For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ కాంతి పెంచుకోవాలంటే బాదం ఫేస్ ప్యాక్ ట్రై చేయండి!

|

డ్రై నట్స్ లో బాదం ఒకటి. బాదంతో వివిధ రకాల డిజర్ట్స్ చేస్తుంటారు. వంటలకు అద్భుతమైన రంగు రుచి మాత్రమే కాదు, పాలకు ప్రత్యామ్నాయంగా బాదంను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తుంటారు.

డ్రైఫ్రూట్స్ లో ఒకటైన బాదం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి వెల కాస్త ఎక్కువైనా, ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం బేష్ అంటారు. బాదం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా అద్భుతం అంటారు. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలను నివారించడంలో బాదం ఉత్తమమైనది.

ట్రెడిషనల్ రెమెడీస్ లో బాదం ఒకటి, బాదంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మంచి కాంతివంతంగా మెరవడంతో పాటు, చర్మం ఫ్రెష్ గా ఉంటుంది. బాదంను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం వల్ల ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది చర్మానికి కావల్సిన పోషణను అందిస్తుంది.

బాదంను చర్మానికి, జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను అందిస్తోందో తెలుసుకుందాం..

1. నేచురల్ మాయిశ్చరైజర్

1. నేచురల్ మాయిశ్చరైజర్

బాదంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల, ఇది చర్మానికి తేమను మరియు మాయిశ్చరైజర్ ను సహజగా అందిస్తుంది. ఈ మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ గుణాల వల్ల చర్మ తేమగా, సాఫ్ట్ గా మారుతుంది.

2. వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

2. వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

చర్మానికి డ్యామేజ్ కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణాలు బాదంలో అధికంగా ఉన్నాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ గుణాల వల్ల చర్మంలో ఫైన్ లైన్స్ మరియు ముడుతలను నివారిస్తుంది.

బాదంను పేస్ట్ చేసి, అందులో ఒక స్పూన్ పసుపు చేర్చి, అందులోనే ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. సూర్యరశ్మి నుండి చర్మం పాడవకుండా కాపాడుతుంది:

3. సూర్యరశ్మి నుండి చర్మం పాడవకుండా కాపాడుతుంది:

ఎండ వల్ల చర్మం పాడవకుండా కాపాడుటకు విటమిన్ ఇ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో చర్మం హెల్తీగా మారుతుంది.

కొన్ని బాదంలు తీసుకుని, వాటిని పాలలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో గ్లిజరిన్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల ఎండవల్ల చర్మం డ్యామేజ్ కాకుండా , స్కిన్ టానింగ్ సమస్య లేకుండా నివారించుకోవచ్చు .

4. కంటి క్రింద నల్లని వలయాలను నివారిస్తుంది

4. కంటి క్రింద నల్లని వలయాలను నివారిస్తుంది

బాదంలో ప్రోటీన్స్, విటమిన్ అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ల క్రింద నల్లని వలయాలను తొలగిస్తాయి. హెల్తీ స్కిన్ ను ప్రోత్సహిస్తాయి. బాదంలో ఉండే మంచి ఫ్యాట్ వల్ల చర్మం క్రింద వలయాలతో పాటు, కళ్ల ఉబ్బును కూడా తొలగించుకోవచ్చు .

ఒక స్పూన్ బాదం పేస్ట్ తీసుకుని అందులో ఒక స్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

5. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది

5. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది

బాదం చర్మ రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంను చర్మానికి ఉపయోగించడం వల్ల స్కిన్ సెల్స్ హెల్తీగా ఏర్పడుట వల్ల గ్లోయింగ్, హెల్తీ అండ్ తేమ కలిగిన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవడానికి ఒక టీస్పూన్ బాదం పేస్ట్ తీసుకుని అందులో బేకింగ్ సోడా, ఒక స్పూన్ కాఫీ వేయాలి. ఈ పదార్థాలన్నీ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకుని, 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది

6. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది

బాదం ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. చర్మంలో రాషెస్, రెడ్ నెస్ తగ్గుతుంది, బాదం చర్మంను హెల్తీగా మరియు అందంగా మార్చుతుంది.

చర్మం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాదంను ఫేస్ ప్యాక్ కోసం, 2,3 స్పూన్ల బాదం పేస్ట్ తీసుకుని, అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. మాస్క్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

7. స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్

7. స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్

చర్మంను శుభ్రం చేయడంలో చర్మంలో కొత్త కాంతిని అందివ్వడంలో బాదం గ్రేట్ రెమెడీ. ఈ రెమెడీని ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవడానికి ఒక స్పూన్ బాదం పేస్ట్ లో ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. ఇది డ్రై స్కిన్ కండీషన్ ను నివారిస్తుంది

8. ఇది డ్రై స్కిన్ కండీషన్ ను నివారిస్తుంది

బాదంలో ఉండే విటమిన్ ఇ అండ్ బయోటిన్ చర్మంను ప్రకాశవంతంగా మరియు హెల్తీగా మార్చుతుంది. ఇందులో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ , బయోటిన్ డ్రై స్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

రెండు టీస్పూన్ల బాదం పేస్ట్ మరియు రెండు టీస్పూన్ల గుమ్మడి పేస్ట్ ను తీసుకుని, రెండూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని, పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Almond Benefits On Skin & Different Face Masks To Try

Here we mention to you the skin benefits of almonds and the different face masks to try with almonds, which you can make at the comfort of your home.
Desktop Bottom Promotion