ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం 11 బేసిక్ స్కిన్ కేర్ టిప్స్

Posted By: Staff
Subscribe to Boldsky

ఆయిల్ స్కిన్ వారి బాధ వర్ణణాతీతం . ఎందుకంటే ఎన్ని సార్లు ముఖం శుభ్రం చేసుకున్నా, మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. తిరిగి కొద్దిసేపటికే స్కిన్ ఆయిలీగా కనబడుతుంది. అంతే కాదు ఆయిల్ స్కిన్ కలవారికి ముఖంలో మొటిమలు మచ్చల సమస్య అధికంగా ఉంటుంది. అంతే కాదు, మరికొన్ని చర్మ సమస్యలు కూడా ఉంటాయి.

అందువల్ల, చర్మ సంరక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎప్పుడూ చర్మం జిడ్డుగా..ఆయిలీగా లేకుండా చూసుకోవాలి.

ఆయిల్ స్కిన్ తో బాధపడే వారి కోసం కొన్ని సీరియస్ టిప్స్ ఉన్నాయి. వీటిని రోజూ ఫాలో అవ్వడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ ను అనేక మంది మహిళలు ట్రై చేసి టెస్ట్ చేయబడినవి. ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పనిలేదు. ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం చాలా సులభం మరియు ఆయిల్ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ చిట్కాలు అన్ని రకాల చర్మ తత్వాలకు పనిచేస్తాయి.

ముఖ్యంగా ఆయిల్ స్కిన్ మీద ఎఫెక్టివ్ గా పనిచేసి, ఆయిల్ నెస్ తగ్గించడంతో పాటు చర్మ సమస్యలను నివారిస్తుంది.

నోట్ : ఈ టిప్స్ ను ఫాలో అవ్వడానికి ముందు చర్మం మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి మంట, దురద వంటి లక్షణాలు లేకపోతే తర్వాత నేరుగా ముఖానికి అప్లై చేసుకోవాలి.

1. బ్లోటింగ్ పెప్పర్ ను ఉపయోగించాలి

1. బ్లోటింగ్ పెప్పర్ ను ఉపయోగించాలి

బ్లోటింగ్ పెప్పర్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం , ఇది చర్మంలోనికి బాగా ఇంకి చర్మంలో జిడ్డు, మరియు షైనింగ్ ను తొలగిస్తుంది.

2. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి

2. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి

ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ లకు దూరంగా ఉండాలి. ఇవి ఆయిల్ స్కిన్ ను మరింత ఆయిలీగా మార్చుతాయి, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకుని, వేసుకోవడం వల్ల చర్మంలో ఆయిల్ నెస్ తగ్గుతుంది.

3. వారానికొకసారి ఎక్స్ ప్లోయేట్ చేయాలి

3. వారానికొకసారి ఎక్స్ ప్లోయేట్ చేయాలి

ఆయిల్ స్కిన్ వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు అధికంగా ఉంటాయి. ఇది స్కిన్ ఎక్స్ ఫ్లోయోషన్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ఎక్స్ ఫ్లోయేషన్ వల్ల చర్మంలో మురికి , డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. స్కిన్ స్ర్కబ్ చేయడం వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ తగ్గిపోతుంది.

4. ముఖానికి ఫుల్లర్స్ ఎర్త్ ను అప్లై చేయాలి

4. ముఖానికి ఫుల్లర్స్ ఎర్త్ ను అప్లై చేయాలి

ఫుల్లర్స్ ఎర్త్ ఒక నేచురల్ పదార్థం. ఇది చర్మంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది. ఆయిల్ స్కిన్ తొలగిస్తుంది. ఈ ముల్తానీ మట్టిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల దీన్ని పురాతన కాలం నుండి ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది మొటిమలను దూరం చేస్తుంది.

5. నిమ్మరసం

5. నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్స్ చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. ఒక కాటన్ బాల్ నిమ్మరసంలో డిప్ చేసి, ముఖం, మెడ మీద అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. ఈ సింపుల్ టిప్ వల్ల చాలా చర్మంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఆయిల్ నెస్ తగ్గుతుంది.

6. నైట్ టైమ్ స్కిన్ కేర్

6. నైట్ టైమ్ స్కిన్ కేర్

మరో ముక్యమైన స్కిన్ కేర్ చిట్కా. ఇది మేకప్ తొలగిస్తుంది, మైల్డ్ ఫేస్ వాష్ లా పేనిచేస్తుంది. రాత్రి నిద్రించడానికి ముందు మరేది ముఖానికి అప్లై చేయకుండా ముఖం చల్లటి నీళ్లతో శుబ్రం చేసి , పడుకోవాలి.

7. ఎక్కువ మేకప్ వేసుకోకూడదు

7. ఎక్కువ మేకప్ వేసుకోకూడదు

హెవీ మేకప్ వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ మరింత వరెస్ట్ గా తయారవుతుంది. ఈ అలవాటు వల్ల మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. చర్మంలో ఎక్సెఆయిల్ ఉత్పత్తి అవుతుంది. . కాబట్టి,ఆయిల్ స్కిన్ ఉన్న వారు మేకప్ వేసుకోకపోవడమే మంచిది.

8. గోరువెచ్చని నీళ్లు

8. గోరువెచ్చని నీళ్లు

ఆయిల్ స్కిన్ ఉన్నవారు స్నానానికి మరీ వేడి నీళ్ళు లేదా చల్లనీళ్లు కంటే గోరువెచ్చనీ నీళ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల చర్మంలో మురికి తొలగిపోతుంది,. చర్మానికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఈ పవర్ ఫుల్ చిట్కాను ఉపయోగించడం వల్ల చర్మం హెల్తీగా మరియు అందంగా కనబడుతుంది.

9. ఆస్ట్రిజెట్ లేదా ఫేషియల్ టోనర్ ను అప్లై చేయాలి:

9. ఆస్ట్రిజెట్ లేదా ఫేషియల్ టోనర్ ను అప్లై చేయాలి:

చర్మానికి ఆస్ట్రిజెంట్ లేదా ఫేషియల్ టోనర్ అప్లై చేయడం వల్ల ఆయిల్ నెస్ తగ్గించుకోవచ్చు. చర్మంతో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్సెస్ ఆయిల్ ను తగ్గించడం మాత్రమే కాదు, ఇది చర్మాన్ని ట్రీట్ చేస్తుంది,. మొటిమలను నివారిస్తుంది.

10. చర్మానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది

10. చర్మానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది

అన్ని సమయాల్లో చర్మం తేమగా..కాంతివంతంగా కనబడటానికి సరిపడా నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగడం, వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న పండు, ఆహారాలు తినడం, రోజ్ వాటర్ లేదా ఫేషియల్ మిస్ట్ ను ముఖానికి స్ప్రే చేసుకోవడం వల్ల స్కిన్ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

11. మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్

11. మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్

ఆయిల్ స్కిన్ కు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల మరింత గ్రీజీగా కనబడుతుంది, అందువల్ల మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల చర్మంలో జిడ్డును తొలగించడం మాత్రమే కాదు, చర్మం కూడా తేలికగా ఫీలవుతుంది.

English summary

11 Must-Follow Basic Skin Care Tips For Oily Skin

Now, manage your oily skin in a better way by following these effective 11 tips! Take a look to know what they are.
Story first published: Thursday, May 18, 2017, 11:30 [IST]
Subscribe Newsletter