For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదంతో వివిధ రకాల ఫేస్ ప్యాక్ లతో బ్యూటిఫుల్ అండ్ గ్లోయింగ్ స్కిన్

బాదంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను నివారిస్తుంది. అలాగే సిస్టక్ మొటిమలను కూడా నివారిస్తుంది. అంతే కాదు బాదంను ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్

By Lekhaka
|

మహిళలు అందగా ఉండాలని కోరుకుంటారు? ప్రతి ఒక్క మహిళల తను అందమైన కాంతివంతమైన చర్మంతో మెరిసిపోవాలని కోరుకుంటుంది. అయితే అందుకు కొంత మంది బ్యూటి ప్యార్లర్స్ కు ఖర్చు చేస్తుంటారు. ఎలాంటి మొటమలు, మచ్చలు లేని అందమైన చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు. అయితే డబ్బు ఖర్చు పెట్టి ఇన్ స్టాంట్ గా ప్రస్తుతం చర్మంలో మార్పులు తీసుకొచ్చినా, అది ఎక్కువ రోజులు నిలబడదు. ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది.

ఎటువంటి ఖర్చు లేకుండా..శ్రమ లేకుండా..చర్మంలో మార్పులు తీసుకురావాలన్నా..హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలన్నా బాదం ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. బాదంలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది ముఖంలో సపెల్ అండ్ సాప్ట్ స్కిన్ అందిస్తుంది.

బాదంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను నివారిస్తుంది. అలాగే సిస్టక్ మొటిమలను కూడా నివారిస్తుంది. అంతే కాదు బాదంను ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల మరెన్నె అద్భుతమైన బ్యూటి బెనిఫిట్స్ ను పొందవచ్చు అదెలాగో తెలుసుకుందాం..

బాదం-ఓట్స్ ఫేస్ ప్యాక్స్

బాదం-ఓట్స్ ఫేస్ ప్యాక్స్

డ్రై అండ్ డల్ స్కిన్ నివారణకు బాదం గ్రేట్ రెమెడీ. ఈ ఫేస్ ప్యాక్ ను రోజూ ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అలాగే స్కిన్ డీప్ గా శుభ్రపడుతుంది.

ఒక టీస్పూన్ బాదం పౌడర్ మరియు ఒక టీస్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. దీనికి 3 టీస్పూన్ల ఓట్స్ పొడి మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యంగ్ గా, అందమైన చర్మ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకుంటారు .

 బాదం-ముల్తాని మట్టి:

బాదం-ముల్తాని మట్టి:

బాదం పౌడర్ మరియు ముల్తాని మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ ను గ్రేట్ గా తొలగిస్తుంది. హెల్తీ స్కిన్ పొందుతారు.ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తికాకుండా నివారిస్తుంది.రెండు టీస్పూన్ల బాదం పౌడర్ తీసుకుని, అందులో రెండు టీస్పూన్ ముల్తానీ మట్టి మిక్స్ చేయాలి. ఈ రెండూ పాలలో వేసి మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారయ్యాక దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

బాదం మరియు ఆరెంజ్ ఫేస్ మాస్క్

బాదం మరియు ఆరెంజ్ ఫేస్ మాస్క్

బాదం మరియు ఆరెంజ్ ఫేస్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. బాదం, ఆరెంజ్ ఫేస్ మాస్క్ ఎలాంటి చర్మ సమస్యలనైనా, మొటిమలనైనా నివారిస్తుంది. రెండు స్పూన్ల బాదం పౌడర్ తీసుకుని,అందులో 3 చెంచాలా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

బాదం మరియు గందం ఫేస్ మాస్క్

బాదం మరియు గందం ఫేస్ మాస్క్

బాదం మరియు సాండిల్ ఉడ్ పౌడర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల డ్రై స్కిన్, వదులైన చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. రెండు టీస్పూన్ల బాదం పౌడర్ తీసుకుని,అందులో రెండు టీస్పూన్ల సాండిల్ ఉడ్ పౌడర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పాలు కూడా జోడించి స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకుని, 20 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గంద అలర్జీ ఉన్నవారు, ఈ ఫేస్ ప్యాక్ కు దూరంగా ఉండాలి.

బాదం-పెరుగు ఫేస్ మాస్క్:

బాదం-పెరుగు ఫేస్ మాస్క్:

ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ మ్యాస్క్, సూర్యుని నుండి స్కిన్ డ్యామేజ్ కాకుండా నవారిస్తుంది. చర్మంను కాంతి వంతంగా మార్చుతుంది. స్కిన్ టాన్ ను సులభంగా నివారిస్తుంది. రెండు టీస్పూన్ల బాదం పౌడర్ ను, రెంటు టీస్పూన్ల పెరుగుతో మిక్స్ చేసి, కొద్దిగా నిమ్మరసం మరియు తేనె కూడా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం మరియు పాలతో ఫేస్ మాస్క్

బాదం మరియు పాలతో ఫేస్ మాస్క్

బాదం, పాలు కాంబినేషన్ ఫేస్ మాస్క్ సెన్సిటివ్ స్కిన్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు బాదం ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. చర్మంలో దురదను తగ్గిస్తుంది. రెండు మూడు స్పూన్ల బాదం పౌడర్ తీసుకుని,అందులో కొద్దిగా పచ్చిపాలను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

బాదం పౌడర్ మరియు కొబ్బరి పాలతో ఫేస్ మాస్క్

బాదం పౌడర్ మరియు కొబ్బరి పాలతో ఫేస్ మాస్క్

బాదం పౌడర్ మరియు మిల్క్ ఫేస్ మాస్క్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వారికి గ్రేట్ గా సహాయపడుతుంది. బాదంను చర్మంను ఎండ వేడిమి నుండి రక్షణ కల్పిస్తుంది, కొబ్బరి పాలు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పెంచుతుంది.

రెండు టీస్పూన్ల బాదం పౌడర్ ను ఒక టీస్పూన్ కొబ్బరి పాలతో మిక్స్ చేయాలిజ అలాగే ఒక టీస్పూన్ తేనె కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Different Almond Face Packs You Should Try At Home

We have provided the best almond face pack recipes that you could try in the comfort of your home. Read to know the best almond face packs to attain that soft and glowing skin!
Desktop Bottom Promotion