For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్స్ ని ఇంట్లోనే తయారుచేయడం ఎలా?

By Ashwini Pappireddy
|

స్కిన్ డల్ నెస్ అనేది అన్ని చర్మాల వారిని వెంటాడే ఒక సాధారణ సమస్య. వివిధ చర్మ రకాల మహిళలు తరచూ దీని గురించి ఫిర్యాదు చేస్తుండటం చూస్తూనే ఉంటాం. ఇలా మొండి చర్మం ఏర్పడటానికి మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహరం, నిర్జలీకరణం, కాలుష్యం మొదలైనవి ముఖ్యమైన కారణాలు కావచ్చు.

ఇలాంటి జీవంలేని మొండి చర్మాన్ని వదిలించుకోవడానికి,చర్మం తెల్లగా అవడానికి మనలో చాలామంది వివిధ రకాల చర్మ ఉత్పత్తులపై అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తూ వుంటారు. అయినప్పటికీ, ఈ ఉత్పత్తుల్లో ఎక్కువభాగం రసాయనిక పదార్థాలతో నిండిపోవడం వలన, మీకు తాత్కాలిక ఫలితాలను ఇవ్వవచ్చు కానీ దీనివల్ల మీ చర్మానికి శాశ్వతంగా తీరని నష్టాన్ని కలిగించవచ్చు.

how to make skin brightening creams at home

మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా? అని మీరు అడగొచ్చు, అయితే కచ్చితంగా ఉందనే చెప్పాలి

కానీ దీనికోసం మీరు చేయాల్సిందల్లా బయట దుకాణాల్లో అందుబాటులో వుంటువంటి రసాయన ఉత్పత్తులకు బదులుగా మీ ఇంట్లోనే సొంతంగా మీరంతట మీరే తయారుచేసుకునే కొన్ని రెసిపీలను మీ కోసం ఇక్కడ తెలియజేయడం జరిగింది. అవేంటో తెలుసుకొని మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

ఈ రెసిపీలు మీ చర్మం యొక్క ఉపరితలం లోనికి చొచ్చుకుపోయి మరియు మొండి చర్మంతో పోరాడుతాయి. అంతేకాక, వీటిలో అన్ని సహజమైన పదార్థాలను ఉపయోగించడం వలన మీ చర్మానికి ఎలాంటి హానిని కలిగించకుండా చర్మం మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఈ రెసిపీలను తయారు చేయడానికి ఉపయోగించే అన్ని పదార్ధాలు శక్తివంతమైన అనామ్లజనకాలు మరియు మెరుపుని పెంచే కారకాలతో నిండివుండటం వలన మీ మొండి చర్మం మీద అద్భుతంగా పనిచేసిజీవంలేని మీ చర్మానికి కొత్త మెరుపుని తీసుకువస్తాయి.

మరి అవేంటో తెలుసుకోడానికి తెలుసుకోవడానికి మీరు సిద్ధం గా వున్నారా, మరెందుకు ఆలస్యం అవేంటో చూసేద్దామా?

రెసిపీ 1:

రెసిపీ 1:

దీనికి అవసరమైన పదార్థాలు ఏంటి?

1 టీస్పూన్ బాదం పొడి

½ టీస్పూన్ తేనె

½ టీస్పూన్ పెరుగు

ఎలా చేయాలి:

- పైన తెలిపిన పదార్థాలన్నీ ఒక బౌల్ లో తీసుకొని క్రీం లా వచ్చేంతవరకు బాగా కలపండి.

- ఈ క్రీం ని మీ చర్మంపై రాసి కాస్సేపు అలానే వదిలేయండి.

- ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి దీనిని ఒక వారం లో 3-4 సార్లు ఉపయోగించవచ్చు.

రెసిపీ 2:

రెసిపీ 2:

దీనికి అవసరమైన పదార్థాలు ఏంటి?

చిటికెడు పసుపు పొడి

½ టీస్పూన్ శనగపిండి

1 టీస్పూన్ నిమ్మ రసం

ఎలా చేయాలి:

- ఒక గిన్నె లో పైన తెలిపిన పదార్థాలను తీసుకొని మరియు క్రీమ్ లాగా వచ్చేదాకా బాగా

కలపండి.

- మీ చర్మంపై నెమ్మదిగా రాసి కాస్సేపు దానిని వదిలేయండి.

- సహజ పదార్థాలతో తయారుచేసిన ఈ క్రీం ని వారానికి ఒకసారి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు

ఉపయోగించడం వలన మొండి చర్మాన్ని వదిలించుకోవచ్చు.

రెసిపీ 3:

రెసిపీ 3:

అవసరమైన పదార్థాలు ఏంటి?

½ టీస్పూన్ నారింజ పై తొక్క పొడి

½ టీస్పూన్ పెరుగు

½ స్పూన్ గులాబీ నీరు

ఎలా చేయాలి:

- ఇంట్లో తయారు చేసుకొనే క్రీమ్ ని పొందడానికి పైన పేర్కొన్న అన్ని పదార్థాలను ఒక బౌల్లో కలపాలి.

- మీరు సిద్ధం చేసుకున్న క్రీం ని మీ చర్మం ఫై అప్లై చేసి కాస్సేపు ఆరనివ్వండి.

- అరగంట తర్వాత దానిని శుభ్రం చేసుకోండి.

- ప్రకాశవంతమైన చర్మం పొందడానికి ప్రతివారం ఇదే పద్దతిని ప్రయత్నించండి.

రెసిపీ 4:

రెసిపీ 4:

మీరు కావాల్సిన పదార్థాలు ఏంటి?

½ టీస్పూన్ బొప్పాయి పొడి

1 టీస్పూన్ దోసకాయ రసం

చిటికెడు చిక్పా పిండి

తయారుచేసే విధానం:

- పైన పేర్కొన్న విధంగా అన్ని పదార్థాలను ఒక గిన్నెలో తీసుకొని క్రీం లా అయేంతవరకు బాగా కలపండి.

- నీటితో శుభ్రంగా కడుకున్న మీ చర్మం ఫై ఈ మిశ్రమాన్ని రాయండి.

- కాస్సేపు ఆరిన తర్వాత మంచి నీటితో కడిగేయండి.

- ఉత్తమ ఫలితాలను పొందడం కోసం, మీరు ప్రతి రోజూ పడుకోబోయే ముందు దీనిని ఉపయోగించవచ్చు.

రెసిపీ 5:

రెసిపీ 5:

అవసరమైన పదార్థాలు:

చిటికెడు దాల్చినచెక్క

½ టీస్పూన్ టమోటా గుజ్జు

½ టీస్పూన్ కలబంద గుజ్జు

ఎలా చేయాలి:

- పైన చెప్పిన భాగాల సమ్మేళనాన్ని తీసుకొని మందపాటి పేస్ట్ లా వచ్చేంతవరకు బాగా కలపండి

- మీ చర్మంపై ఈ క్రీమ్ను రాసి నెమ్మదిగా మర్దనా చేయండి.

- ఒక గంటసేపు అలానే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

- మీ చర్మం కోసం గొప్ప ఫలితాలను పొందడానికి దీనిని ప్రతి వారం తప్పకుండా ప్రయత్నించండి.

రెసిపీ 6:

రెసిపీ 6:

అవసరమైన పదార్థాలు ఏంటి?

½ టీస్పూన్ గంధపు పొడి

½ టీస్పూన్ తేనె

½ టీస్పూన్ పెరుగు

ఎలా చేయాలి:

- పైన తెలిపిన పదార్థాలను కలపడం ద్వారా ఒక క్రీం ని తయారుచేయవచ్చు.

- ఇప్పుడు సిద్ధం చేసుకున్న క్రీం ని మీ చర్మం ఫై రాసి కాసేపు మర్దనా చేయండి.

- గొప్ప ఫలితాలను పొందడానికి, మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవడానికి రోజూ ప్రయత్నించండి.

రెసిపీ 7:

రెసిపీ 7:

దీనికి కావాల్సిన పదార్థాలు:

½ టీస్పూన్ పాల పొడి

4 డ్రాప్స్ బాదం నూనె

½ టీస్పూన్ నిమ్మ రసం

తయారుచేసే విధానం:

- పైన పేర్కొన్న పదార్థాలను ఒక గిన్నెలో తీసుకొని బాగా కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ చర్మం ఫై రాసి కొన్ని గంటల పాటు వదిలేసి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

- గుర్తించదగ్గ ఫలితాలు పొందడానికి దీనిని ఒక వారం లో 2-3 సార్లు ఉపయోగించవచ్చు.

English summary

How To Make Skin Brightening Creams At Home

Dullness is a common beauty problem that women of different skin tones often complaint of. Various factors that cause dull skin are unhealthy diet, dehydration, pollution, etc. The natural ingredients are used for making creams that are packed with powerful antioxidants and other glow-boosting compounds that can make dull-looking skin a thing of the past.
Story first published:Monday, November 27, 2017, 10:16 [IST]
Desktop Bottom Promotion