For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ల పగుళ్లు, పొడి చర్మంను నివారించుకోవడానికి హోం రెమెడీస్..!

కాళ్ల పొడి బారిన చర్మంతో ఉన్నప్పుడు చీకాకు, దురద మరియు కొన్ని సందర్బాల్లో బర్నింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. మీరు షార్ట్ ప్యాంట్స్ వేసుకుంటారా, స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటారా అన్నది సమస్య కాదు..

By Lekhaka
|

డ్రై స్కిన్ (పొడి చర్మం)చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కాళ్ళ పగుళ్లు మరియు కాళ్లమీద డ్రై స్కిన్ నివారించుకోవాలనుకుంటున్నారా.అయితే ఇది మీకు ఖచ్ఛితంగా సహాయపడుతుంది.

కాళ్ల పొడి బారిన చర్మంతో ఉన్నప్పుడు చీకాకు, దురద మరియు కొన్ని సందర్బాల్లో బర్నింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. మీరు షార్ట్ ప్యాంట్స్ వేసుకుంటారా, స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటారా అన్నది సమస్య కాదు, కాళ్లు తరచూ దురద కలిగి ఉంటాయి. కాళ్ళు పగుళ్లతో పాటు, కాళ్ల మీద తరచూ చర్మం పొడిబారుతున్నట్లు కనబడుతుంటే ఎప్పుడూ పొడవు దుస్తులు వేసుకోవడం మంచిది. ఇలా వేసుకోవడం వల్ల సూర్యుని నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

డ్రై స్కిన్ అంటే చర్మం మీద లేయర్ గా డెడ్ స్కిన్ సెల్స్ చేరడం, చాలా రోజుల నుండి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించకపోవడం వల్ల ఇలా పొడిబారి ఇబ్బందికి గురిచేస్తాయి. చాలా రోజుల నుండి ఆ డెడ్ స్కిన్ లేయర్ ను తొలగించకపోవడం వల్ల అలా వస్తుంటుంది.

మరి ఇలాంటి డ్రై స్కిన్ నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1. ఆలివ్ ఆయిల్ :

1. ఆలివ్ ఆయిల్ :

డ్రై స్కిన్ నివారించడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల కాళ్ళును పూర్తిగా తేమగా ఉంచుతుంది, పాదాలకు మాయిశ్చరైజ్చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

ఆలివ్ ఆయిల్ తీసుకుని, స్నానం చేయడానికి అరగంట ముందు కాళ్లకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. స్నానం చేసిన తర్వాత కూడా కాళ్లకు మాయిశ్చరైజర్ అప్లై చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాలి.

2. పెరుగు తేనె మాస్క్ :

2. పెరుగు తేనె మాస్క్ :

పెరుగు, తేనె మాస్క్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది డ్రై స్కిన్ నివారిస్తుంది. వీటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ డ్రై స్కిన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

అరకప్పు పెరుగులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసిన తర్వాత కాళ్లకు, పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. మిల్క్ క్రీమ్:

3. మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్ లో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల డ్రై అండ్ ఫ్లాకీ స్కిన్ నివారించడంలో , కాళ్లకు తేమను అందించి మాయిశ్చరైజింగ్ ఉంచడంలో సహాయపడుతుంది

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

రెండు స్పూన్ల మిల్క్ క్రీమ్ తీసుకుని, అందులో ఒక స్పూన్ శెనగపిండి మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

4. బీవాక్స్ మరియు హని మాస్క్

4. బీవాక్స్ మరియు హని మాస్క్

బీవాక్స్ మరియు హనీ మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే చర్మానికి తగిన హైడ్రేసన్ ను అందిస్తుంది. ఈ రెండు పదార్థాల్లో యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఆక్సిడెంట్ , హుమక్టెంట్ లక్షణాలు ఉండటం వల్ల కాళ్ళను తేమగా , మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది.

ఎలా ఉఫయోగించాలి:

ఎలా ఉఫయోగించాలి:

కొద్దిగా బీవాక్స్ తీసుకుని, అందులో తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. బివాక్స్ పూర్తిగా తేనె, ఆయిల్లో కరిగిపోయే వరకూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. కొబ్బరి నూనె:

5. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీయాసిడ్స్ చర్మంను మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం తేమగా ఉంచుతుంది.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని కాళ్లకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో పద్దతిలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, గోరువెచ్చగా చేసి, కాళ్లు అప్లై చేసి మసాజ్ చేయాలి.

6 అవొకాడో :

6 అవొకాడో :

కాళ్ల మీద పొడి చర్మాన్ని నివారించడానికి అవొకాడో గొప్పగా సహాయపడుతుంది. అవొకాడోలో ఫ్యాటీయాసిడ్స్ , విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. డ్రైస్కిన్ ను ఇది ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

ఒక స్పూన్ అవొకాడో పేస్ట్ తీసుకుని, కాళ్లకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోతుంది. అవొకాడోలో ఉండే మాలిక్ యాసిడ్స్ వల్ల స్కిన్ డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది. అది డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

7. యాపిల్ సైడర్ వెనిగర్:

7. యాపిల్ సైడర్ వెనిగర్:

మరో హైడ్రేటింగ్ పదార్థం యాపిల్ సైడర్ వెనిగర్, డ్రై స్కిన్ నివారిస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ స్కిన్ ను డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. దాంతో డ్రై స్కిన్ నివారించబడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

ఎలా ఉపయోగించాలి:

అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునిఒక బకెట్ నీటిలో మిక్స్ చేసి, ఈ నీటిలో పాదాలను డిప్ చేయాలి. 15 నిముషాల అలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

8.కోకనట్ షుగర్ స్ర్కబ్ ఈజీ హోం రెమెడీ.

8.కోకనట్ షుగర్ స్ర్కబ్ ఈజీ హోం రెమెడీ.

డ్రై స్కిన్ నివారిస్తుంది. బ్రౌన్ షుగర్ స్కిన్ ను డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది కొబ్బరి నూనె కాళ్లు, పాదాలను మాయిశ్చరైజ్ చేస్తుంది. ఎప్పుడూ తేమగా ఉంచుతుంది.

ఎలా పనిచేస్తుంది:

ఎలా పనిచేస్తుంది:

1/4కప్పు బ్రౌన్ షుగర్ తీసుకుని,అందులో కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, కాళ్ళు, పాదాలకు అప్లై చేయాలి. స్ర్కబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Home Remedies To Treat Dry And Scaly Skin On Legs

Dry skin can generally be flaky and irritating and hence treating this problem at the earliest can benefit you in many ways. Would you want to know how to treat dry and scaly skin on legs, then this article is just for you!
Story first published: Thursday, April 13, 2017, 11:58 [IST]
Desktop Bottom Promotion