For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అందం’ కోసం డబ్బులు తగలేస్తున్నారా..?

|

How to Look Naturally Beautiful
చర్మ సౌందర్యానికి మెరుగుపరుచుకునేందుకు ప్రస్తుత మార్కెట్లో 'సౌందర్య ఉత్పత్తులు' వందల సంఖ్యలోనే లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో అన్ని అందరికి నప్పవు. కొందరి చర్మతత్వం మాత్రమే ఆ సౌందర్య సాధనాలకు సహకరిస్తుంది. ఇవి తెలియని కొందరు వందలు రూపాయిలను వెచ్చించి ఫలితానివ్వని సౌందర్య సాధనాలను ఆశ్రయించి విసిగిపోతున్నారు.

ఈ ఉత్పత్తుల పై ఆధారపడకుండా రోజు వారీ తీసుకునే ఆహార పదార్ధాల్లో స్వల్ప మార్పుచేర్పులు చేస్తే సహజసిద్ధమైన సౌందర్యం మరియు సవాసనలు వెదజల్లే గుబాళింపు మీ సొంతమవుతుంది.

ప్రకృతి ప్రసాదమైన పళ్లు, కూరగాయలు చర్మ సౌందర్యానికి మరింత తోడ్పాటునందిస్తాయన్న విషయం మనలో చాలామందికి తెలుసు. కొంతమంది తెలిసినా అంతగా పట్టించుకోరు. నిత్యం మార్కెట్లో లభ్యమయ్యే ఆపిల్, దోసకాయ, బొప్పాయి, పైనాపిల్ వంటి ఫలాలు చర్మసౌందర్యానికి వన్నె పెంచుతాయి. ఈ ఫలాల గుజ్జును, చర్మ సౌందర్యాన్ని పెంచే నూనెలలో కలిపి వీటిలో 'డ్రై ఫ్రూట్స్'కూడా చేర్చి ముఖానికి మాస్క్ వేసుకుంటే ఫలితం కనబడుతుంది.

ముఖ్యంగా 'మాస్క్'కోసం ఎంచుకునే పండ్లు, కూరగాయలు తాజావై ఉండాలి. ఈ విధమైన సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ముఖాన్ని సౌందర్యవంతం చేసుకోవటంతో పాటు శరీరాన్ని తాజా సువాసనల మయం చేసుకోవచ్చు.

English summary

How to Look Naturally Beautiful | ‘అందం’ కోసం డబ్బులు తగలేస్తున్నారా..?

You don’t have to spend a lot of time and money or undergo painful cosmetic procedures to exude radiant natural beauty. Here are some well-kept secrets for how to enjoy health and beauty.
Story first published:Tuesday, November 1, 2011, 12:31 [IST]
Desktop Bottom Promotion