దసరా స్పెషల్ గా అందంగా కనబడుటకు చర్మ సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

దుర్గా పూజ, అలంకరణ.. ఈ విషయంలో బెంగాలీలను అడిగితే బాగా చెబుతారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో దుర్గా పూజ సెలబ్రేషన్స్ ఎక్కువగా చేసుకుంటారు. అక్కడి స్త్రీ, పురుషులను ఎవరిని అడిగినా, వారు ఒక నెల ముందు నుండి దుర్గా పూజ ప్రిపరేషన్స్ మొదలు పెడతామని చెబుతారు. ఉదయం షార్ప్ 4 గంటలకు మహాలయ మరియు బీరేంద్ర కిషోర్ బాద్ర రేడియో వాయిస్ మారుమ్రోగతుంది. ఇక 7రోజులే ఉంది, చేయాల్సింది చాలా ఉంది అంటారు.

మహాలయ తర్వాత వచ్చే నవరాత్రులు కోసం చాలా చేయాలని బెంగాలీ మహిళలు సెడెన్ గా తేరుకోవడం జరుగతుంది. ముఖ్యంగా అక్కడి మహిళలు దసరా సెలబ్రేషన్ కు ప్రత్యేకమైన దుస్తులు, ఆభరణాలను కొనడం జరుగుతుంది. ఈ సందర్భంలో స్కిన్ అండ్ బాడీ కేర్ గురించి కొన్ని చిట్కాలను బోల్డ్ స్కై సూచిస్తోంది.

durga puja special skin care tips

నవరాత్రి స్పెషల్: అమ్మవారి అనుగ్రహానికి ఏ రోజు ఏ కలర్ ధరించాలి ?

బెంగాలీ మహిళలు ఒక వారం ముందు నుండే బ్యూటీ మీద కాస్త ఏకాగ్రత పెడుతుంటారు. ఒక వారం రోజల పాటు ఈ స్కిన్ కేర్ టిప్స్ ను ఫాలో అయితే కనుక నవరాత్రి పండగ సెలబ్రేషన్ గ్రాండ్ గా అందంగా జరుపుకోగలరు. మరి మీరు కూడా అందుకు సిద్దమేనా...

ఫేస్ , బాడీ వాష్ కొరకు మంచి క్లెన్సర్:

ఫేస్ , బాడీ వాష్ కొరకు మంచి క్లెన్సర్:

దసరాకు ఏడురోజులే ఉన్నప్పడు బార్ సోపులకు బాయ్ బాయ్ చెప్పి, మైల్డ్ క్లెన్సర్ ను ఉపయోగించాలి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. చర్మంలో పిహెచ్ న బ్యాలెన్స్ చేస్తుంది.

బార్ సోప్స్ లో సిరామిడ్స్ లేదా గ్లిజరిన్ ఉండటం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. కానీ, ఇది చర్మానికి హానికరం. కాబట్టి, పూజకు కొద్దిరోజుల ముందు నుండే క్లెన్సర్ ను వాడటం అలవాటు చేసుకోండి.

సాల్ట్, షుగర్, రైస్ పౌడర్, ఓట్స్ వంటివి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్స్ కోసం ఎంపిక చేసుకోండి:

సాల్ట్, షుగర్, రైస్ పౌడర్, ఓట్స్ వంటివి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్స్ కోసం ఎంపిక చేసుకోండి:

ఏ శుభకార్యమైన పండగలైనా అందంగా కనబడటానికే మహిళలు ఇష్టపడుతారు. అందుకు స్కిన్, బాడీ అందంగా ఉంచుకోవడం చాలా అవసరం. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి పంచదార, సాల్ట్, ఓట్స్ పౌడర్, బియ్యం పిండి వంటివి ఎంపిక చేసుకోవాలి. వీటికి ఆలివ్ లేదా కోకనట్ ఆయిల్ లేదా లెమన్ జ్యూస్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి మర్దన చేయడం వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది.

ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది.

కళ్ళ సంరక్షణ:

కళ్ళ సంరక్షణ:

దుర్గా పూజకు ముందే కళ్ళకు తగిన జాగ్రత్తల తీసుకోవాలి. కళ్ళు అందంగా కనబడటానికి మంచి ఐ క్రీమ్స్ ను ఎంపిక చేసుకోవాలి. నిద్రించడానికి అరగంట ముందు నుండి ఐక్రీమ్ ను అప్లై చేయాలి.

రాత్రి నిద్రించడానికి అరగంట ముందు కళ్ల క్రింద క్రీమ్ అప్లై చేసి, పడుకోవడం వల్ల ఎలాంటి పనిచేయరు కాబట్టి, రాత్రి సమయంలో కళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఉత్తమ సమయం.

ఎలక్ట్రికల్ ఫేషియల్ క్లెన్సింగ్ బ్రష్ :

ఎలక్ట్రికల్ ఫేషియల్ క్లెన్సింగ్ బ్రష్ :

శుభకార్యాలు, పండగల సీజన్ లో కేవలం బ్యూటీ ఉత్పత్తులు మాత్రమే సరిపోవు, ఈ దుర్గా పూజ సీజన్ లో ఎలక్ట్రికల్ ఫేషియల్ క్లెన్సింగ్ బ్రష్ ను ట్రై చేయండి.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్, క్లీనింగ్ సమయంలో ఈ బ్రష్ తో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, చర్మం అందంగా, ఫ్రెష్ గా కనబడుతుంది.

షవర్ తగ్గించాలి:

షవర్ తగ్గించాలి:

బ్యూటి టిప్ లిస్ట్ లో షవర్ కూడా ఒకటి. షవర్ ను కంట్రోల్ చేయాలి. ఎక్కువ సార్లు స్నానం చేసినా, శరీరం సరైన ఉష్ణోగ్రతలో ఉండాలి. అలాగే స్నానానికి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, డ్రైగా మారడం, చర్మంలోని మాయిశ్చరైజర్ కోల్పోవడం జరుగుతుంది.

ట్రెడిషనల్ లుక్ ను అందించే శారీ డిజైన్స్: నవరాత్రి స్పెషల్

మాయిశ్చరైజర్ ను మ్యానేజ్ చేయాలి:

మాయిశ్చరైజర్ ను మ్యానేజ్ చేయాలి:

చర్మానికి తేమ అంది, చర్మం కాంతివంతంగా, అందంగా కనబడాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం. కేవలం ముఖానికి మాత్రమే కాదు, చేతులు, కాళ్ళకు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో ఇది ఒక మంచి పద్దతి.

రొటీన్ గా రాత్రుల్లో చర్మసంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు:

రొటీన్ గా రాత్రుల్లో చర్మసంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు:

దుర్గా పూజ సమయంలో చర్మ సంరక్షణ కోసం రాత్రుల్లో కొంచెం సమయం కేటాయించాలి. టోనర్, మాయిశ్చరైజర్, స్కిన్ సెరమ్ మరియ నైట్ కేర్ క్రీమ్ వంటిని ఉపయోగించాలి. ఈ రెండూ క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల తప్పకుండా చర్మంలో మార్పు వస్తుంది. తప్పకుండా మీరు గుర్తిస్తారు.

ఎస్ పిఎఫ్ కలిగిన డేక్రీమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి:

ఎస్ పిఎఫ్ కలిగిన డేక్రీమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి:

దుర్గా పూజ సమయంలో పగటి పూట స్కిన్ పాడవకుండా ఉండటానికి ఎస్ పిఎఫ్ కలిగిన డేక్రీమ్ ను ముఖం, కాళ్ళు, చేతులకు ఉపయోగించడం వల్ల సూర్య రశ్మి నుండి చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఎస్ పిఎఫ్ కలిగిన క్రీములు సన్ ట్యాన్, యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. దీన్ని వాడటం వల్ల చర్మంలో నలుపు, అలసట అనేవి కనిపించవు.

మట్టి మాస్క్ :

మట్టి మాస్క్ :

దుర్గా పూజ సెలబ్రేషన్స్ కు 7రోజుల ముందు నుండి, క్లే మాస్క్ ను అప్లై చేయాలి. రెండు మూడు రోజుల గ్యాప్ లో రోజు విడిచి రోజు ఈ క్లే మాస్క్ ను అప్లై చేసుకోవాలి. మట్టి మాస్క్ ను కంటిన్యుగా వేసుకుంటే మురికి, మలినాలు, తొలగిపోయి, చర్మం ఫ్రెష్ గా కనబడుతుంది.

ఫ్రూట్ ఫేషియల్ తో ఫెయిర్ గా :

ఫ్రూట్ ఫేషియల్ తో ఫెయిర్ గా :

దుర్గా పూజకు ముందు సలూన్స్ కు పరుగులు పెట్టడం కంటే, న్యాచరల్ గా ఫ్రూట్ ఫేస్ ప్యాక్, ఫేషియల్ తోనే చర్మం అందంగా, ఫ్రెష్ గా కనబడుతుంది.

ప్రశాంతత!దుర్గా పూజకు ముందు అన్ని రకాల చర్మ తత్వాలకు ఫ్రూట్ ఫేషియల్ బాగా పనిచేస్తుంది.దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది చర్మ రంద్రాలను శుభ్రం చేసి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలను నివారిస్తుంది.

English summary

Durga Puja Special Skin Care Tips | Skincare Tips For Durga Puja | Durga Puja Beauty Tips

Durga Puja special skin care tips that you can follow, when there is only a week left in hand.