For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ బ్యూటీ పెంచుకోవడానికి అరటి పండ్లు చెప్పే తియ్యటి కబుర్లు..!

అరటిపండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడిక్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది స్కిన్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో విధాలా పనికొస్తుంది.

|

అన్ని కాలాల్లో లభించటమే గాక చౌకగానూ లభించే పండు అరటి.ఆకట్టుకొనే రంగు , కమ్మని రుచితో పాటు సులభముగా జీర్ణమయ్యే అరటి అన్ని వయసుల వారికీ ఇష్టమైన ఆహారం. అంతే కాదు, ఆకలిని తగ్గిస్తుంది, శరీరానికి కావల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.

అందానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యం మెరుగుపరచడంలో కూడా అరటి గ్రేట్ అని చెప్పవచ్చు. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. ఆయిల్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. చర్మంలో మార్క్స్ ను క్లియర్ చేస్తుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి డెడ్ స్కిన్స్ సెల్స్ ను తొలగిస్తాయి. చర్మ రంద్రాలను ష్రింక్ అయ్యేలా చేస్తాయి. చర్మంను టైట్ గా మార్చుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతాయి .

 10 Banana Face Mask Recipes That Will Make Your Skin Smile..!

అరటిపండ్లలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మ రంద్రాలో తెరచుకునేలా చేసి, చర్మానికి మరింత బెటర్ గా మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. బనాన ఫేస్ ప్యాక్ వల్ల చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది. అరటిపండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడిక్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది స్కిన్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో విధాలా పనికొచ్చే అరటి పండు అందానికి చేసే మేలు గురించి తెలుసుకొందాం....

రేడియంట్ స్కిన్ మాస్క్ :

రేడియంట్ స్కిన్ మాస్క్ :

బాగా పండిన అరటి పండును గుజ్జులా చేసి, ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, తేనె మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడీకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి .

యాంటీ ఏజింగ్ మాస్క్ :

యాంటీ ఏజింగ్ మాస్క్ :

సగం అరటిపండును మెత్తగా గుజ్జులా చేసి అందులో ఒక టీస్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ముఖం శుభ్రం కడిగి, తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత స్ర్కబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మం కాంతివంతంగా మార్చే మాస్క్ :

చర్మం కాంతివంతంగా మార్చే మాస్క్ :

ఒక గుడ్డులోని పచ్చసొన, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ మెత్తగా ఉండే అరటి పండు గుజ్జు ను మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యే వరకూ స్పూన్ తో కలపాలి. తర్వాత ముఖం క్లీన్ గా కడిగి, తడి పూర్తిగా తుడిచి, డ్రై అయిన తర్వాత ఈ మాస్క్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఈ బనాన మాస్క్ ముఖం మీద పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత స్ర్కబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పింపుల్స్ క్లియరింగ్ మాస్క్

పింపుల్స్ క్లియరింగ్ మాస్క్

పింపుల్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అరటిపండు తొక్కను అప్లై చేసి మర్ధన చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి . ఈ హెర్బల్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

అవొకాడో సగం తీసుకుని, అందులో బాగా పండిని అరటిపండు గుజ్జు మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ కంట్రోలింగ్ మాస్క్ :

ఆయిల్ స్కిన్ కంట్రోలింగ్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ మ్యాష్డ్ బనాన గుజ్జులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఈ రెండూ స్మూత్ పేస్ట్ లా చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ బనాన ఫేస్ మాస్క్ ను వారానికొకసారి వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్య క్రమంగా తగ్గతుంది.

క్లెన్సింగ్ మాస్క్

క్లెన్సింగ్ మాస్క్

ఒక టీస్పూన్ మిల్క్ క్రీమ్ లో ఒక టీస్పూన్ అరటి పండు గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు మాస్క్ వేసుకోవాలి. అరగంట డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డెడ్ స్కిన్ తొలగించే స్ర్కబ్ :

డెడ్ స్కిన్ తొలగించే స్ర్కబ్ :

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకుని, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక టీస్పూన్ అరటి గుజ్జును, ఒక టీస్పూన్ తేనె తీసుకుని మిక్స్ చేయాలి. తర్వాత పచ్చిపాలతో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. తర్వాత ఈ పేస్ట్ ను చిక్కగా ముఖం , మెడకు అప్లై చేయాలి. అరగంట ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఏన్స్ మాస్క్

యాంటీ ఏన్స్ మాస్క్

ఒక బౌల్ తీసుకుని, అందులో అరటి ముక్కలను చిన్నగా కట్ చేసి వేయాలి. అరటీస్పూన్ బేకింగ్ సోడా, అరటీస్పూన్ పసుపు మిక్స్ చేసి, ఫోర్క్ తో బాగా బీట్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత ముఖం , మెడకు మాస్క్ వేసుకోవాలి. స్కిన్ స్ట్రెచ్ అవ్వడం ప్రారంభమవుతుంది, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బ్రైట్ స్కిన్ కోసం బనాన మాస్క్ :

బ్రైట్ స్కిన్ కోసం బనాన మాస్క్ :

మరో బనాన మాస్క్ . బాగా పండిన అరటి పండును గుజ్జులా చేసి, ముఖం, మెడకు అప్లై చేసి బాగా మర్ధన చేయాలి. డ్రైగా మారిన తర్వాత క్లీన్ చేయాలి. ఇది ఇన్ స్టాంట్ గా స్కిన్ ను కాంతివంతంగా మార్చుతుంది.

English summary

10 Banana Face Mask Recipes That Will Make Your Skin Smile..!

Don't know about you, but banana has been that one snack which has satiated our hunger pangs one too many times! However, what you didn't know is that it can do more than keep you well-fed. From drawing out toxins from skin, controlling oil production to clearing marks, banana face masks can be a literal saviour for your skin!
Story first published: Thursday, October 20, 2016, 14:47 [IST]
Desktop Bottom Promotion