For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలను ఆకర్షించడానికి పురుషులకు సహాయపడే 5 అలంకరణ చిట్కాలు

By Gandiva Prasad Naraparaju
|

సౌందర్య పరిశ్రమ గమనాలు చాలా ఆలస్యంగా మారాయి. చాలామంది పురుషులు తాము కనిపించే తీరుపై శ్రద్ధ చూపిస్తున్నారు. కేవలం పురుషుల కోసం తయారుచేసిన సౌందర్య ఉత్పత్తుల పెద్ద నడవ ఉంది.

అన్ని సమయాలలో మంచిగా, మర్యాదగా కనబడడం చాలా మంచిది, ఈ విషయాన్నీ పురుషులు గుర్తించడం కూడా గమనించారు.

పురుషుల చర్మ సంరక్షణ అనేది కేవలం సబ్బు లేదా షేవింగ్ బార్ తో మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు. ఇది మరింత పరిణామం చెందింది.

10 గ్రూమింగ్ టిప్స్- ఇవి మిమ్మల్ని తప్పక మరింత ఆకర్షణీయం గా కనపడేటట్లు చేస్తాయి10 గ్రూమింగ్ టిప్స్- ఇవి మిమ్మల్ని తప్పక మరింత ఆకర్షణీయం గా కనపడేటట్లు చేస్తాయి

చక్కని ఆహార్యం కలిగిన పురుషుడు వ్యతిరేక లింగ దృష్టిని పొందుతాడు. ఎంతో మర్యాదగా ఉంటూ, ప్రతిరోజూ ఎక్కువ సమయం అద్దం ముందు అదనపు సమయాన్ని వృధాచేయని వ్యక్తిని స్త్రీలు మెచ్చుకుంటారు.

కాబట్టి పురుషులు, స్త్రీల నుండి అదనపు మార్కులు పొందాలి అనుకుంటే అందంగా కనిపించే మరిన్ని చిట్కాలను చదివి తెలుసుకోండి...

grooming tips that men should follow

1) శరీరంపై ఉన్న అధిక జుట్టును మెయింటైన్ చేయండి:
ఒక స్త్రీలాగా, పురుషులు కూడా శరీరంపై ఉన్న జుట్టును మేనేజ్ చేయాలను అనుకుంటాడు. అంటే, చేతులు లేదా కాళ్ళను పూర్తిగా వాక్స్ చేయాలనీ అర్ధం కాదు. కానీ చెవులు, ముక్కుల్లో వచ్చే జుట్టును కత్తిరించడం.

ప్రతిరోజూ జుట్టును తొలగిస్తే శుభ్రంగా, అందంగా కనిపిస్తారు. అంతేకాకుండా, ఛాతీ మీద ఉన్న జుట్టు పర్లేదు కానీ వీపు, మెడ మీద ఉన్న జుట్టు ఖచ్చితంగా బాగుండదు.

grooming tips that men should follow

2) మంచి ఫేషియల్ ఉత్పత్తులను వాడడం:
మంచి క్లెన్సర్, మాయిశ్చరైజర్ కొనుగోలు చేయడం పురుషులకు చాలా ముఖ్యం. పురుషులలో కూడా యాక్నే లేదా పొడి చర్మం సమస్యలు ఉంటాయి. చర్మంపై ఉన్న అదనపు జిడ్డును, మురికిని తొలగించడానికి మంచి క్లెన్సర్ ని ఉపయోగించండి.

తేమ చర్మాన్ని సమతౌల్య౦ చేసి, సహజ ఆయిల్ ను పునరుద్ధ రించడంలో సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం మందంగా, గట్టిగా ఉంటుంది, కాబట్టి, డియర్ అబ్బాయిలు, మీకోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను మాత్రమే ఖచ్చితంగా వాడండి.

మగవాళ్లు ఫ్రెష్ లుక్ కోసం కంపల్సరీ అప్లై చేయాల్సిన ఫేస్ ప్యాక్..!

grooming tips that men should follow

3) ప్రతిరోజూ గోళ్ళను కత్తిరించండి:
స్త్రీలు చేతులు, కాళ్ళు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు కాబట్టి, పురుషులకు ఇది చాలా ముఖ్యం. మొదటి చూపులోనే వారిద్రుష్టి ఆకర్షించాలి అంటే, ఎల్లప్పుడూ మీ చేతి, కాలి వెళ్ళ గోళ్ళను ప్రతిరోజూ ఖచ్చితంగా కత్తిరించి, శుభ్రంగా ఉంచుకోండి.

మీ శరీరంలో పాదం తరచుగా నిర్లక్ష్యం చేసే భాగం. పురుషులు షూ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక మంచి ఫంగల్ క్రీమ్ ఈ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాకుండా, వారానికి ఒకసారి మానిక్యూర్-పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల మీ చేతులు, కాళ్ళు అందంగా కనిపిస్తాయి.

grooming tips that men should follow

4) మంచి షేవింగ్ ఉత్పత్తులను వాడండి:
ముఖం మీద ఉన్న జుట్టును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. షేవింగ్ కోసం ఎల్లప్పుడూ మంచి రేజర్ ని కొనండి. 3 సార్లు ఉపయోగించిన పిదప రేజర్ ని మార్చండి, మొద్దుబారిన బ్లేడును ఉపయోగించడం వల్ల ముఖంపై కోతలు లేదా సగం పెరిగిన జుట్టు ఉండే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా, మొద్దుబారిన రేజర్ వల్ల మీ చర్మంపై దురదలు లేదా కోసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ చర్మాన్ని సున్నితంగా చేసి, మొత్తం పద్ధతి చాలా తేలికగా అయ్యే మంచి షేవింగ్ ఫోమ్ ని ఉపయోగించండి. ఇది మీ చర్మానికి ఒక అవరోధంగా కూడా ఉంటుంది.

షేవ్ చేసుకున్న తర్వాత లోషన్ కూడా ముఖ్యమైనది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, హైడ్రేట్ చేస్తుంది. ఆల్కహాల్ లేని ఆఫ్టర్ షేవ్ లోషన్ ని ఉపయోగించండి. ఎందుకంటే ఆల్కహాల్ ఉన్న ఆఫ్టర్ షేవ్ లోషన్ వల్ల చర్మం పొడిబారి పోతుంది. ఈ ఆఫ్టర్ షేవ్ లోషన్ మంచి సువాసనని వెదజల్లి ఎంతోమంది స్త్రీలను మనవైపు తిప్పే మంచి గుణం ఉంది.

5) మంచి సన్-స్క్రీన్ ని వాడండి:
పురుషులు సూర్యకాంతి నుండి రక్షణకు ఏమీ శ్రద్ధ తీసుకోరు. కానీ మీ చర్మాన్ని సంరక్షణ లేకుండా వదిలేస్తే, చర్మం దెబ్బతిని, టాన్ లేదా ఎర్రబడడం, దురదలు వస్తాయి. ఇది చర్మం క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది!

సన్ స్క్రీన్ లోషన్ ని మీ వెంట ఉంచుకోండి, SPF 30 లేదా అంతకంటే ఎక్కువ, అన్ని సమయాలలో మీ వెంటే ఉండాలి, మీరు ఎక్కువ దూరం బైటికి వెళ్ళినపుడు దాన్ని ఉపయోగించడానికి సంకోచి౦చవద్దు. వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను తొలగించడంలో చాలా ఉపయోగపడుతుంది.

English summary

5 Grooming Tips For Men That Will Help Catch Women's Attention

These are the simple grooming tips that men should follow to attract women.
Desktop Bottom Promotion