ఈ సులభమైన మేకప్ ట్రిక్స్ ద్వారా మీ కళ్ళను పెద్దవిగా చేసుకోవచ్చు?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కళ్ళు అనేక భావాలను పలికిస్తాయి. చారడేసి కళ్ళున్న వారి అందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే, అందరి కళ్ళు పెద్దవిగా ఉండవు. అయితే, చిన్న కళ్ళు ఉన్నవారు కూడా తమ లుక్ ను మెరుగుపరచుకోవచ్చు. మేకప్ తో కళ్ళను పెద్దవిగా కనిపించేలా మార్చుకోవచ్చు. ఈ మేకోవర్ ద్వారా మీ లుక్ ను మరింత మెరుగుపరచుకోవచ్చు.

ఉదాహరణకు, మేకప్ ద్వారా హైయర్ చీక్ బోన్స్ లుక్ ని సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సరైన మేకప్ టెక్నీక్ ని పాటించడం ద్వారా చారడేసి కళ్లను సొంతం చేసుకోవచ్చు. పెద్ద కళ్ళు మీకు యూత్ ఫుల్ లుక్ ని అందిస్తాయి. అలాగే, కళ్ళు వెడల్పుగా కనిపించడం వలన మీ సొగసు రెట్టింపవుతుంది. అటువంటి చారడేసి కళ్ళు కొంతమంది మహిళలకు సహజంగానే లభిస్తాయి. అయితే, నేరేడు పండులాంటి కళ్ళ అందాన్ని పొందాలనుకుంటే ఈ మేకప్ టెక్నీక్ ను మీరు తప్పక పాటించి తీరాలి.

simple makeup tricks to make eyes look big

ఐ మేకప్ అనేది విఫలమవడం వలన మీ మేకప్ మొత్తం పాడై ఉండుంటుంది. కాబట్టి ఐ లైనర్, ఐ షాడో వంటి ఐ మేకప్ టూల్స్ ని వాడేటప్పుడు కాస్త శ్రద్ధ వహించాలి.

ఎక్కువ మేకప్ ని అప్లై చేయడం ద్వారా మీ కళ్ళు నిస్తేజంగా అలాగే చిన్నవిగా కనిపిస్తాయి. కళ్ళే హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు మీరు అందుకు అనుగుణంగా మేకప్ ని అప్లై చేయాలి.

ఈ ఆర్టికల్ లో, మీ కళ్ళను హైలైట్ చేసే పది మార్గాలను వివరంగా పొందుపరిచాము. వీటిని చదివి, ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందండి. మీ కంటి సౌందర్యాన్ని పెంపొందించుకోండి.

1. ఐ బ్రోస్ ని డిఫైన్ చేయండి:

1. ఐ బ్రోస్ ని డిఫైన్ చేయండి:

ఐ బ్రోస్ ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవడం వలన మీ కళ్ళు ప్రకాశవంతంగా, పెద్దవిగా అలాగే అందంగా కనిపిస్తాయి. విల్లులా వంగిన ఐ బ్రోస్ మీ కళ్ళ అందాన్ని రెట్టింపు చేసి కళ్ళను పెద్దవిగా కనిపించేలా చేస్తాయి. మీ బ్రోస్ మీద ఫోకస్ చేసి వాటిని సరిగ్గా షేప్ చేసుకోండి. ఐ బ్రోస్ వద్ద అదనపు వెంట్రుకలను తొలగించండి. ఒక వేళ పలచని ఐ బ్రోస్ కలిగి ఉంటె ఐ బ్రో పెన్సిల్ ని వాడండి.

2. పఫీ ఐస్ కి గుడ్ బై చెప్పండి:

2. పఫీ ఐస్ కి గుడ్ బై చెప్పండి:

కళ్ళ కింద ఉబ్బుల వలన కళ్ళు చిన్నగా కనిపిస్తాయి. అందువలన, కళ్ళు ఉబ్బినట్లయితే తక్షణమే హోమ్ రెమెడీస్ ని పాటించాలి. ఈ క్రింది పద్దతులను పాటించడం ద్వారా కళ్ళ కింద ఉబ్బులను తగ్గించుకోవచ్చు.

నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోండి

చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగండి

వ్యాయామం చేయండి

ఉప్పుని తక్కువగా తీసుకోండి

కంటిపై దోసకాయ ముక్కలను ఉంచండి. దోసకాయలో లభించే కెఫైక్ యాసిడ్ తో పాటు విటమిన్ సి అనేది చర్మాన్ని ప్రశాంతపరచి కంటి కింద ఉబ్బులను తగ్గిస్తుంది.

3. కాంకీలర్ ని అప్లై చేయండి:

3. కాంకీలర్ ని అప్లై చేయండి:

కంటి కింద నల్లటి వలయాలుంటే వాటిని కాంకీలర్ ను ఉపయోగించడం ద్వారా కవర్ చేయవచ్చు. కాంకీలర్ అనేది మీ కంటి కింద వలయాలను తొలగించదు. అయితే, ఈ డార్క్ సర్కిల్స్ పై అందరి దృష్టి పడకుండా చూస్తుంది. మీ స్కిన్ కొనే కంటే కాస్తంత లైటర్ అలాగే వార్మర్ షేడ్ కాంకీలర్ ను ఎంచుకోండి. ఈ కాంకీలర్ ని కంటి కింద అలాగే కంటి చుట్టూ అప్లై చేయండి. అలాగే ఐ లిడ్స్ ను కూడా కవర్ చేయండి. మేకప్ స్పాంజ్ ను వాడటం ద్వారా లేదా సరైన విధంగా ఫింగర్స్ తో నైనా కాంకీలర్ ను అప్లై చేయండి.

4. న్యూట్రల్ మరియు లైట్ కలర్డ్ ఐ షాడో:

4. న్యూట్రల్ మరియు లైట్ కలర్డ్ ఐ షాడో:

ఇప్పుడు ఒకే కలర్ కి చెందిన రెండు షేడ్స్ ఐ షాడోలను ఎంచుకోండి. ఇప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలన్న ఏరియాలలో లైట్ కలర్ షేడ్ ను అప్లై చేయండి. మిగతా ఏరియాస్ లో డార్క్ షేడ్ ను అప్లై చేయండి. ఐ లిడ్స్ కి మధ్యలో లైట్ ఐ షాడో ని అప్లై చేయండి. తద్వారా, మీ కళ్ళు అందంగా పెద్దవిగా కనిపిస్తాయి. అలాగే, షిమ్మరీ ఐ షాడో ని కూడా మీరు ఎంచుకోవచ్చు.

5. అప్పర్ వాటర్ లైన్ ని టైట్ లైన్ చేయండి

5. అప్పర్ వాటర్ లైన్ ని టైట్ లైన్ చేయండి

అప్పర్ వాటర్ లైన్ ని బ్లాక్ ఐ లైనర్ తో టైట్ లైన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ల్యాషెస్ దట్టంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అప్పర్ వాటర్ లైన్ ని టైట్ లైన్ చేయడం ద్వారా మీ కళ్ళను మరింత తీర్చిదిద్దిన లుక్ వస్తుంది. మీ ల్యాషెస్ దట్టంగా కనిపిస్తాయి.

6. ఐ ల్యాషెస్ ని కర్ల్ చేయండి:

6. ఐ ల్యాషెస్ ని కర్ల్ చేయండి:

ఐ ల్యాషెస్ కర్లర్ ని వాడటం ద్వారా ఐ ల్యాష్ ని కర్ల్ చేయవచ్చు. కర్లర్స్ వలన ఐ ల్యాషెస్ కి లెంత్ తో పాటు వాల్యూమ్ కూడా లభిస్తుంది. సరైన ఐ ల్యాష్ కర్లర్ ని వాడటం ద్వారా ల్యాషెస్ ని అందంగా మరల్చుకుని కంటి అందాన్ని మెరుగుపరచుకోవచ్చు.

7. మస్కారాను వాడండి:

7. మస్కారాను వాడండి:

మస్కారా వలన మీ కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. కళ్ళ లాషెస్ కి అలాగే కళ్ళకు మధ్య కాంట్రాస్ట్ ను పెంచడానికి మస్కారా ఉపయోగపడుతుంది. అప్పర్ అలాగే లోయర్ ల్యాషెస్ పైన మస్కారా ను అప్లై చేసి మరింత స్ట్రైకింగ్ లుక్ ని సొంతం చేసుకోండి.

8. ముడతలను కవర్ చేయండి:

8. ముడతలను కవర్ చేయండి:

కళ్ళ అందాన్ని మరింత పెంచడం కోసం కంటి వద్దనున్న ముడతలను కవర్ చేయండి. మ్యాట్టే బ్రౌన్ షేడ్ ని ఉపయోగించడం ద్వారా ఈ పర్పస్ ఫుల్ఫీల్ అవుతుంది. సరైన విధంగా ఈ షేడ్ ని ఉపయోగించితే మంచి ఫలితాలను పొందవచ్చు.

9. ఇన్నర్ కార్నర్ లో హైలైటర్ లేదా షిమ్మర్ ను వాడండి:

9. ఇన్నర్ కార్నర్ లో హైలైటర్ లేదా షిమ్మర్ ను వాడండి:

తగినంత ఐ మేకప్ ని చేసుకోకపోతే, హైలైటర్ లేదా షిమ్మర్ ని వాడటం ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చు. దీని ద్వారా సహజమైన లేదా తాజా లుక్ ని సొంతం చేసుకోవచ్చు.

English summary

Simple Makeup Tricks To Make Your Eyes Look Big

One of the common issues that women face during pregnancy is spotting. Therefore here, we will be discussing in detail about it. Take a look.
Story first published: Friday, February 9, 2018, 12:30 [IST]