For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ ట్యాగ్స్(పిలిపిర్లు) నివారించే ఉత్తమ చిట్కాలు

|

ప్రస్తుతం చాలా మందిలో చర్మం మీద చిన్నసైజులో మొటిమల్లాగా స్కిన్ టాగ్స్ (పులిపిరికాయలు)ఏర్పడటం చూస్తుంటాం. అవి ఏర్పడటంలో ఒకవ్యక్తి మరోవ్యక్తికి తేడా ఉంటుంది. కొందరిలో పెద్దవిగా ఏర్పడుతాయి. మరికొందరిలో చిన్నవిగా ఏర్పడుతాయి. ముఖ్యంగా ఈ సమస్య మద్యవయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది కొంత మందిలో వాటంతట అవే రాలిపోయనా కొంత మందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

ఖచ్చితమైన కారణం తెలియకుండా అధికబరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులోవారికైనా కనిపించేవి స్కిన్ ట్యాగ్స్. వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకపోయినా పెద్ద సైజులో కన్పించే భాగాలలో ఉంటే తీసివేయించుకోవటం మంచిది. సాధారణంగా పెసరగింజంత ఉండే ఈ స్కిన్ ట్యాగ్స్, గోల్ఫ్‌బాల్ సైజులో కూడా పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారటం వంటి లక్షణాలు కన్పించి స్కిన్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు, కాకుండా 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది.

స్కిన్ టాక్స్ ముఖం, మొడ, చంకల్లో, కళ్ళ క్రింది, లేదా కళ్ళ మీద మరియు ఛాతీ క్రింది భాగంలో ఏర్పడుతాయి. స్కిన్ ట్యాగ్స్ చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఈ స్కిన్ ట్యాగ్స్ వల్ల మీ అందమైన చర్మ సౌందర్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి, స్కిన్ ట్యాగ్స్ సమస్య మొదలవగానే, ఒకటి రెండు ఉన్నప్పుడు గుర్తించి వెంటనే సరైన జాగ్రత్తలు మరియు చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ ట్యాగ్స్ ను బర్న్ చేయాలని డాక్టర్స్ సలహాలిస్తుంటారు. కానీ వీటి వల్ల స్కిన్ ట్యాగ్స్ తొలగిపోయినా, వాటి తాలుకూ మచ్చలు మాత్రం అలాగే నిలిచి ఉంటాయి. కాబట్టి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ ట్యాగ్స్ నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ను ఉపయోగించండి .

స్కిన్ ట్యాంగ్స్ నివారించడం కోసం కొన్ని నేచరల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటని మీరు ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. ఉదాహారణకు, వాటికి టీట్రీ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగిర్, లేదా ఆముదం వంటివి అప్లై చేసి, నేచురల్ గా తొలగించుకోవచ్చు. స్కిన్ ట్యాగ్స్ తొలగించే మరికొన్ని ఉత్తమ పదార్థాలేంటో చూద్దాం...

అల్లం

అల్లం

స్కిన్ ట్యాగ్స్ ఉన్న ప్రదేశంలో తాజాగా ఉండే అల్లం ముక్కతో దాని చుట్టు రుద్దాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే. స్కిన్ ట్యాగ్స్ రాలిపోవడం జరుగుతుంది.

పైనాపిల్

పైనాపిల్

ఇది మరొక హోం రెమెడీ. స్కిన్ ట్యాగ్స్ ను నేచురల్ గా తొలగించడం కొరకు పైనాపిల్ రసంను స్కిన్ ట్యాగ్స్ మీద రుద్దాలి. రుద్దిన తర్వాత 20-25నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా పది రోజులు ప్రయత్నించి ఫలితం చూడండి.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం

స్కిన్ ట్యాగ్స్ నేచురల్ గా తొలగించుకోవడం కోసం ఉల్లిపాయ రసంను వాటి మీద రుద్దాలి. ఉల్లిపాయ ముక్కకు ఉప్పు అద్ది స్కిన్ ట్యాగ్స్ మీద రుద్ది, రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

నేచురల్ గా స్కిన్ ట్యాగ్స్ ను నివారించడానికి ఇది ఒక సాధరణ మరియు ఎఫెక్టివ్ హోం రెమడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ ను డిప్ చేసి స్కిన్ ట్యాగ్స్ మీద రుద్దాలి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

ముందుగా సోపుతో చేతులను శుభ్రం చేయాలి. తేమ పూర్తిగా ఆరిన తర్వాత స్కిన్ ట్యాగ్స్ మీద టీ ట్రీ ఆయిల్ ను పోయాలి. ఇది కొన్ని నిముషాలు కొంచెం మంటగా, నొప్పిగా ఉంటుంది. తర్వాత కాటన్ తో తుడిచేయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే త్వరగా నివారించుకోవచ్చు 6. నిమ్మరసం: నిమ్మరసం ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది నేచురల్ గా స్కిన్ ట్యాగ్స్ ను నివారిస్తుంది. కాబట్టి, తాజాగా ఉండే నిమ్మరసాన్ని స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేసి అరగంట తర్వాత రుద్ది కడగాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి రసాన్ని అప్లై చేయడం ఒక సింపుల్ ట్రిక్. ఇది స్కిన్ ట్యాగ్ ను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వెల్లుల్లిని మెత్తగాపేస్ట్ చేసి, స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలొవెరా

అలొవెరా

ఆలొవెరాలోని అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి, ఈ అలొవెరా జెల్ లేదా జ్యూస్ ను స్కిన్ ట్యాగ్స్ మీద నేరుగా అప్లై చేస్తే తొలగిపోతాయి.

English summary

Remove Skin Tag With Home Remedies

Do you see small raised out growths on the skin, cluttered on some parts of the body? This skin which looks like a mole is nothing but skin tags. Skin tags are not a serious problem and a common condition among middle-aged people.
Desktop Bottom Promotion