For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందానికే మచ్చ తీసుకొచ్చే మొటిమలకు మనకు తెలియని 15 కారణాలు

By Nutheti
|

ప్రస్తుత జనరేషన్ లో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పొల్యూషన్ కారణంగా.. చర్మంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందంగా ఉన్నా.. తెల్లగా ఉన్నా.. మొటిమలు, మచ్చల సమస్య వల్ల.. అందానికే మచ్చ ఏర్పడుతోంది. ఎన్ని రెమిడీస్ ఫాలో అయినా.. మనం తరచూ చేసే పొరపాట్ల వల్ల చర్మానికి చాలా హాని కలుగుతోంది.

ముఖంలో చిన్న మచ్చ అయినా.. అందాన్ని తగ్గిస్తుంది. మనం పడుకునే విధానం కూడా చర్మం నిర్జీవంగా మారడానికి, పొడిబారడానికి కారణమవుతుంది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా మనం తెలిసీ, తెలియక చేసే పనుల వల్ల ముఖంలో మొటిమలకు కారణమవుతోంది. ఇంతకీ ఎలాంటి అలవాట్లు చర్మంపై దుష్ర్పభావం చూపుతున్నాయో చూద్దాం..

తరచుగా ముఖం టచ్ చేయడం

తరచుగా ముఖం టచ్ చేయడం

రోజులో మన చేతులు ఎన్నో వేల బ్యాక్టీరియాలను ముట్టుకుంటాయి. అలాగే ప్రతిసారి మనం చేతులను శుభ్రం చేసుకోం. కానీ మొఖంపై చేతులు తరచుగా టచ్ చేస్తూ ఉంటాం. ఇలా చేతులలో ఉన్న బ్యాక్టీరియా, మురికి, ఆయిల్ ముఖానికి చేరడం వల్ల చర్మం పొడిబారుతుంది.

మొటిమలను నొక్కడం

మొటిమలను నొక్కడం

మొటిమలను గిల్లడం, నొక్కడం వల్ల మొటిమలు ఎక్కువవుతాయి. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది ఈ అలవాటు నుంచి బయటపడలేకపోతారు. దీనివల్ల మొటిమలే కాదు.. మచ్చలు కూడా పడిపోతాయి.

వ్యాయామం తర్వాత స్నానం

వ్యాయామం తర్వాత స్నానం

ఎలాంటి వ్యాయామం చేసినా.. చెమట ఎక్కువగా పడుతుంది. బయట చేసే వ్యాయామం వల్ల దుమ్ము, ధూళి చెమటలో కలిసిపోతుంది. కాబట్టి వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయాలి. లేదంటే.. చెమట ద్వారా పింపుల్స్ ఎక్కువవుతాయి.

బ్యూటీ ప్రొడక్స్ తరచూ మార్చడం

బ్యూటీ ప్రొడక్స్ తరచూ మార్చడం

రాత్రికి రాత్రే చర్మంలో మార్పులు వచ్చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏదైనా ఫలితం పొందాలంటే.. కొంత టైం పడుతుంది. కానీ.. ఒకటి రెండు రోజుల్లోనే రిజల్ట్స్ కనిపించకపోతే.. కొత్త ప్రొడక్ట్స్ కొనేస్తారు. ఇలా తరచూ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్చడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది.

చీప్ కాస్మొటిక్స్

చీప్ కాస్మొటిక్స్

మరో తప్పు ఇది. తక్కువ క్వాలిటీ, చీప్ కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మ సమస్యలు మొదలవుతాయి. స్కిన్ కేర్ విషయంలో బ్రాండెడ్ వాడటం అలవాటు చేసుకోవాలి. తక్కువ క్వాలిటీ వస్తువులు వాడితే.. తర్వాత వాటివల్ల వచ్చే దుష్ర్పభావాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని మర్చిపోకండి.

ముఖం శుభ్రంచేసుకోవడం

ముఖం శుభ్రంచేసుకోవడం

ముఖం శుభ్రం చేసుకోవడానికి హార్డ్ వాటర్ వాడకూడదు. ఒకవేళ మీకు అవే అందుబాటులో ఉండే.. ఫిల్టర్ చేసిన నీళ్లను ముఖానికి ఉపయోగించడం మంచిది. అలాగే పీహెచ్ లెవెల్స్, ఆయిల్ బ్యాలెన్స్డ్ గా ఉన్న ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది. ఇది మాయిశ్చర్ లెవెల్స్ తగ్గించకుండా, చర్మం పొడిబారకుండా కాపాడుతాయి.

సూర్యరశ్మి

సూర్యరశ్మి

ఎక్కువ సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. దీనివల్ల కూడా చర్మం పొడిబారుతుంది. ఎక్కువ గాఢత ఉన్న సూర్య కిరణాలు పడటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే నల్లగా మారుతుంది. యూవీ కిరణాల వల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, ఐ షేడ్స్, స్కార్ఫ్ వాడటం మంచిది.

డిటర్జెంట్స్

డిటర్జెంట్స్

బట్టలు ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్స్ లో ఎక్కువ గాఢత లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంట.. ముఖానికి ఉపయోగించే టవల్స్, దిండు కవర్స్ ద్వారా ఈ కెమికల్స్ ముఖానికి తగిలి.. చర్మంపై మొటిమలకు కారణమవుతాయి.

స్మోకింగ్

స్మోకింగ్

పొగతాగడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు.. చర్మంపై ముడతలు, ప్రీమెచ్యూర్ ఏజింగ్, పొడిబారడం వంటి సమస్యలకు కారణమవుతాయి. స్మోక్ చేసినప్పుడు ఆక్సిజన్ చర్మంలోపలికి వెళ్లి చర్మ సమస్యలకు కారణమవుతాయి. చర్మం పొడిబారి, మొటిమలకు కారణమవుతుంది.

ఎక్కువ ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడి

ఎక్కువగా ఒత్తిడికి లోనవడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఒత్తిడి కారణంగా చర్మం ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది.. దీనివల్ల యాక్నే సమస్య మొదలవుతుంది. వ్యాయామం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ తినడం మీకు ఇష్టమా ? అయితే మీకు చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. మిర్చీ చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది. దీనివల్ల పీహెచ్ స్థాయిలు అన్ బ్యాలెన్సింగ్ కి లోనయి.. చర్మంపై మొటిమలు రావడానికి కారణమవుతుంది.

మీ పార్టనర్ గడ్డం

మీ పార్టనర్ గడ్డం

చాలా మంది అబ్బాయిలు గడ్డం పెంచుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్లో గడ్డం ఉంటేనే బాగుంటుందంటున్నారు. యాక్నేకి ఈ గడ్డం కూడా కారణమని మీకు తెలుసా ? మీ సాఫ్ట్ స్కిన్ ని మీ పార్టనర్ గడ్డం తగలడం వల్ల డస్ట్, ఆయిల్ చేరి.. పింపుల్స్ రావడానికి కారణమవుతుంది.

సరైన నిద్ర

సరైన నిద్ర

శరీరానికి, మెదడుకి సరిపడా నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తక్కువ స్ర్టెస్ లెవెల్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి.

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్ వల్ల కూడా పింపుల్స్ రావడానికి అవకాశముంది. మీ జుట్టు తరచుగా మీ ముఖంపై, ఫోర్ హెడ్ పై పడుతూ ఉంటే.. చర్మం పొడిబారుతుంది. కాబట్టి జుట్టు ముఖంపై పడకుండా జాగ్రత్త పడండి.

ఫేస్ స్ర్కబ్

ఫేస్ స్ర్కబ్

ఫేస్ ని స్ర్కబ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. టవల్, ఫేషియల్ స్ర్కబర్ తో రుద్దేటప్పుడు.. సరైన పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. వ్రాంగ్ వేలో స్ర్కబ్ చేయడం వల్ల చర్మానికి హాని కలిగి, మొటిమలు వస్తాయి.

English summary

15 Everyday Habits That Cause Acne

Looking beautiful not only makes you happy, but gives your self-confidence a boost to go and face the world. When you look good, you automatically feel good. But, in today’s time with the growing pollution, wrong eating habits, and ever increasing stress levels, our skin suffers the most.
Desktop Bottom Promotion