For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మాన్ని ప్రకాశవంతము చేసే సుగంధ నూనెలు

By Super
|

సాదారణంగా మనం మన చర్మంనకు ఒక మంచి చర్మ సంరక్షణ మరియు ప్రకాశవంతముగా ఉండాలని కోరుకుంటాము. చర్మం ప్రకాశవంతముగా ఉండటానికి ఉత్తమమైన మార్గాలలో నూనెలు ఒకటని చెప్పవచ్చు. ముఖ్యమైన నూనెల విషయానికి వచ్చినప్పుడు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే సువాసనలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. ఈ నూనెలలో చెప్పుకోదగిన లక్షణాలు ఏమిటంటే వత్తిడిని తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాక అవి నొప్పి నివారిణీలు మరియు శక్తి బూస్టర్లగా పనిచేస్తాయి. మీ చర్మం ఆరోగ్యవంతముగా మరియు ప్రకాశవంతముగా ఉండటానికి సహాయపడతాయి.

వృద్ధాప్యం కారణంగా మీ చర్మం కన్నీటి సమస్య,హార్మోన్ల అసమతౌల్యం మరియు అనేక ఇతర పరిమితులను ఎదుర్కొంటుంది. సుగంధ నూనెలు మీ చర్మంనకు గూడీస్ మరియు అవసరమైన చర్మ సంరక్షణను ఇస్తాయి. ఈ నూనెలు ఉత్తమ చర్మ సంరక్షణ మరియు మీ చర్మంపై తైలమర్ధనం చేయుట వలన చర్మం మరియు లోపలి భాగంలో లోతుగా వ్యాప్తి చెందుతుంది. మీరు కూడా ప్రతి రోజు చర్మ సంరక్షణ కొరకు ఈ తైలాలను ఉపయోగించండి. అంతేకాక మీ చర్మం యొక్క ప్రత్యేకమైన సమస్యలకు చికిత్స పొందవచ్చు.

నూనె రాయటం వలన దాని జిగురు స్వభావం, చిక్కదనం మొదలైన వాటి గురించి మీ మనస్సుల్లో సందేహాలు మొదలవుతాయి. అయితే ముఖ్యమైన నూనెలు తేలికగా ఉంటాయి. వాటిని చర్మం బాగా గ్రహిస్తుంది. ఇవి పూర్తిగా మీ సూక్ష్మ రంధ్రాలకు ఆటంకం కలిగిస్తుందనే సందేహం వస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నూనెలు చర్మంను ఎలా ప్రకాశవంతముగా తయారుచేస్తాయో తెలుసుకుందాము.

1. బాదం నూనె

1. బాదం నూనె

సాధారణంగా బాదం నూనెను చర్మ సంరక్షణ కొరకు ఉపయోగిస్తారు. దీనిని బాదం చెట్టు యొక్క ఎండిన కెర్నలు నుండి సంగ్రహిస్తారు.బాదం నూనె మెరుగైన తేమ గుణాలను కలిగి ఉండుట వలన చర్మంనకు పోషణ ఇస్తుంది. ఇది సులభంగా చర్మం గ్రహించి చర్మం ప్రకాశవంతముగా తయారవుతుంది. అంతేకాక ఇది దురద మరియు పొడి చర్మంలను కూడా తగ్గిస్తుంది.

2. ఆర్గాన్ నూనె

2. ఆర్గాన్ నూనె

చర్మ సంరక్షణ విషయం వచ్చినప్పుడు ఆర్గాన్ నూనె అమూల్యమైనది అని చెప్పవచ్చు. ఈ నూనె మీ ముఖం మీద కనిపించే సున్నితమైన లైన్లు మరియు ముడుతలను తగ్గించేందుకు ప్రత్యేకమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.ఇది ఎర్రబడిన చర్మ చికిత్స లక్షణాలను మరియు మీ చర్మంపై ఉన్న దోషాలను నియంత్రిస్తుంది. ఈ నూనె యాంటిఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తుంది.

3. బాబాస్సు నూనె

3. బాబాస్సు నూనె

ఈ నూనె బ్రెజిల్ లో బాబాస్సు పామ్ నుంచి ఉద్భవించింది. ఈ నూనెలో ఉన్న ప్రత్యేక లక్షణాలు కారణంగా చర్మం ప్రకాశవంతముగా తయారు అవుతుంది. ఇది ఒక సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి పొడి మరియు చర్మం మీద దురద వంటి చర్మ సంబంధ ఇబ్బందులను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టు సంరక్షణలో కూడా చాలా అవసరం అని చెప్పవచ్చు.

4. ఆముదము

4. ఆముదము

ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇది సులభంగా చర్మం ద్వారా శోషించబడి కావలసినంత కాంతిని ఇస్తుంది. ఇది ఒక మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మం లోపల తేమను పరిరక్షిస్తుంది. జుట్టు సంరక్షణలో అవసరమైన వాటిలో ఆముదమును కూడా ఒకటిగా చెప్పవచ్చు.

5. కొబ్బరి నూనె

5. కొబ్బరి నూనె

సాధారణంగా కొబ్బరి నూనెను చర్మ సంరక్షణ నూనెగా ఉపయోగిస్తారు. చాలా కాలం నుండి ఈ నూనె చర్మం మరియు జుట్టు సంరక్షణలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఇది లోతుగా చొచ్చుకుపోయే గుణాలను కలిగి జుట్టు పెరుగుదలకు సౌలభ్యాన్ని కలిగిస్తుంది. కొబ్బరి నూనె ద్వారా సంరక్షించబడిన చర్మం మృదువుగా మరియు మెత్తగా ఉంటుంది.

6. జొజోబా నూనె

6. జొజోబా నూనె

మీకు నూనెలతో చర్మ సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జాబితాలో జొజోబా నూనెను కూడా జోడించడం మర్చిపోవద్దు. ఇది నూనెగా కాకుండా ఒక లిక్విడ్ మైనంగా ఉంటుంది. దీనిలోని శోథ నిరోధక లక్షణాలు చర్మం అడుగునకు చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనిలో తీవ్రమైన లక్షణాలు కలిగి ఉండుట వలన చర్మం ప్రకాశవంతముగా తయారవుతుంది.

7. వేప నూనె

7. వేప నూనె

వేప సూక్ష్మ క్రిమి వ్యతిరేక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. వైద్యంలో మరియు చర్మ సంరక్షణలో ఉత్తమ నూనెలలో ఒకటిగా ఉంది. ఇది ఆయుర్వేద చికిత్సలో ఒక కీలక పాత్రను పోషిస్తుంది. ఈ నూనె చర్మ సంరక్షణలో ఒక ఆదికాలపు పదార్ధంగా ఉంది.ఇది సోరియాసిస్,తామర,మోటిమలు మరియు మరిన్ని చర్మం రోగాలను తగ్గిస్తుంది.

8. ఆలివ్ నూనె

8. ఆలివ్ నూనె

ఆలివ్ నూనె చర్మంలో అంతర్గత తేమ నష్టాన్ని తగ్గిస్తుంది. అందువలన ఇది సమర్థవంతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం మృదువుగా మరియు ప్రకాశవంతముగా ఉండేలా చేస్తుంది. ఇది మీరు తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది. దీనిని కూడా జుట్టు సంరక్షణ కొరకు ఉపయోగిస్తారు.

9. గ్రేప్ సీడ్ నూనె

9. గ్రేప్ సీడ్ నూనె

మీకు జిడ్డైన అనుభూతి గురించి ఆందోళన ఉంటే నూనె అనువర్తనం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాక ఆ అనుభూతి ఉండదు. ఇది తక్షణమే మీ చర్మం ద్వారా శోషించబడి కావలసినంత కాంతిని ఇస్తుంది. మీరు చర్మం ప్రకాశవంతము కావాలని పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటె అప్పుడు గ్రేప్ సీడ్ నూనెను వాడండి.

10. క్యారెట్ రూట్ నూనె

10. క్యారెట్ రూట్ నూనె

క్యారెట్ రూట్ నూనె సూర్యుని వలన పాడైపోయిన చర్మంను సంరక్షిస్తుంది. అంతేకాకుండా శోథ పరిస్థితుల్లో చికిత్స సామర్ధ్యం కలిగి ఉంటుంది.ఇది జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. అయితే ఒకసారి ప్రయత్నించండి.

English summary

Essential oils to make your skin glow

A good and glowing skin demands a good skin care. One of the best ways to make your skin glow is oils skin care. When it comes to essential oils remember they are something more than scented botanical extracts.
Desktop Bottom Promotion