For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం నివారించడానికి ఉత్తమ యోగాసనాలు..

జుట్టు రాలడం నివారించడానికి 5 ఉత్తమ యోగాసనాలు..

|

జుట్టు దువ్వుకున్నప్పుడు ఊడివచ్చే జుట్టు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తోందా? జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించటానికి ఈ యోగాసనాలు ప్రయత్నించి చూడండి. అయితే ఒక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. యోగాసనాలు అనారోగ్యం రాకుండా కాపాడతాయి. అనారోగ్యం కలిగాక దాన్ని తగ్గించే కంటే, అనారోగ్యం రాకముందే యోగాసనాలు సాధనచేస్తున్నపుడు కనిపించే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది. మన ప్రాచీన వారసత్వ సంపద అయిన యోగాభ్యాసం మన కేశ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో ఇపుడు చూద్దాం.

మన సాధారణ ఆరోగ్యానికీ కేశాల ఆరోగ్యానికీ సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే మీ శరీర ఆరోగ్యం ఎలా ఉందో మీ జుట్టును చూస్తే తెలుస్తుంది. మీ అందమైన జుట్టు మీకు నిజంగా శిరోభూషణమే.

Best Yoga Asanas To Prevent Hair Fall

ఒత్తిడి, హార్మోన్ల అసమతౌల్యం, ఆహారవిధానంలో లోపాలు, జబ్బులు, మత్తుమందులు, జుట్టుకు రసాయనాల వాడకాలు, జన్యుపరమైన కారణాలు, ధూమపానం వంటి అలవాట్లు మొదలైనవి జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణాలు.

కేశ సంరక్షణకోసం మీరు చేసే యోగాసనాలు, ధ్యానం జుట్టు రాలిపోవటాన్ని అరికట్టటమే కాక, మీ సంపూర్ణ ఆరోగ్యానికి లాభం చేకూర్చుతాయి. మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమేగాక, మానసిక ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తాయి. మెదటికి రక్తప్రసరణను పెంపొందించటం, జీర్ణక్రియను మెరుగుపరచటం, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించటం యోగా వలన కలిగే అదనపు లాభాలు.

జుట్టు ఊడిపోవటాన్ని నివారించే యోగసనాలు:

జుట్టు ఊడిపోవటాన్ని నివారించే యోగసనాలు:

శరీరాన్ని ముందుకు వంచి చేసే యోగాసనాలు తల భాగానికి రక్తప్రసరణను పెంచుతాయి. దీనివలన జుట్టు కుదుళ్ళు క్రమంగా ఆరోగ్యంగా తయారవ్వటం గమనించవచ్చు. ఈ క్రింది ఆసనాలు తప్పక చేయాల్సనవి:

అదోముఖ శ్వానాసనం:

అదోముఖ శ్వానాసనం:

తలకు, రక్తప్రసరణను బాగా పెంచే ఈ ఆసనం సైనస్ వ్యాధికి, జలుబుకు కూడా మంచిది. మానసిక అలసట, వ్యాకులత, నిద్రలేమి తగ్గించటంలో సహాయపడుతుంది.

 ఉత్థానాసనం:

ఉత్థానాసనం:

అలసటను తగ్గించటంలో సహాయపడుతుంది. స్త్రీలకు మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణక్రియకూ సహకరిస్తుంది.

వజ్రాసనం:

వజ్రాసనం:

మిగిలిన ఆసనాలకు భిన్నంగా ఈ వజ్రాసనాన్ని భోజనం చేసిన వెంటనే సైతం వేయవచ్చు. మూత్రాశయంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడంతోబాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి కడుపులో గ్యాస్ ను తగ్గిస్తుంది.

 అపానాసనం:

అపానాసనం:

జీర్ణవ్యవస్థలో ఉండే ప్రాణశక్తికి అపానం అని పేరు. అపానాసనం మన శరీరంలోని విషాలను తొలగించటంలో సహాయపడుతుంది. బుద్ధికి స్పష్టత చేకూరుస్తుంది. మలబద్ధకంనుంజి ఉపశమనాన్నిస్తుంది.

 పవనముక్తాసనం:

పవనముక్తాసనం:

కడుపులో వాయువును (గ్యాస్ ను) తగ్గిస్తుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వెన్నెముక క్రిందిభాగంలోని కండరాలు శక్తివంతమౌతాయి. ఉదరభాగంలో, పిరుదులలోని కొవ్వును తగ్గిస్తుంది.

సర్వాంగాసనం:

సర్వాంగాసనం:

థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు, అన్నవాహిక, జననేంద్రియాలు, నాడీవ్యవస్థలు ఆరోగ్యంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ద్వారా మెదడులోని కణాలకు మరింత ప్రాణవాయువు అందుతుంది. ఆ విధంగా ఇది నాడీవ్యవస్థకు చాలా మంచిది. శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించి, స్థూలకాయం, మధుమేహాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

భస్త్రిక ప్రాణాయామం

భస్త్రిక ప్రాణాయామం

శరీరంలో అధికంగా ఉన్న వాత, పిత్త, శ్లేష్మాలను తొలగించటం ద్వారా నాడీవ్యవస్థను శుద్ధి చేస్తుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

 నాడీశోధన ప్రాణాయామం

నాడీశోధన ప్రాణాయామం

గుండె సంబంధిత వ్యాధులను, ఆస్తమా, కీళ్ళనొప్పులు, కుంగుబాటు, మైగ్రెయిన్, మానసిక ఒత్తిడి, కంటి, చెవులకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో సహాయపడుతుంది.

 గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

యోగా చేయటంతోబాటు మీ ఆహారంపట్ల కూడా శ్రద్ధవహించటం చాలా ముఖ్యం. తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పాలఉత్పత్తులు వీటన్నిటితో కూడిన సంతులన ఆహారం మీ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

వేప నీటితో వారానికి 2 లేదా 3 సార్లు తలంటుకోవటం, కొబ్బరినూనె తలకు మర్దనా చేయటం, రోజూ శుభ్రంగా తలదువ్వుకోవటం జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. కఠినంగా ఉండే రసాయనాలు, సౌందర్యసాధనాల పేరుతో వచ్చే అధికభాగం రసాయనిక ఉత్పత్తులను వాడకపోవటం మేలు.

గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

గుర్తుంచుకోవలసిన మరికొన్ని విషయాలు:

మరొక్క విషయం గుర్తుంచుకోండి. జుట్టు ఊడిపోవటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దీనిని తిరిగి పెంచటం సాధ్యంకాకపోయినా, జుట్టు ఊడిపోవటాన్ని నివారించటం, లేదా ఆలస్యంగా జరిగేలా చూడటం మాత్రమే పైనచెప్పిన చిట్కాలవలన సాధ్యపడుతుంది.ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. ఎదుటివారి రోమాలు నిక్కబొడుచుకునేలా మీ జుట్టు కథలను వర్ణించటం మానేసి, ప్రశాంతంగా, ఆనందంగా జీవించండి.

English summary

Best Yoga Asanas To Prevent Hair Fall

Best Yoga Asanas To Prevent Hair Fall. Read to know more..
Desktop Bottom Promotion