ఎంత కష్టమో మీకు తెలియనిది కాదు. మీ స్కాల్ప్ (జుట్టు చర్మం), అదనపు నూనెలను ఉత్పత్తి చేసిన కారణంగా, మీ జుట్టు ఆయిలీగా మరియు జిడ్డుగా మారుతుంటుంది. క్రమంగా ప్రతి రోజు మీ జుట్టుకు తలస్నానాన్ని అనుసరించాలని అనుకుంటారు. కానీ, ఇది చాలా తప్పుడు నిర్ణయంగా చెప్పబడుతుంది. ప్రతిరోజూ మీ జుట్టుకు తలస్నానం చేయడం మూలంగా, మీ తలపై సహజసిద్దమైన నూనెల ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా వెంట్రుకలకు సరైన పోషకాలు, ప్రోటీన్ అందక మీ జుట్టు నష్టానికి దారితీస్తుంది. కావున, వీలైనంతవరకు ప్రతిరోజూ తలస్నానం చేయడాన్ని పరిగారించాలి.

కావున, మీ ఆయిలీ జుట్టు కోసం మీరు చేయగల ఉత్తమ పనిఏమిటంటే, తలస్నానానికి ప్రతి ప్రత్యామ్నాయ రోజును కేటాయించడం. ఇది మీ జుట్టు చర్మాన్ని ఆరోగ్యకర స్థితిలో ఉంచేందుకు ఎంతగానో దోహదపడుతుంది. దీనితో పాటుగా మీ జుట్టుకు, తలస్నానం చేసిన తర్వాత అప్పుడప్పుడు కొంత సిరం, మరియు నూనెలను అప్లై చేయడం కూడా అలవాటు చేసుకోండి. క్రమంగా మీ జుట్టుకు సరైన పోషణను నిర్వహించగలుగుతారు.

 2. పొడిబారిన జుట్టు - వారానికి రెండు సార్లు తలస్నానమాచరించడం ఉత్తమం

2. పొడిబారిన జుట్టు - వారానికి రెండు సార్లు తలస్నానమాచరించడం ఉత్తమం

డ్రై హెయిర్ అంటే, మీ జుట్టుకు అవసరమైన తేమ లోపించిదని అర్థం. షాంపుతో మీ జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవడం మూలంగా, దాని సహజ నూనెలలో గణనీయమైన మార్పులు ఏర్పడి, మరింత జుట్టు నష్టానికి దారితీస్తుంది. అంతేకాకుండా జుట్టు విరగడానికి కూడా కారణమవుతుంది. కావున మీ జుట్టుకు, కనీసం వారంలో రెండు మార్లు, 2 నుండి 3 రోజుల విరామంతో తలస్నానాన్ని ఆచరించవచ్చునని సూచించబడుతుంది.

పొడి జుట్టుతో వ్యవహరించేటప్పుడు ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే, మీరు తలస్నానానికి ఉపక్రమించే ముందు, కనీసం ఒక గంట లేదా ఒక రాత్రి ముందు మీ జుట్టుకు నూనెను పెట్టాలని గుర్తుంచుకోండి. మీరు డ్రై హెయిర్ కలిగి ఉండి, కండీషనర్ను ఖచ్చితంగా వినియోగించేవారిగా ఉంటే, తేలికపాటి షాంపూను ఎంపిక చేసుకోవాలని గుర్తుంచుకోండి.

3. సాధారణ జుట్టు - ప్రతి మూడు రోజులకు ఒకసారి

3. సాధారణ జుట్టు - ప్రతి మూడు రోజులకు ఒకసారి

మీకు సాధారణ జుట్టు గనక ఉంటే, మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీరు సాధారణమైన ఆరోగ్యకర జుట్టును కలిగి ఉన్నారు అంటే, మీ జుట్టు మందంగా ఉండి మంచి పోషకాలతో కూడుకుని ఉందని అర్ధం. సాధారణ జుట్టు, ఎక్కువ ఆయిలీ లేదా ఎక్కువ పొడిగా ఉండదు.

ఇతర జుట్టు రకాలతో పోల్చినప్పుడు, ఈ సాధారణజుట్టుతో వ్యవహరించడం, కొంచెం సులభంగా ఉంటుంది. మరియు మీరు ప్రతి మూడు రోజులకు ఒకసారి మీ జుట్టుకు తలస్నానాన్ని ఆచరించవచ్చు. ఎంత అదృష్టమో కదా.

మీ జుట్టు ఆయిలీగా లేదా అధికంగా పొడిబారకుండా ఉన్న కారణాన, మీరు తలస్నానాల మద్యలో మూడురోజుల సమయం ఇచ్చినా ఎటువంటి నష్టమూ వాటిల్లదు. ప్రత్యామ్నాయంగా, మీరు ప్రతి ప్రత్యామ్నాయ రోజులను కూడా తలస్నానానికి ఎన్నుకోవచ్చు. మీ జుట్టు ఎంత శుభ్రంగా, లేదా ఎంత మురికిగా ఉంటుందనే విషయం మీద మీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

 4. మందపాటి జుట్టు - వారానికొకసారి

4. మందపాటి జుట్టు - వారానికొకసారి

మీరు మందపాటి జుట్టును కలిగి ఉంటే, వారానికి ఒకసారి మీ జుట్టుకు తలస్నానం చేయడం ఉత్తమంగా సూచించ బడుతుంది. మందపాటి జుట్టు మీ తలపై నూనెలు అధిక స్థాయిలో పెరుగకుండా నిరోధించగలుగుతుంది. అదేవిధంగా, మందపాటి జుట్టు, అన్ని వెంట్రుకలకు నూనెలను విస్తరించడానికి సమయం తీసుకుంటుంది. మరియు ఇది సన్నని లేదా ఆయిలీ జుట్టుతో పోలిస్తే మరింత సమానంగా నూనెలను వెంట్రుకలకు పంపిణీ చేయగలదు. అందువలన, మీ జుట్టు అంత సులభంగా జిడ్డుగా కనపడదని గుర్తుంచుకోండి.

కావున, మీ జుట్టుకు వారంలో కేవలం ఒకసారి తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకు క్లీనింగ్ అవసరమని మీరు భావించిన ఎడల, వారానికి రెండు సార్లు మీ జుట్టును వాష్ చేసుకోవచ్చు.

 5. దట్టమైన జుట్టు - ప్రత్యామ్నాయ రోజులను అనుసరించవచ్చు

5. దట్టమైన జుట్టు - ప్రత్యామ్నాయ రోజులను అనుసరించవచ్చు

దట్టంగా జుట్టు ఉన్న వ్యక్తులు మిగిలిన ఇతర రకాల జుట్టు కలిగిన వారికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. దట్టమైన జుట్టును కలిగి ఉన్నవారు, మరింత తరచుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇతర జుట్టు రకాలతో పోల్చినప్పుడు దట్టమైన జుట్టు కలిగిన వారిలో, ఆయిల్ మరియు జిడ్డు మూలాలు ఎక్కువగా కనపడుతాయి. అందువలన, ప్రతిరోజూ తలస్నానం చేయాలన్న ఆలోచన చేస్తుంటారు. కానీ, మీరు అలా ప్రతిరోజూ తలస్నానం చేయడం ఎన్నటికీ సూచించదగినది కాదు. ఈ అలవాటు మీ జుట్టు చివరలను నాశనం చేస్తుంది. క్రమంగా జుట్టు నష్టానికి దారితీస్తుంది. కాబట్టి, ప్రత్యామ్నాయ రోజును మీ జుట్టుకు తలస్నానం చేయడానికి కేటాయించండి. అంతేకాకుండా, తలస్నానానికి తేలికపాటి షాంపూలను లేదా, సహజ సిద్దమైన మార్గాలను మాత్రమే అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి. మీ జుట్టును సున్నితంగా నిర్వహించాలని గుర్తుంచుకోండి.

 6. ఉంగరాల జుట్టు - ప్రతి మూడు రోజులకు ఒకసారి

6. ఉంగరాల జుట్టు - ప్రతి మూడు రోజులకు ఒకసారి

ఉంగరాల జుట్టు, చూసేందుకు అందంగా కనిపిస్తుంది. మరియు అదొక స్టైలిస్ట్ ఐకాన్ వలె ఉంటుంది. అయితే, ఉంగరాల జుట్టు చూసేందుకు ఎంత అద్భుతంగా ఉన్నా కూడా, దానిని నిర్వహించడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. వంకర్లు తిరిగి ఉన్న, జుట్టు కుదుళ్ళ వద్ద జిడ్డుగా మరియు చివర్ల వద్ద పొడిగా ఉంటుంది. దీనికి కారణం, ఈ నూనె కుదుళ్ళ నుండి చివర్లకు చేరటానికి, ఎక్కువ సమయం పడుతుంది. క్రమంగా పూర్తిస్థాయిలో నూనెలు విస్తరించడం అన్నది అసాధ్యం. క్రమంగా అనేక జుట్టు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి.

కావున, ఒకవేళ మీరు ఇటువంటి ఉంగరాల జుట్టును కలిగి ఉన్నట్లయితే, ప్రతి మూడు రోజులకు ఒకసారి మీ జుట్టుకు తలస్నానాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.

 7. వదులుగా ఉన్న జుట్టు - ప్రత్యామ్నాయ రోజులను అనుసరించాలి

7. వదులుగా ఉన్న జుట్టు - ప్రత్యామ్నాయ రోజులను అనుసరించాలి

ఉంగరాల జుట్టుతో పోలిస్తే వదులుగా లేదా, వంకీలు ఉన్న జుట్టును అత్యంత తేలికగా వ్యవహరించవచ్చు. తేమ తక్కువగా ఉన్న సమయంలో, జుట్టు పొడిబారినట్లు మారుతుంది. కావున, ఈ సమస్యను ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గంగా, ప్రత్యామ్నాయ రోజులలో తలస్నానం అనుసరించడం ఉంటుంది.

కానీ, మీరు మీ జుట్టుకు తలస్నానం చేయడానికి, తేలికపాటి షాంపూలను లేదా సహజసిద్ద మార్గాలనే ఎన్నుకోవాలని, గుర్తుంచుకోండి. అంతేకాకుండా తరచుగా కండిషనర్ వినియోగించాలని గుర్తుంచుకోండి.

8. డ్యామేజ్ అయిన జుట్టు - ప్రతి మూడు రోజులకు

8. డ్యామేజ్ అయిన జుట్టు - ప్రతి మూడు రోజులకు

ఇక చివరగా డామేజ్ హెయిర్ విషయానికి వస్తే, ప్రతి మూడు రోజులకు ఒకసారి జుట్టుకు తలస్నానాన్ని అనుసరించాలని చెప్పబడుతుంది. డ్యామేజ్ అయిన జుట్టు వెనుక టన్ను కారణాలు ఉండవచ్చు. క్రమంగా మీ జుట్టు మరింత నష్టానికి గురికాకుండా చూసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. క్రమంగా, డ్యామేజ్ అయిన జుట్టుకు తరచుగా తలస్నానాన్ని అనుసరించడం మూలంగా, మీజుట్టును మరింత డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, పొడిబారిన మరియు పెళుసైన జుట్టుకు దారితీస్తుంది. ఒక్కోసారి, జుట్టు విరగడానికి కూడా కారణంగా మారుతుంది. మీరు మీ జుట్టును శుభ్రపరుచుకోవాలి, అదేక్రమంలో భాగంగా దాని సహజ నూనెలను కూడా నిర్వహించుకోవాలి. అందువల్ల, ప్రతి మూడు రోజులకు ఒకసారి మీ జుట్టుకు తలస్నానాన్ని అనుసరించడం మూలంగా, మీరు మీ జుట్టును ఆరోగ్యకర రీతిలో నిర్వహించుకోవచ్చునని సూచించబడుతుంది.

అయితే మీరు ఉపయోగించే షాంపూ మరియు కండిషనర్ విషయంలో కూడా శ్రద్ద వహించాలని గుర్తుంచుకోండి. డ్యామేజ్ అయిన జుట్టుపరంగా ఓర్పు, జాగ్రత్త తప్పనిసరి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How Frequently Should You Wash Your Hair Based On Your Hair Type , మీ జుట్ట రకాన్ని బట్టి మీరు ఎన్ని సార్లు తలస్నానం చేస్తారు

Hair wash is something where the rule 'less is more' works best. While washing our hair is a regular phenomenon, how often it should be done still is a matter of concern. We understand that all of our hair is different and hence it needs to be dealt with differently. Discussed in this article is how often should you wash your hair based on your hair type
Story first published:Thursday, May 30, 2019, 11:10 [IST]
Desktop Bottom Promotion