Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.!
సాధారణంగా తినే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ లు...!
ఎండ, కాలుష్యం, వాతావరణ మార్పులు చర్మాన్ని కాంతివిహీనంగా, నిస్తేజంగా మార్చి ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి! ఈ మార్పులను ధైర్యంగా ఎదుర్కోవటానికి, వీటి బారిన పడకుండా చర్మాన్ని కాపాడుకోవటానికి అదనపు సంరక్షణ అవసరం. మార్కెట్లో కోకొల్లలుగా చర్మ సంరక్షణ కోసం పుట్టుకొచ్చిన బ్యూటీ ప్రాడక్ట్స్‌లో ఏది, ఎప్పుడు, ఎలా వాడాలో... ఏది అవసరమో చాలా మందికి తెలిక ఎటుపడితే అటు వాడేసి, ముఖాన్ని అంద విహీనంగా చేసుకొంటుంటారు. అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకొనే ఫేస్ ప్యాక్ లతో మంచి ఉపయోగం ఉంది. ఫేస్ ప్యాక్ - నెలకు రెండు సార్లు దీన్ని వాడవచ్చు. ఇంట్లో ఉండే పదార్ధాలతో ఫేస్ ప్యాక్‌లు ఇలా తయారుచేసుకోవచ్చు.

చర్మ సంరక్షణ అన్నది కొద్దిగా కష్టమైన పనే.. దీని కోసమని బయట షాపుల్లో దొరికే ఖరీదైన కాస్మోటిక్స్ కొనవలసిన పని లేదు. ఇంట్లో మనకు అందుబాటులో వుండే వస్తువులతోనే చర్మం అందంగా ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. సాధారణంగా చర్మం స్వభావాన్ని బట్టి పొడిచర్మం, జిడ్డు చర్మం, నార్మల్ స్కిన్ అని మూడురకాలుగా వుంటుంది. చర్మం స్వభావాన్ని బట్టి తగిన ఫేస్ ప్యాక్ వాడాలి. ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్ ప్యాక్ వివరాలు...
బ్రౌన్ షుగర్-పాలతో ఫేస్ ప్యాక్: ఇది చాలా సులభమైన మరియు సమర్థమంతమైన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. రెడిమేడ్ సిలికా(ఇసుక)తో ముఖం మీద స్ర్కబ్ చేయడం వల్ల ముఖ చర్మం దెబ్బతినే ప్రమాదం వుంది. కాబట్టి దాని స్థానంలో రెండు చెంచాల బ్రౌన్ షుగర్, మూడు చెంచాల పాలు బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కొద్దిగా తడిచేసి బాగా రబ్ చేయాలి. రుద్దేటప్పుడు గుండ్రంగా మసాజ్ లాగా రుద్ది మళ్లీ 10నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
తేనె - బాదం: సాధారణంగా ఒక్కోక్కో రోజు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తుంటారు. దాంతో ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టి గంట తర్వాత బయటకు తీసి బాగా మెత్తని పేస్ట్ లా తయారుచేసుకొని దానికి రెండు చెంచాల తేనె మిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటిని దారలుగా పోసి బాగా స్క్రబ్ చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
చాక్లెట్ ఫేస్ ప్యాక్: చాక్లెట్ ఫేస్ ప్యాక్. చర్మసంరక్షణలో ఇదీ ఒక ట్రీట్మెంటే. ఈ తియ్యటి చాక్లెట్ కూడా చర్మాని రక్షించి, అందంగా మెరిసేలా చేస్తుంది. అదేలాగంటే అరకప్పు తేనెలో రెండు చెంచాల డార్క్ చాక్లెట్ పౌడర్. రెండు టేబుల్ స్పూన్ల పాలు, ఒక స్పూన్ పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం మంచి నీళ్లతో శుభ్రం చేసేసుకోవాలి. అప్పుడే ముఖం తాజాగా... ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
పపాయ-నిమ్మరసం ఫేస్ ప్యాక్: క్రమక్రమంగా ఎండలు తగ్గి వేసవి విడుస్తోంది. ఇటువంటి సమయంలో పపాయ గుజ్జు ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. పపాయ గుజ్జుకి రెండు చెంచాల నిమ్మరసం కలిపి, దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రపరుచుకుంటే ముఖం మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications