For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం రంగు మారకుండా ఉండాలంటే...!

|

Skin Care Tips for Smooth and Glowing Skin
సాధారణంగా చర్మం కాలాన్ని బట్టి మారుతుంటుంది. ఎండకాలంలో ఎండ వేడికి చర్మం కమలడం, నల్లబడటం జరుగుతుంది. చలికాలం, వర్షాకాలం,లో చర్మం పొడిబారడం, గీతలు పడటం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు బయట తిరిగి ఇల్లు చేరుకొనేసరికి సున్నితమైన చర్మం రంగు మారడం, కమిలిపోవడం జరుగుతుంది. అలాంటి చర్మాన్ని మెరుగుపరిచే కొన్ని చిట్కాలు మీకోసం...

క్రీమ్‌లకు దూరంగా : నూనెతత్వం ఎక్కువగా ఉండే క్రీమ్‌లకు, క్రీమ్‌ ఆధారిత ఫౌండేషన్‌ లకు దూరంగా ఉండాలి. మేకప్‌ సాధ్యమైనంత తక్కువగా వేసుకోవాలి. ముఖానికి, చేతులకు విటమిన్‌'ఇ@తో చేసిన సన్‌ స్క్రీన్‌ను ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి.

వెనిగర్‌తో ఇలా: వెనిగర్‌, నీళ్లు సమపాళ్లలో తీసుకుని ఖాళీ స్ప్రే సీసాలో నింపాలి. ముఖం మీద చల్లుకొని దూదితో తుడుచుకోవాలి. అలానే ఉదయం స్నానం చేసేటపుడు నీళ్లలో కప్పు వెనిగర్‌ కలుపు కొంటే బయటకు వెళ్లినప్పుడు చర్మాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.

టమాటాలతో : టమాటాల లోపలి గింజలు తీసి మిక్సీలో మెత్తగా గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఐదారు నిమిషాలయ్యాక మర్దన చేసి గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అలసట దూరమై...హాయిగా అనిపిస్తుంది. మేని మృదువుగా మారుతుంది.

బొప్పాయి హాయి: బొప్పాయి ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి మెత్తగా చేసి నాలుగైదు నిమిషాలు మర్దన చేసుకోవాలి. తరువాత కడిగేసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. చర్మం మీది మృతకణాలు, మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. ఈ పండు అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.

కలబంద పూత: ఒక్కోసారి ఎండకు ముఖచర్మం ఎర్రగా మారి దద్దుర్లు వచ్చే అవకాశముంటుంది. అప్పుడు నీళ్లతో కడగకపోవడం మంచిది. కలబంద గుజ్జును పూతలా వేసి ఐదు నిమిషాలయ్యాక మృదువ్ఞగా మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లలో దూదిని, లేదా స్పాంజిని ముంచి రెండుసార్లు అద్ది, పొడివస్త్రంతో తుడుచు కొంటే ఇబ్బంది ఉండదు. లేదంటే సమస్య రెట్టింపవ్ఞతుంది.

చిన్న గిన్నెలో ఐదారు చెంచాల పాలు పోసి శుభ్రమైన వస్త్రం లేదా దూదిని అందులో కొద్దిసేపు ఉంచి తీసి ముఖం మర్దన చేస్తూ తుడవాలి. ఇలా ఆరేడు నిమిషాలు చేశాక చల్లటి నీటితో కడిగేసుకొంటే మేనికి స్వాంతన లభిస్తుంది.

శరీరానికి సాంత్వన: గోరువెచ్చటి నీళ్లలో అరకప్పుడు వంటసోడా లేదా ఓట్స్‌ పొడి కలిపి స్నానం చేస్తే అలసిన శరీరానికి సాంత్వన అందుతుంది. అలాగే పుల్లటి పెరుగుకి ముల్తానీ మట్టి చేర్చి ముఖానికి పూతలా వేసుకుని పదినిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగితే మేనికి తేమ అందుతుంది. జిడ్డు సమస్య ఉండదు.

English summary

Skin Care Tips for Smooth and Glowing Skin...! | చర్మం రంగు కోల్పోకుండా .....!

Every woman wants smooth, glowing skin that looks flawless without makeup and shimmers year-round. Maybe you’ve tried countless products on the market that promise to give you perfect skin, and maybe you’ve been disappointed by the lackluster results. Here are some trustworthy tips for a radiant look. 
Story first published:Wednesday, July 4, 2012, 8:36 [IST]
Desktop Bottom Promotion