For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐదు మేకప్ రూల్స్ ను హ్యాపీగా బ్రేక్ చేయవచ్చు!

|

మేకప్ ని స్వయంగా వేసుకోవడం మీకిష్టమైతే మీరు ఈ పాటికే ఎన్నో మేకప్ ట్యుటోరియల్స్ ను చూసి ఉండుంటారు. వాటి గురించి మీకొక అవగాహన వచ్చి ఉండుంటుంది. మేకప్ ఆర్టిస్ట్ లు ప్రొఫెషనల్స్ కావడం వలన వారు మేకప్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది. మేకప్ చేసేటప్పుడు వారు పాటించే కొన్ని టెక్నీక్స్ వలన అటువంటి లుక్ రావడం జరుగుతుంది. అయితే, మేకప్ చేసుకోవాలనుకునే ప్రతి వారికీ ఆ రూల్స్ సులభతరంగా ఉండకపోవచ్చు.

మన సామర్థ్యం మేరకు కొన్ని రూల్స్ ను పాటిస్తూ ఉంటాము. ప్రోడక్ట్స్ ని వాడటంలో అవసరమైన నియమాలను పాటిస్తూ ఉంటాము. ఆయా ప్రోడక్ట్స్ కూడా మన బడ్జెట్ లో ఫిట్ అయి ఉండాలి. వివిధ మేకప్ లుక్స్ కోసం ప్రయోగాలు చేసుకోవాల్సి ఉంటుంది. మీ కంఫర్ట్ కి సరిపోయే లుక్ గురించి మీకు అప్పుడు ఒక స్పష్టత లభిస్తుంది.

మేకప్ అనేది కచ్చితంగా మిమ్మల్ని మరింత అందంగా అలాగే ప్రకాశవంతంగా మార్చుతుంది. అయితే, మేకప్ విషయంలో కొన్ని నియమాలను ఉల్లంఘించడం అప్పుడప్పుడూ పరవాలేదు. ఎటువంటి మేకప్ రూల్స్ ను ఉల్లంఘించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాస్తంత క్రియేటివ్ గా మేకప్ ని అప్లై చేసుకునే వివిధ విధానాల గురించి తెలుసుకుందాం.

బ్రేక్ చేయదగిన మేకప్ రూల్స్

• ఫౌండేషన్ షేడ్ మెడతో మ్యాచ్ అవ్వాలి:

ఫౌండేషన్ ను కొనాలనుకునే ప్రతిసారి మీకొక సలహా పదే పదే అంది ఉండుంటుంది. ఫౌండేషన్ అనేది స్కిన్ టోన్ లో కలసిపోవాలి. అయితే, మీది పూర్తి ఫెయిర్ లేదా డార్క్ స్కిన్ అయితే ఈ నియమం వర్తించదు. అటువంటి సమయాలలో ఫౌండేషన్ అనేది ఫేస్ స్కిన్ కి మ్యాచ్ అయితే సరిపోతుంది. మెడకి మ్యాచ్ అవ్వాలని అనుకోనవసరం లేదు.

నెక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఫౌండేషన్ ఉండాలని మీకు మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి సలహా అందవచ్చు. అయితే, ఈ సలహా ప్రతి ఒక్కరికీ వర్తించదు. మరీ పింక్ గా ఉండే ఫౌండేషన్ కి దూరంగా ఉండండి. అది అసహజంగా కనిపిస్తుంది. అంతర్లీనంగా ఎల్లోయిష్ గా ఉండే ఫౌండేషన్ ను ప్రిఫర్ చేయండి. ఇది ఫేస్ లోని రెడ్ నెస్ ను బాలన్స్ చేస్తుంది. కాబట్టి, ఫౌండేషన్ అనేది ఫేస్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. ఫౌండేషన్ విషయంలో ఈ జాగ్రత్త పాటిస్తే మేకప్ లుక్ అద్భుతంగా వస్తుంది.

• న్యూడ్ లిప్స్ తో స్మోకీ ఐస్ కాంబినేషన్ బాగా ఎలివేట్ అవుతుంది

మేకప్ కి సంబంధించి మీరు ఇంకా ప్రాధమిక దశలోనే ఉంటే కొన్ని రూల్స్ ని మీరు పాటించి మేకప్ లుక్ ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది. మేకప్ లో కొత్త స్టయిల్స్ ను ప్రయత్నించాలని అనుకునేవారైతే స్టయిల్ మరియు కలర్ లను దృష్టిలో పెట్టుకోవాలి. వివిధ కలర్ కాంబినేషన్స్ ను ప్రయత్నించాలి. మేకప్ కిట్ ను పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి.

న్యూడ్ లిప్స్ మరియు స్మోకీ లిప్స్ బాగా మ్యాచ్ అవుతాయి అనేది అన్ని సందర్భాలలో వర్కవుట్ కాదు. ముఖ్యంగా, బోల్డ్ లుక్స్ ను ప్రయత్నించాలనుకుంటే ఆర్టిస్టిక్ లైనర్ ను ప్రయత్నించండి. దట్టమైన పింక్ లిప్స్ లేదా బ్రాంజ్ బేస్డ్ స్మోకీ ఐస్ తో ట్యాన్గీ రెడ్ లిప్ స్టిక్ ను ప్రయత్నించండి.

స్పెసిఫిక్ గా ఐస్ లేదా లిప్స్ ని మాత్రమే ఫోకస్ చేయాలని ప్రయ్నతించకండి. రెండిటి మీద సమానంగా ఫోకస్ ఇవ్వండి. లేదంటే, కేవలం ఒకే ఒక్క ఎలిమెంట్ ఎలివేట్ అవడం వలన లుక్ అనేది అంత గొప్పగా ఉండదు. మేకప్ అసంపూర్ణంగా అయిందన్న భావన కలుగుతుంది.

• ప్రైమర్ ని కచ్చితంగా వాడండి:

అనేక మేకప్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండటం వలన అందమైన మేకప్ లుక్ కోసం ఏ ప్రోడక్ట్ ని వదలకుండా ప్రయత్నించాలని ఆలోచన కలగడం సహజం. ప్రైమర్ ని వాడటం తప్పనిసరని మేకప్ ట్యుటోరియల్స్ లో పదే పదే చెప్పడం వలన కూడా ప్రైమర్ వాడకం గురించి సందేహం తలెత్తుతుంది. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే చాలా మటుకు ఫౌండేషన్స్ లో ప్రైమర్ కూడా ఇన్ బిల్ట్ గా లభిస్తుంది. కాబట్టి, ప్రత్యేకంగా ప్రైమర్ అనేది అవసరం లేదు.

• నెయిల్ కలర్ తో లిప్ కలర్ మ్యాచ్ అవ్వాలి:

మేకప్ వేసుకునే వారికి ఒక ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంది. నెయిల్ కలర్ తో లిప్ కలర్ మ్యాచ్ అవ్వాలా అనేది వారి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక్కో మేకప్ ఆర్టిస్ట్ ఒక్కోలా సమాధానమిచ్చే అవకాశం ఉంది. అయితే, ఏది మీరు అనుసరిస్తారో అన్నది మాత్రం మీ మీదే ఆధారపడి ఉంది. మీ లుక్ ని ఇంకాస్త ఎలివేట్ చేయడానికి మీరు కాంట్రాస్టింగ్ లిప్ మరియు నెయిల్ కలర్ ను ప్రయత్నించవచ్చు.

• మస్కారాని కింది ల్యాషెస్ కి అప్లై చేయకూడదు:

ఈ రూల్ ని ఫాలో అయితే మీరు లోయర్ లిడ్స్ కి అన్యాయం చేస్తున్నట్టే. మస్కారాను కింది లిడ్స్ కు అప్లై చేసేటప్పుడు కంటి కింద చర్మంపై మస్కారా స్ప్రెడ్ అవుతుందన్న అనుమానం మీలో తలెత్తితే మీరు వర్రీ అవకండి. టిష్యూని కంటి కింద పెట్టి మస్కారాని అప్లై చేసుకుంటే ఈ సమస్య తలెత్తదు.

English summary

Silly makeup rules that are totally worth breaking!

At times, putting on makeup will bore you. So once in a while it's fine if you break the usual makeup routine. Hence, here's what you can do. If there is a confusion regarding whether the lip colour and nail colour should match, well, for a change you can mismatch both the colours and try with a new set of combinations.
Desktop Bottom Promotion