For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం మీద బ్లాక్ హెడ్స్ కారణాలు: నివారణ చిట్కాలు

|

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి కారణాలు ఏంటో తెలుసుకొన్నట్లైతే బ్లాక్ హెడ్స్ రాకుండా నివారించుకోవడం పెద్ద సమస్య కాదు. మరి కారణాలేంటో కనుక్కుందాం..

ముఖం మీద బ్లాక్ హెడ్స్ కు ముఖ్య కారణాలు:

1. చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి.
2. చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.
కాబట్టి, బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.

ముఖం మీద బ్లాక్ హెడ్స్ ను నివారించే సులభ చిట్కాలు:

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలు

ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లాచేసుకుని దాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

పెరుగు-బియ్యం పిండి

పెరుగు-బియ్యం పిండి

మూడు నాలుగు కప్పుల నీటిని వేడిచేసి వాటికి రెండు టీ స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలపాలి. ఓ టవల్‌ను ఈ నీటిలో ముంచి ముఖంపై ఉంచుకోవాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలుపుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రుద్దుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగే స్తేసరి.

చందనం

చందనం

గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ త గ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్ -రోజ్ వాటర్

ఓట్ మీల్ -రోజ్ వాటర్

ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకుని ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

ముల్తానీ మట్టి-రోజ్ వాటర్

ముల్తానీ మట్టి-రోజ్ వాటర్

సాధారణ చర్మతత్వం ఉన్నవారు ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.

మెంతి ఆకుల పేస్ట్

మెంతి ఆకుల పేస్ట్

మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరాత్రి పడుకునే మందు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. .

బ్లాక్ పెప్పర్

బ్లాక్ పెప్పర్

పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

కొత్తమీర-పసుపు

కొత్తమీర-పసుపు

తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.

గ్రేప్స్

గ్రేప్స్

ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

నిమ్మరసం-దాల్చిన చెక్క పొడి

నిమ్మరసం-దాల్చిన చెక్క పొడి

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్

ఓ పావు కప్పు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, మూడు చుక్కల అయోడిన్ వేసి చల్లారేవరకు అలానే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలో దూదిని ముంచి బ్లాక్‌హెడ్స్‌పై రాసుకోవాలి.

పొట్లకాయ

పొట్లకాయ

పొట్లకాయ గుజ్జును ముఖానికి రాసుకోవడంవల్ల మొటిమలు, ముడతలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ రాకుండా ఉంటాయి.

English summary

13 Easy & Effective Home Remedies for Blackheads

If you have recently noticed (or are fed up of) the dark spots around your forehead, nose or chin, you should definitely get relief from these home remedies for blackheads. These spots are blackheads, one of the common forms of acne. They become black in color because the oil in these minute ‘boils’ react with the air. In fact, blackheads are nothing but the oil that gets accumulated in your skin pores and get hardened due to reaction with air.
Story first published: Thursday, June 12, 2014, 11:30 [IST]
Desktop Bottom Promotion